ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu April Second Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీలో 14 మూవీస్ రిలీజ్.. మరి థియేటర్లలో?

Apr 6 2026 8:15 AM | Updated on Apr 6 2026 9:37 AM

Upcoming OTT Movies Telugu April Second Week 2026

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అడివి శేష్ 'డెకాయిట్'గా వస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదే ఇది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మూవీ ఫలితం ఏంటనేది చూడాలి. దీనితో పాటు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', టొవినో థామస్ 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)

మరోవైపు ఓటీటీల్లోనూ 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రాధిక శరత్ కుమార్ 'తాయ్ కిళవి' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. తు యా మై, హాళ్ అనే పరభాషా చిత్రాలు కూడా పర్లేదనిపించేలా అనిపిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్‌లు ఏమైనా ఉండొచ్చనిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 6 నుంచి 12 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏ‍ప్రిల్ 08

  • 18th రోజ్ (ఫిలిప్పినో మూవీ) - ఏప్రిల్ 09

  • బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏ‍ప్రిల్ 9

  • త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10

  • తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్

  • ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 08

  • క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏ‍ప్రిల్ 10

హాట్‌స్టార్

  • తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10

సోనీ లివ్

  • తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10

జీ5

  • ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10

సన్ నెక్స్ట్

  • హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10

  • కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10

ఆపిల్ టీవీ ప్లస్

  • ఔట్‌కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10

లయన్స్ గేట్ ప్లే

  • వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement