డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా | Maaricha Movie 2026 Telugu OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: తెలుగు హారర్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Apr 5 2026 5:03 PM | Updated on Apr 5 2026 5:13 PM

Maaricha Movie 2026 Telugu OTT Streaming Now

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. మృత్యుంజమ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి అనే తెలుగు చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', 4వ అధ్యాయం లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు వీటితోపాటు ఓ తెలుగు హారర్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)

మదనపల్లెలో తీసిన ఈ సినిమాలో సంతోశ్, సయ్యద్ ఆజం, గౌష్ బాషా, మళ్లీశ్వరమ్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. శివాజీ, సురేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement