సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా | 4 Va Adhyayam Movie OTT Streaming Now Telugu | Sakshi
Sakshi News home page

OTT: రెండేళ్ల క్రితం తమిళంలో.. ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్

Apr 4 2026 9:13 PM | Updated on Apr 5 2026 11:20 AM

4 Va Adhyayam Movie OTT Streaming Now Telugu

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి, సితారే జమీన్ పర్ తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)

2024లో తమిళ వచ్చిన ఆంథాలజీ ‍థ్రిల్లర్ మూవీ 'అధర్మ కదైగల్'. వెట్రి, అమ్ము అభిరామి, సాక్షి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కామరాజ్ వెల్ దర్శకుడు. ఇప్పుడీ ఈ సినిమానే '4వ అధ్యాయం' పేరిట తెలుగులో ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగానే స్ట్రీమింగ్ అవుతోంది.

'4వ అధ్యాయం' విషయానికొస్తే.. మొదటి కథలో నందిని అనే నర్స్, గాయపడిన ఓ రౌడీ విషయంలో సమస్యలు ఎదుర్కొంటుంది. రెండో కథలో ఆన్‌లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు.. డబ్బుల కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేస్తాడు. మూడో స్టోరీలో బీచ్ దగ్గర తిరిగే రౌడీలు వరసగా హత్యకు గురవుతుంటారు. నాలుగో కథలో దివ్య అనే అమ్మాయి, తన తండ్రి ఆపరేషన్ డబ్బులు చెల్లించేందుకు అద్దె గర్భానికి రెడీ అవుతుంది. ఈ నాలుగు చివరకు ఎలా ముగిశాయనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement