breaking news
Tu Yaa Main Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అడివి శేష్ 'డెకాయిట్'గా వస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదే ఇది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మూవీ ఫలితం ఏంటనేది చూడాలి. దీనితో పాటు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', టొవినో థామస్ 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రాధిక శరత్ కుమార్ 'తాయ్ కిళవి' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. తు యా మై, హాళ్ అనే పరభాషా చిత్రాలు కూడా పర్లేదనిపించేలా అనిపిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్‌లు ఏమైనా ఉండొచ్చనిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 6 నుంచి 12 వరకు)నెట్ఫ్లిక్స్బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 0818th రోజ్ (ఫిలిప్పినో మూవీ) - ఏప్రిల్ 09బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 9త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 08క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10హాట్స్టార్తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10సోనీ లివ్‌తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10సన్ నెక్స్ట్హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ఔట్కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లేవైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి
ఇప్పుడంతా ఓటీటీ జమానా. కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా వాటిని చూస్తున్నారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. భయంకరమైన మొసలి.. ఓ ప్రేమ జంటని వెంటాడే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశారు. ఇంతకీ ఇది ఎందులో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిన హిందీ మూవీ 'తు యా మై'. షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. 2018లో వచ్చిన థాయ్ సినిమా 'ద పూల్' ఆధారంగా దీన్ని తీశారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది గానీ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.'తు యా మై' విషయానికొస్తే.. అవని(షనయ కపూర్) మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బాగా డబ్బున్న అమ్మాయి. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా(ఆదర్శ్ గౌరవ్) ఓ ర్యాపర్. గల్లీలో పెరుగుతుంటాడు. ఓ వీడియో చేసేందుకు వీళ్లిద్దరూ కలుస్తారు. తర్వాత ప్రేమలో కూడా పడతారు. కలిసి గోవా వెళ్లిన టైంలో ఓ పాడుబడిన హోటల్లో చిక్కుకుపోతారు. అక్కడి స్మిమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకుంటే వీళ్లని ఓ మొసలి వెంటాడుతుంది. దీని నుంచి ప్రేమజంట బయటపడ్డారా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)


