Thaai Kizhavi Movie
-
రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా
షకీలా పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు. 80-90ల్లో చాలా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఈమె.. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కాల క్రమంలో మూవీ ఛాన్సుల రాకపోవడంతో కనుమరుగైపోయింది. మూడేళ్ల క్రితం అంటే తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్లోనూ పాల్గొంది. కానీ రెండో వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన షకీలా.. రాధిక 'తాయ్ కిళవి' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నిజంగా చెప్పాలంటే 'తాయ్ కిళవి'లో రాధిక బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది' అని షకీలా చెప్పుకొచ్చింది.సీనియర్ నటి రాధిక లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా 'తాయ్ కిళవి'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రిలీజై హిట్ అయింది. పపుంతాయ్ అనే గడుసు వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ల ఆలోచన మార్పు వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రాధిక 'తాయ్ కిళవి' సినిమా తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
ఒకప్పటి హీరోయిన్ రాధిక లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి'. నిర్మాతల్లో హీరో శివకార్తికేయన్ ఒకరు. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.81 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో అద్భుతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా)కథేంటి?పపున్‌తాయ్(రాధిక) ఓ పల్లెటూరి బామ్మ. ఊరిలో అందరూ ఈమె దగ్గర అప్పు తీసుకుంటారు. కానీ వడ్డీ వసూలు చేయడానికి వస్తుందంటే మాత్రం అందరూ తప్పించుకుని పారిపోతుంటారు. దీంతో ఈమె ఎప్పుడు చచ్చిపోతుందా అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరోవైపు ఆస్తి గొడవల కారణంగా ముగ్గురు కొడుకులు ఈమెని వదిలేసి వెళ్లిపోతారు. కట్నంగా మాట్లాడుకున్న మిగిలిన బంగారం ఇవ్వలేదని అల్లుడు, ఈమె కూతురు సురులి(రైచల్ రెబెకా)ని వదిలేస్తాడు. దీంతో కూతురు, మనవడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఓ రోజు పపున్తాయ్కి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఏదో సైగ మాత్రం చేస్తుంటుంది. ఈమె చనిపోవడం పక్కా అనుకుని ఆస్తి పంచుకోవడానికి కొడుకులు, కోడళ్లు తిరిగొస్తారు. అయితే ఈమె దగ్గర 160 తులాల బంగారం ఉందనే రహస్యం తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడుంది? దీనికోసం కొడుకులు, కోడళ్లు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకపోతే సొంత కొడుకులు కూడా తల్లిదండ్రులని పట్టించుకోరు. అలా డబ్బు వల్ల రోజురోజుకీ దారుణంగా మారుతున్న మానవ సంబంధాల్ని కామెడీగా, ఎమోషనల్‌గా చూపిస్తూ చివరలో అద్భుతమైన సందేశం ఇచ్చిన సినిమా 'తాయ్ కిళవి'. చూస్తున్నంతసేపు ఇది సినిమాలా అనిపించదు. మన పక్కనే ఉండే చాలామంది వ్యక్తులా జీవితంలా అనిపిస్తుంది.మనం ఊళ్లలో చూసే గడుసు బామ్మలు ఎలా ఉంటారో పపున్‌తాయ్ కూడా అలానే ఉంటుంది. మాటతీరు, ప్రవర్తన, ఊరిలో ప్రతిఒక్కరిపై చూపించే ఆజమాయిషీ లాంటివి చూపిస్తూ ఈమె పాత్రని పరిచయం చేశారు. ఈమెకు పక్షవాతం రావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆస్తి పంచుకోవాలని ఆరాటపడుతూ తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ఈమె కొడుకులు, కోడళ్లు చేసే పనులు కాస్త అతిగా అనిపిస్తాయి. నిజ జీవితంలో మరీ ఇలా ప్రవర్తించేవాళ్లు ఉంటారా అనిపిస్తుంది. ఎప్పుడైతే 160 తులాల బంగారం గురించి కొడుకులకు తెలుస్తుందో స్టోరీ ట్రాక్‌లో పడుతుంది. అప్పటినుంచి వచ్చే ప్రతి సీన్, చుట్టూ ఉండే పాత్రలు ప్రవర్తించే విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో పపున్తాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు వ్యవహరించే తీరు కూడా నవ్విస్తుంది. కానీ సమాజంలో జరుగుతున్న పలు విషయాల్ని గుర్తుచేస్తాయి. చివరగా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత బామ్మ తన సైగలకు అర్థం చెప్పినప్పుడు ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్ అనిపిస్తుంది. నిజంగా ఈమె దగ్గర అంత బంగారం ఉందా లేదా అనే సీన్ ఆకట్టుకుంది. అలానే మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎలా బతకాలో పపున్‌తాయ్, ఆమె కూతురితో చెప్పించే సీన్స్ అయితే భావోద్వేగానికి గురిచేస్తాయి. వీటికి ప్రతి మహిళ కనెక్ట్ అవుతుంది. అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువగానే ఉన్నాయి.ఎవరెలా చేశారు?పపున్‌తాయ్ అనే వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. ప్రారంభంలో పది నిమిషాలు, చివరి అరగంట మాత్రమే ఈమె కనిపిస్తుంది. కానీ గెటప్, క్లైమాక్స్‌లో ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ మూవీ చూస్తున్నంతసేపు అదేం పెద్ద సమస్యగా అనిపించదు. ఫస్టాప్ లో కాస్త అతి అనిపిస్తుంది కానీ కథలో లీనమైన తర్వాత అవేం పెద్దగా గుర్తుండవు. కమల్ హాసన్ పాటల రిఫరెన్స్‌లతో వచ్చే హంగామా కూడా అలరించింది.'జీవితంలో ఎవరైనా డబ్బు అవసరం లేదని అంటే వాళ్లు డబ్బు సమస్య లేకుండా బతుకుతున్నారని అర్థం. అలాంటి వాళ్ల మాటలు విని మీరు కూడా అలా బతికితే.. అమ్మ నగలు దాచిపెట్టిందా? నాన్న ఆస్తి రాకపోతుందా? అని ఎదురుచూడాల్సి వస్తుంది' అని బామ్మ చెప్పే డైలాగ్.. మనిషికి డబ్బు ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ రాసుకున్న స్టోరీ గానీ తీసిన విధానం గానీ సూపర్. సాంకేతికంగానూ మూవీ బాగుంది. ప్రస్తుతం హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అడివి శేష్ 'డెకాయిట్'గా వస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదే ఇది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మూవీ ఫలితం ఏంటనేది చూడాలి. దీనితో పాటు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', టొవినో థామస్ 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రాధిక శరత్ కుమార్ 'తాయ్ కిళవి' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. తు యా మై, హాళ్ అనే పరభాషా చిత్రాలు కూడా పర్లేదనిపించేలా అనిపిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్‌లు ఏమైనా ఉండొచ్చనిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 6 నుంచి 12 వరకు)నెట్ఫ్లిక్స్బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 0818th రోజ్ (ఫిలిప్పినో మూవీ) - ఏప్రిల్ 09బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 9త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 08క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10హాట్స్టార్తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10సోనీ లివ్‌తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10సన్ నెక్స్ట్హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ఔట్కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లేవైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హీరోయిన్లు వయసు అయిపోయిన తర్వాత సహాయ పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఒకప్పటి హీరోయిన్ రాధిక కూడా అలానే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి, తమిళ హీరో శివకార్తికేయన్ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)రాధిక.. వృద్ధురాలిగా నటించిన సినిమా 'తాయ్ కిళవి'. ఫిబ్రవరి 27న తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్లో రూ.80 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక), ఊరిలో అందరికీ డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేయడం ఈమెకు అలవాటు. తన ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి ఈమెకు మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకొస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) View this post on Instagram A post shared by JioHotstar Tamil (@jiohotstartamil)


