రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా | Shakeela Comments On Thaai Kizhavi Movie, Says She Would Have Excelled Over Radhika In Lead Role Of This Film | Sakshi
Sakshi News home page

Shakeela: ఆ హిట్ సినిమాలో నేను గనక ఉండుంటే..

May 11 2026 3:32 PM | Updated on May 11 2026 5:34 PM

Shakeela About Thaai Kizhavi Movie Radhika Acting

షకీలా పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు. 80-90ల్లో చాలా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఈమె.. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కాల క్రమంలో మూవీ ఛాన్సుల రాకపోవడంతో కనుమరుగైపోయింది. మూడేళ్ల క్రితం అంటే తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్‌లోనూ పాల్గొంది. కానీ రెండో వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన షకీలా.. రాధిక 'తాయ్ కిళవి' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)

'నిజంగా చెప్పాలంటే 'తాయ్ కిళవి'లో రాధిక బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది' అని షకీలా చెప్పుకొచ్చింది.

సీనియర్ నటి రాధిక లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా 'తాయ్ కిళవి'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రిలీజై హిట్ అయింది. పపుంతాయ్ అనే గడుసు వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ల ఆలోచన మార్పు వచ్చే అవకాశముంది. 

(ఇదీ చదవండి: రాధిక 'తాయ్ కిళవి' సినిమా తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement