'ఎవరికైనా అమ్మాయే టార్గెట్.. తన బాధ ఎవరికీ పట్టదు'.. రీతూ చౌదరి షాకింగ్ పోస్ట్ | Bigg Boss Rithu Chowdary Shares About Her Emotional Love And Breakup Story In Social Media, Read Story For More Details | Sakshi
Sakshi News home page

Rithu Chowdary: 'ఎవరికైనా అమ్మాయే టార్గెట్.. తన బాధ ఎవరికీ పట్టదు'.. రీతూ చౌదరి షాకింగ్ పోస్ట్

Mar 17 2026 9:18 AM | Updated on Mar 17 2026 3:37 PM

Rithu Chowdary Emotional and breakup story post in her social media

బిగ్‌బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. గతేడాది బిగ్‌బాస్ సీజన్‌లో మెరిసింది. అయితే ఈ సీజన్‌లో మరో కంటెస్టెంట్ డీమాన్‌ పవన్‌తో కాస్తా సన్నిహితంగా మెలగడంతో డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అమ్మాయిల జీవితం ఇంతేనంటూ తన లైఫ్‌లో జరిగిన బాధను వ్యక్తం చేసింది.

ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్న రీతూ..  రెండేళ్ల క్రితం శ్రీకాంత్ అనే ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. తాజాగా అమ్మాయిల లైఫ్‌ గురించి పోస్ట్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రీతూ చౌదరి తన స్టోరీలో రాస్తూ.. "ఈ సమాజం అమ్మాయిలను సులభంగా జడ్జ్ చేస్తారు. ఆమెకు గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తన ప్రేమ, కేరింగ్, నిజాయతీ గురించి ఎవరికీ అక్కర్లేదు. కానీ  చివరకు మోసపోయేది ఒక అమ్మాయే. రిలేషన్ షిప్ బ్రేకప్, డిప్రెషన్‌లో ఉన్న తన ఫ్యామిలీ కోసం, కెరీర్ కోసం నవ్వుతూ ఉంటుుంది. కానీ సమాజం తన బాధని చూడదు. అందరూ రూమర్స్, ఆరోపణలే చూస్తారు. నిజం ఏంటో తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలు అయితే ఎందుకు సైలెంట్‌గా ఉంది అంటారు' అని ఆవేదన వ్యక్తం చేసింది.

'ఒక అమ్మాయి హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి ముందుకు వెళ్లిపోతాడు. అతను చాలా ఈజీగా మరో అమ్మాయితో వెళ్లిపోతాడు. అన్ని తెలిసినా కూడా సైలెంట్‌గానే ఉంటుంది ఆ అమ్మాయి. కొన్ని సందర్భాల్లో స్నేహం కూడా ఆయధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేస్తుంది. సమాజం ముందు బ్యాడ్ చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని నాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ అమ్మాయి సైలెంట్‌గానే ఉంటుంది. అది తన బలహీనత కాదు..అదంతా తన కర్మ అని.. దేవుడిని నమ్ముతుంది. తన గురించి నిజాలు తెలియని ఈ సమాజం జడ్జ్ చేస్తున్నా కూడా సైలెంట్‌ ఆ బాధని భరిస్తుంది' అంటూ తన స్టోరీలో రాసుకొచ్చింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. రీతూ చెప్పింది అంతా తన గురించేనా? అని చర్చించుకుంటున్నారు. అసలు ఆ అబ్బాయి ఎవరు? తనని నెగిటివ్ చేసిన అమ్మాయి ఎవరు? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్టోరీ తనదేనా లేదంటే తన ఫ్రెండ్‌ గురించేనా? అనేది తెలియాలంటే రీతూ క్లారిటీ ఇవ్వాల్సిందే.

r
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement