వరదల్లో కొట్టుకుపోయిన 'ఇరుముడి' బ్రిడ్జి | Irumudi Movie Bridge Collapse During Heavy Rains | Sakshi
Sakshi News home page

Irumudi Bridge: 'ఇరుముడి' జ్ఞాపకాన్ని చెరిపేసిన జోరు వానలు

Sep 30 2026 12:09 PM | Updated on Sep 30 2026 12:17 PM

Irumudi Movie Bridge Collapse During Heavy Rains

రవితేజ 'ఇరుముడి' సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెలలో థియేటర్లలో విడుదలై ఓటీటీలోకి వచ్చంతవరకు థియేటర్లలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. అయితే ఈ మూవీలో ప్రముఖంగా కనిపించే ఓ చెక్క బ్రిడ్జి.. రీసెంట్‌గా కురిసిన వర్షాల కారణంగా వరదలు వచ్చి కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట పవన్-రీతూ)

'ఇరుముడి' సినిమాలోని కొన్ని సీన్స్.. అల్లూరి జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం దగ్గర తీశారు. మూవీ విడుదలైన తర్వాత ఈ ప్రదేశానికి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. గతంలో వందల సంఖ్యలో మాత్రమే వచ్చేవాళ్లు కాస్త రీసెంట్ టైంలో వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే జలపాతం దగ్గర షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి.. టూరిస్టులని విశేషంగా ఆకట్టుకుంది.

కానీ గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు నీరు ఎక్కువై ఆ తాకిడికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇది పూర్తిగా పాడైపోవడంతో పొల్లూరు వచ్చే పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement