breaking news
polluru
-
పొల్లూరు జల్లింత కావాలిలే..!
మోతుగూడెం: ప్రకృతి అందాలకు నిలయమైన పోలవరం జిల్లాలోని పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీ శాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారై పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా అక్కడి మౌలిక వసతుల కల్పనపై ఆ అటవీశాఖ దృష్టి సారించింది. ఏపీ జెన్కో సంస్థ కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్ నిధులతో ఈ పనులు చేపట్టారు. అభివృద్ధితో పాటు సౌకర్యాలు.. ఏపీ జెన్కో సంస్థ ఇచ్చిన నిధులతో పొల్లూరు జలపాతం వద్ద అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగులు ఎత్తు నుంచి నీరు జాలువారుతూ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఈ జలపాతం పొల్లూరు నుంచి డొంకరాయికి వెళ్లే మార్గంలో రహదారికి అర కిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్‌బే, డొంకరాయి అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ కొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది. ఇక్కడి జలపాతం ప్రవేశ ద్వారాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు 50 వరకు కార్లు పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఈ స్థలాన్ని చదును చేశారు. అలాగే పర్యాటకులు సేదతీరేందుకు రెల్లుగడ్డితో నిర్మిచిన పగోడాలను, కూర్చొనేందుకు వీలుగా గ్రానైట్ బెంచ్‌లు ఏర్పాట్లు చేశారు. జలపాతాన్ని చూడడానికి వచ్చే మహిళల సౌకర్యం కోసం మూడు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు మూడు గదులు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కెప్ట్రే (టీ,కాఫీతో పాటు టిఫిన్, శీతల పానీయాలు) అందించేందుకు షాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సేవానియర్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే అటవీ ఉత్పత్తులను ఈ స్టాల్లో ఉంచి పర్యాటకులకు అందిస్తున్నారు. ఇవే కాకుండా పది మీటర్ల సీసీ రహదారిని రూ.3.5 లక్షలతో నిర్మించారు. సోలార్ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్కింగ్ ప్రాంతాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేన్నారు. అలాగే చెత్త లేకుండా శుభ్రంగా ఉంచడానికి డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 70 శాతం సుందరీకరణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయినట్లు స్థానిక రేంజర్ జి.నానాజీ తెలిపారు. అటవీ మార్గంలో ట్రెక్కింగ్ మారేడుమిల్లి మండలం గుడిస ప్రాంతానికి మోతుగూడెం సమీపాన సుకుమామిడి గ్రామం నుంచి (ఏనుగుల బాట) 12 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఐదు నెలల క్రితం ఈ గ్రామం నుంచి గుడిసె వరకు కొండలు గుట్టలపై ట్రెక్కింగ్ మార్గానికి అటవీశాఖ అధికారులు సర్వే చేశారు. సుమారు ఐదు మీటర్ల వెడల్పున 12 కిలోమీటర్ల మేర కాలిబాటకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు రాగానే దీనికి రూపకల్పన చేయనున్నట్టు వారు తెలిపారు. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారి నుంచి కొంత రుసుము తీసుకొని గైడ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు, అలాగే తరువాత వర్షాకాలం లోపు ఫైర్ క్యాంపింగ్‌తో పాటు, నైట్ స్టే చేసేందుకు క్యాంపింగ్ టెంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. వీటి వల్ల రాత్రి వేళల్లో కూడా గుడిస అందాలను తిలకిస్తూ గడిపేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పర్యాటకులు బస చేసేందుకు మోతుగూడెంలో ఏపీ జెన్కో అతిథి గృహం ఉంది. ఇందులో ఆరు గదులు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉంటే అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రైవేట్ రిసార్టులు పొల్లూరులో ఒకటి, మోతుగూడెంలో ఏడు ఉన్నాయి. గదికి 24 గంటలకు రూ.2500 వరకు అద్దె ఉంటుంది. నలుగురు నుంచి ఆరుగురు ఉండేందుకు అనువుగా ఇవి ఉంటాయి. రిసార్టులలో భోజన సదుపాయం కూడా ఉంది. జలపాతం సందర్శనకు భద్రాచలం, రాజమహేంద్రవరం నుంచి రావచ్చు. ఈ రహదారి మార్గాల్లో బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారి నుంచి కాలినడకన జలపాతం వద్దకు వెళ్లవచ్చు. రాజమహేంద్రవరం నుంచి వచ్చే రహదారి మెరుగ్గా ఉంది. -
ఆహ్లాదం పంచేలా.. 'పొల్లూరు పరవళ్లు'
ప్రకృతి అందాలకు నెలవైన పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్న అటవీశాఖ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. అప్పటి ప్రభుత్వ ఆధ్వర్యంలోఏపీ జెన్కో కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్ నిధులతో పనులు చేపట్టింది. మోతుగూడెం: అల్లూరి జిల్లా పొల్లూరు జలపాతానికి మంచి రోజులు వచ్చాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు బీజం పడటంతో పర్యాటకులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జలపాతం వర్షాకాలంలో, ముఖ్యంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు ఉప్పొంగి ప్రవహిస్తూ చూసేందుకు అందంగా కనిపిస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగుల ఎత్తునుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. » పొల్లూరు నుంచి డొంకరాయి వెళ్లే మార్గంలో రోడ్డుకు అరకిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్‌బే, డొంకరాయి అటవీప్రాంతంలోని కొండలమధ్య నుంచి జాలువారుతూ పొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది. » పర్యాటకంగా ప్రాచుర్యం పొందిన ఈ జల సోయగం అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగింది. దీనిలో భాగంగానే ఈ ప్రాంతాన్ని అటవీశాఖ స్వా«దీనం చేసుకుంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణ నేపథ్యంలో వీటికి సంబంధించి సుమారు రూ.కోటి మేర సీఎస్సార్ నిధులను ఏపీ జెన్కో కేటాయించింది. వీటిలో రూ.50 లక్షలు గత ప్రభుత్వంలో విడుదల అయ్యాయి. » ఏపీ జెన్కో విడుదల చేసిన సీఎస్సార్ నిధులతో జలపాతం ప్రవేశద్వారాన్ని పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటుచేశారు. సుమారు 50 కార్లు పార్కింగ్‌కు అనుకూలంగా స్థలాన్ని చదును చేశారు. పర్యాటకులు సేదతీరేందుకు రెల్లిగడ్డితో పగోడాలు నిర్మించారు. కూర్చునేందుకు వీలుగా సుమారు 8 సిమెంటు బెంచీలు ఏర్పాటుచేశారు. ప్రవేశద్వారం నుంచి జలపాతం వరకు అరకిలోమీటరు పొడవునా గ్రావెల్‌తో మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటుచేశారు. » జలపాతం వద్ద ప్రమాదకర ప్రాంతంలో పర్యాటకుల రక్షణ నిమిత్తం సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటుచేశారు. ఇక్కడ స్థానిక గిరియువత ఐదుగురితో సొసైటీ ఏర్పాటుచేసి ఉపాధి కల్పించారు. కారు పార్కింగ్‌కు రూ.50, బస్సుకు రూ.100 వసూలు చేస్తున్నారు. జలపాతం సందర్శించే వారికి ఒకొక్కరికి రూ.20 ప్రవేశ రుసుం చెల్లించాలి. వీటికి మరికొంత మొత్తాన్ని జోడించి అటవీశాఖ వీరికి చెల్లిస్తోంది. మంజూరైన సీఎస్సార్ నిధులు రూ.50 లక్షల్లో ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షలు ఖర్చుచేసినట్టు అటవీశాఖ అధికారవర్గాలు తెలిపాయి. » జలపాతాన్ని ఇటీవల ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి సందర్శించారు. లక్కవరం అటవీరేంజి పరిధిలో సుకుమామిడి గ్రామం నుంచి అటవీప్రాంతం గుండా గుడిసె వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవునా ట్రెక్కింగ్ నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై సర్వేకు ఆదేశించారు. మోతుగూడెం అటవీశాఖ కార్యాలయం ఎదురుగా గుట్టపై ఉన్న గెస్ట్ హౌస్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. » పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు ప్రధానరోడ్డు నుంచి ప్రవేశద్వారం వరకు సిమెంట్ ఫ్లోరింగ్ చేపట్టేందుకు రూ.5లక్షలతో అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవికాకుండా పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు పురుషులు, మహిళలకు ఆరు గదులు పూర్తిస్థాయిలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. తిను బండారాల స్టాళ్లు ఏర్పాటుకు పక్కా భవనం నిర్మించి స్థానిక గిరి యువతకు అప్పగించే ఆలోచనలో అటవీశాఖ ఉంది. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాంగత ప్రభుత్వంలో మంజూరైన రూ.50 లక్షల్లో ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షలు మౌలిక వసతుల కల్పనకు కేటాయించాం. మిగిలిన రూ.30 లక్షలతోపాటు మరో రూ.45 లక్షలు విడుదల అయ్యాయి. వీటిని పొల్లూరు జలపాతంతో పాటు పరిసర పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యవంతంగా మౌలిక వసతులకు కల్పనకు వెచ్చిస్తాం. – జి.నానాజి, రేంజ్ అధికారి, లక్కవరం బస చేయాలంటే..పొల్లూరు జలపాత సందర్శనకు వచ్చే పర్యాటకులు బస చేసేందుకు మోతుగూడెంలో ఏపీ జెన్కో అతిథి గృహం ఉంది. ఆరు సూట్లు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉంటే అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రైవేట్ రిసార్టులు పొల్లూరులో ఒకటి, మోతుగూడెంలో 7 ఉన్నాయి. రూమ్‌కు రోజుకు (24 గంటలు) రూ.2500 వరకు అద్దె ఉంటుంది. నలుగురు నుంచి ఆరుగురు ఉండేందుకు అనువుగా ఉంటుంది. రిసార్ట్‌ల్లో భోజన సదుపాయం ఉంది. ఇలా వెళ్లాలి..పొల్లూరు జలపాతం సందర్శనకు భద్రాచలం, నర్సీపట్నం, రాజమండ్రి నుంచి రావొచ్చు. ఈరోడ్డు మార్గాల్లో బస్సు సౌకర్యం ఉంది. ప్రధాన రోడ్డు నుంచి కాలినడకన జలపాతం వద్దకు వెళ్లొచ్చు. భద్రాచలం, రాజమండ్రి నుంచి వచ్చే రోడ్డు సౌకర్యం మెరుగ్గానే ఉంది. నర్సీపట్నం నుంచి వచ్చే వారు గూడెంకొత్తవీధి నుంచి వై.రామవరం మండలం పాలగెడ్డ వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర రోడ్డు బాగులేనందున ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. -
పొల్లూరు.. సరిలేరు
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం గుర్తింపు పొందనుంది. 460 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ కేంద్రంలో రెండో దశలో చేపట్టిన రెండు యూనిట్ల నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే లక్ష్యంతో ఏపీ జెన్కో అధికారులు వేగవంతం చేశారు. ఇవి పూర్తయితే ఉత్పాదన సామర్థ్యం 690 మెగావాట్లకు పెరగనుంది.మోతుగూడెం: లోయర్ సీలేరు కాంప్లెక్స్‌లోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఆధునికీకరణ పనులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 115 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగు యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు యూనిట్ల నిర్మాణానికి ప్రాజెక్ట్ ప్రారంభం (1977)లోనే గ్రౌండ్ లెవెల్, స్ట్రక్చర్ సివిల్ పనులు పూర్తి చేశారు. గత ప్రభుత్వంలో రూ.536 కోట్ల్ల కేటాయింపు రాష్ట్ర విభజన తరువాత డిమాండ్‌కు తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో అధిక ధరలకు ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుచూపుతో ఇదే ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే లక్ష్యంతో ప్రణాళికపరంగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అదనంగా అదే సామర్థ్యంతో 5,6 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.ఇందుకు రూ.536 కోట్లు వెచ్చించింది. రెండేళ్ల క్రితమే టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖల నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. దీనిపై ప్రత్యేకదృష్టి సారించిన గత ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేసింది. రెండు యూనిట్లకు సంబంధించి ఇప్పటివరకు సివిల్, పెన్‌స్టాక్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. ⇒ ఐదో యూనిట్‌కు సంబంధించి సివిల్ పనులు ఫ్లోర్ శ్లాబ్ వరకు జరిగాయి. కీలకమైన స్పారల్ కేసింగ్, స్టీరింగ్ ఎరెక్షన్ పనులు పూర్తయినట్టు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ⇒ ఆరో యూనిట్‌కు సంబంధించి సివిల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వాల్వు హౌస్ నుంచి టెరి్మనల్ యాంకర్ వరకు పెన్‌స్టాక్ పైపులైను నిర్మాణం పూర్తయింది. జనరేటర్ అసెంబ్లింగ్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. బీహెచ్ఈఎల్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ⇒ ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి కీలకమైన విడి భాగాలు కంపెనీ నుంచి పవర్ హౌస్‌కు అనుకున్న సమయానికి వచ్చేలా ఏపీ జెన్కో అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే మార్చినాటికి పనులు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ బాలకృష్ణ తెలిపారు. పనులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా జరిగేలా బీహెచ్ఈఎల్, పీఎస్ కంపెనీ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. -
పొల్లూరు 2,4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేత
మోతుగూడెం : సీలేరు కాంప్లెక్స్‌లోని పొల్లూరు జల విద్యుత్కేంద్రంలో రెండు, నాలుగు యూనిట్లలో ఎర్త్ సమస్య తలెత్తింది. దీంతో సోమ, మంగళవారాల్లో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రంలో మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా, మూడో యూనిట్లో నెల రోజుల కిందటే విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు 2, 4 యూనిట్లలో కూడా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు యూనిట్లు పనిచేయకపోవడంతో మొత్తం 460 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేవలం 115 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో అధికంగా ఉత్పత్తి చేయాల్సిన సమయంలో మూడు యూనిట్లు మొరాయించడంతో జెన్కోకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.


