పొల్లూరు 2,4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేత | polluru | Sakshi
Sakshi News home page

పొల్లూరు 2,4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేత

Sep 15 2016 12:11 AM | Updated on Sep 4 2017 1:29 PM

సీలేరు కాంప్లెక్స్‌లోని పొల్లూరు జల విద్యుత్కేంద్రంలో రెండు, నాలుగు యూనిట్లలో ఎర్త్‌ సమస్య తలెత్తింది. దీంతో సోమ, మంగళవారాల్లో 230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రంలో మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా, మూడో యూనిట్లో నెల రోజుల కిందటే విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

మోతుగూడెం :
సీలేరు కాంప్లెక్స్‌లోని పొల్లూరు జల విద్యుత్కేంద్రంలో రెండు, నాలుగు యూనిట్లలో ఎర్త్‌ సమస్య తలెత్తింది. దీంతో సోమ, మంగళవారాల్లో  230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రంలో మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా, మూడో యూనిట్లో నెల రోజుల కిందటే విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు 2, 4 యూనిట్లలో కూడా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు యూనిట్లు పనిచేయకపోవడంతో మొత్తం 460 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేవలం 115 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో అధికంగా ఉత్పత్తి చేయాల్సిన సమయంలో మూడు యూనిట్లు మొరాయించడంతో జెన్‌కోకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement