అనుష్క కొత్త సినిమా అప్‌డేట్.. ఆ బ్యానర్‌లో హ్యాట్రిక్‌ చిత్రం | Anushka Shetty Movie With Naveen Polishetty In UV Creations Banner | Sakshi
Sakshi News home page

Anushka Shetty: అనుష్క కొత్త సినిమా అప్‌డేట్.. ఆ బ్యానర్‌లో హ్యాట్రిక్‌ చిత్రం

Published Fri, Apr 1 2022 8:55 PM | Last Updated on Fri, Apr 1 2022 9:11 PM

Anushka Shetty Movie With Naveen Polishetty In UV Creations Banner - Sakshi

Anushka Shetty Movie With Naveen Polishetty In UV Creations Banner: దక్షిణాదిలో స్టార్‌ హీరోలకు సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో మోస్ట్‌ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో నటిస్తోందంటూ వార్తలు వస్తు‍న్నప్పటికీ అవి పుకార్లో నిజమో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆమె ఫ్యాన్స్. 

చదవండి: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..!

ఈ నేపథ్యంలోనే అనుష్క యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ తర్వాత నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఏప్రిల్‌ 4 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిపింది. ఇందులో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్‌ కాలేదు. ఈ సినిమాను 'రారా.. కృష్ణయ్య' దర్శకుడు మహేష్‌ బాబు పి డైరెక్ట్‌ చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లోనే అనుష్క మిర్చీ, భాగమతి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు అనుష్క 48వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా యూవీ బ్యానర్‌లో హైట్రిక్‌ చిత్రం. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ సక్సెస్‌ పార్టీలో అనుష్క సందడి, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement