అనుష్క 'ఘాటి' కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది | Anushka Shetty Ghaati Movie New Release Date Out Now | Sakshi
Sakshi News home page

Ghaati Movie: అనుష్క 'ఘాటి' రిలీజ్‌ ఎప్పుడంటే?

Jun 2 2025 5:38 PM | Updated on Jun 2 2025 6:33 PM

Anushka Shetty Ghaati Movie New Release Date Out Now

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి (Anushka Shetty) వెండితెరపై కనిపించి రెండేళ్లవుతోంది. ఈసారి ఆమె పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుంది. ఘాటి చిత్రం (Ghaati Movie)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 18న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. 

దీంతో తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ఘాటి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అందులో అనుష్క, విక్రమ్ ప్రభు నదిలో సంచులు మోసుకుంటూ వెళుతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై వంశీ కృష్ణారెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగవెల్లి విద్యాసాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

'వేదం'తర్వాత అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ కలిసిన చేస్తున్న రెండో చిత్రమిది. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం. అనుష్క ఈ సినిమాతో పాటు మలయాళంలో కథనార్‌: ద వైల్డ్‌ సోర్సరర్‌ చేస్తోంది. ఇవి కాకుండా మరో నాలుగైదు సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అవేవీ బయటకు చెప్పకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచుతోంది.

 

చదవండి: బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా

Advertisement
 
Advertisement
Advertisement