
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్లపై ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇండో–కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్, కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌ని త్వరలో ప్రకటించి, ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు.
‘‘ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఈ చిత్రీకరణలో భాగంగా రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూట్ చేశాం. ప్రస్తుతం మిగతా పాటల కంపోజింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – తమన్ కాంబినేషన్‌లో మరోసారి మంచి ఆల్బమ్ రానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.