బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా: హీరోయిన్‌ | Moushumi Chatterjee Breaking Down in Tears over a Backless Blouse in Movie | Sakshi
Sakshi News home page

మైనర్‌ వివాహం.. సెట్‌లో అలా చేయగానే భర్తకు ఫోన్‌ చేశా: హీరోయిన్‌

Jun 2 2025 5:00 PM | Updated on Jun 2 2025 6:24 PM

Moushumi Chatterjee Breaking Down in Tears over a Backless Blouse in Movie

ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణించినవారిలో మౌసమి చటర్జీ (Moushumi Chatterjee) ఒకరు. మౌసమి అసలు పేరు ఇందిర. చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేజర్‌ కాకముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. తన ఆంటీ చివరి కోరిక మేరకు పదో తరగతిలో ఉండగానే జయంత్‌ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అనురాగ్‌ అనే చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంధురాలిగా నటించింది. ఈ సినిమా సక్సెస్‌తో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. అయితే అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది.

నా వల్ల కాలేదు
కానీ ఓ సినిమా యూనిట్‌ చేసిన పనికి తను భయంతో రోదించానంటోంది మౌసమి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1973లో వచ్చిన కుచ్చె ఢాగె సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన ఇది.. నాకు బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌, పొట్టి గాగ్రా ఇచ్చి వేసుకోమన్నారు. అవి చూడగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆ డ్రెస్‌ వేసుకున్నా వేసుకోనట్లే అనిపించింది. వెంటనే నా భర్తకు ఫోన్‌ చేసి నాకిక్కడ పని చేయాలని లేదు.. 

ఒక్క ఫోన్‌ కాల్‌..
నన్ను కోల్‌కతాకు పంపించేయమని వేడుకున్నాను. అప్పటికే వాళ్లు నా బట్టలన్నీ తీసేసుకున్నారు. నా ఫోన్‌కాల్‌తో ఆయన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ డ్రెస్‌ వేసుకుంటే తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అలా ఆ సినిమా పూర్తి చేశాను. పొట్టి స్కర్టు ధరించాల్సి ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డి సినిమాను రిజెక్ట్‌ చేశాను అని చెప్పుకొచ్చింది. గుడ్డి చిత్రంలో జయా బచ్చన్‌ నటించగా ఇది కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచింది.

సినిమా
మౌసమి 'ఆరి' అనే బెంగాలీ చిత్రంతో ఇటీవలే వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఆమె చివరగా నటించిన పీకు సినిమా కూడా మే 9న రీరిలీజ్‌ అయింది. బాలీవుడ్‌లో మౌసమి.. రోటీ కపడా ఔర్‌ మకాన్‌, అనారి, జిందగీ, స్వర్గ్‌ నరక్‌, ఫూల్‌ ఖిలే హై గుల్షన్‌ గుల్షన్‌, ప్రేమ్‌ బంధన్‌, స్వయంవర్‌, అంగూర్‌, నిశ్చయ్‌ వంటి పలు చిత్రాలు చేసింది.

చదవండి: నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్‌ ఒప్పుకోలేదు: సింగర్‌

Advertisement
 
Advertisement
Advertisement