నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్‌ ఒప్పుకోలేదు: సింగర్‌ | Adnan Sami Reveals Why He Gave Up Pakistan, Chose India | Sakshi
Sakshi News home page

Adnan Sami: పాక్‌లో నా పని ఖతం.. ఆ సింగర్‌ సలహా వల్లే ఇక్కడ..! డబ్బు కోసం రాలేదు

Jun 2 2025 4:01 PM | Updated on Jun 2 2025 4:17 PM

Adnan Sami Reveals Why He Gave Up Pakistan, Chose India

అద్నాన్‌ సమీ (Adnan Sami).. పాకిస్తాన్‌ ఈ సింగర్‌ స్వదేశాన్ని కాదనుకుని భారత్‌పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప ‍స్థానం సంపాదించుకున్న ఇతడిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇవన్నీ పాకిస్తాన్‌కు గిట్టలేదు. అవకాశం దొరికినప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెట్టిందట.

తల్లి చనిపోయిందని తెలిసినా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అద్నాన్‌ సమీ మాట్లాడుతూ.. మా అమ్మ బేగం నౌరీన్‌ పాక్‌లో మరణించింది. తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రెండు దేశాలను కోరాను. భారత్‌ అందుకు అంగీకరించినా.. పాక్‌ మాత్రం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మా అమ్మ చనిపోయిందని చెప్పినా కూడా వీసా ఇవ్వలేదు. వాట్సాప్‌ వీడియోలో తన అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది.

భారత్‌ సొంతిల్లుగా ఎలా మారిందంటే?
1998లో నేను కొన్ని పాటలు రిలీజ్‌ చేశాను. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక నా పని అయిపోయిందని అంతా అన్నారు. నా పాటలకు మార్కెటింగ్‌ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు నా పాటలు ఎప్పుడొచ్చాయో, పోయాయో కూడా ఎవరికీ తెలీదు. నన్ను తొక్కేయాలనే అదంతా చేస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను.

ఆమె సలహా వల్లే..
సింగర్‌ ఆశా భోంస్లేతో మాట్లాడాను. ఇక్కడున్నవాళ్లు నాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇకపై లండన్‌లోనే మీతో కలిసి పని చేస్తాను అని చెప్పాను. అందుకామె లండన్‌లో రికార్డ్‌ చేయడం దేనికి? నీకు నిజంగా ఏదైనా కొత్తగా చేయాలనుంటే ముంబైకి వచ్చేయ్‌. ఇక్కడ హిట్టయిన పాటలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని చెప్పింది.

కోట్లు విలువైన ఆస్తుల్ని వదులుకుని..
అలా నేను ముంబై వచ్చాను. ఆమె దివంగత భర్త, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్‌డీ బర్మన్‌ ఇంట్లోనే బస చేశాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాకిస్తాన్‌లో వర్కవుట్‌ కాని పాటలన్నీ ఇక్కడ ఎంతో ఆదరణ పొందాయి. ప్రజల ప్రేమకు ఎంతగానో సంతోషించాను. డబ్బు సంపాదించడం కోసం ఇక్కడకు రాలేదు. అంతేకాదు, పాకిస్తాన్‌లో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వదిలేసుకుని ఇక్కడే స్థిరపడిపోయాను అని చెప్పుకొచ్చాడు.

కెరీర్‌..
అద్నాన్‌ సమీ.. తెలుగులో యే జిల్లా.. (శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌), నచ్చావే నైజాం పోరీ.. (వర్షం), నేనంటే నాకు చాలానే ఇష్టం.. (ఊసరవెల్లి), నిన్ను చూడకుండా నేను ఉండలేనే.. (దేనికైనా రెడీ), ఓ ప్రియా ప్రియా.. (ఇష్క్‌) ఇలా అనేక పాటలు పాడాడు. హిందీ, ఉర్దు, ఇంగ్లీష్‌, తమిళ, కన్నడ, మలయాళంలో అనేక సాంగ్స్‌ ఆలపించాడు.

చదవండి: రీరిలీజ్‌లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. నీ వల్ల అవుద్ది సామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement