Asha Bhosle
-
ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్
ఆశా భోంస్లేకు దుబాయ్, కతార్, సింగపూర్, యూరప్‌లలో ‘ఆశాస్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. అన్నింట్లోనూ ఒక పదార్థం చాలా గిరాకీ. దాని పేరు ‘షాహీ కబాబ్’. మెనూ తెరిస్తే షాషీ కబాబ్ పక్కన చిన్న అక్షరాల్లో ‘లెర్న్›్ట ఫ్రమ్ మిసెస్ మజ్రూ సుల్తాన్ పురి’ అని ఉంటుంది. ప్రఖ్యాత సినీ కవి మజ్రూ శ్రీమతి బేగంజీ నేర్పిన షాహీ కబాబ్ రెసిపీ ఆశాకు ఒక పెద్ద వరంగా మారింది. ఆ వంట మహత్యం కథ ఇది.ఆశా రికార్డింగ్స్‌తో బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి పిల్లలకు ఏదో ఒకటి వండి పెట్టాలని తల్లిగా కోరుకునేది. ఒక్కోసారి వీలయ్యేది కాదు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చేసరికి చిన్న కుమారుడు ఆనంద్ చాలా హుషారుగా ఉన్నాడు. ‘ఏంట్రా’ అని అడిగితే బజారులో కబాబ్ తిన్నాడట... అది తినడం మొదటిసారట... ‘చాలా బాగుంది... ఇక మీదట దానిని చేసి పెడుతుండు’ అని అడిగాడు. కాని ఆశాకు కబాబ్ చేయడం రాదు. కబాబ్ చేయడం ఎవరు నేర్పిస్తారా అని ఆలోచిస్తే మజ్రూ సుల్తాన్‌పురి శ్రీమతి గుర్తుకొచ్చింది. మజ్రూ స్నేహితులు, బంధువులు అందరూ ఆమెను ‘బేగంజీ’ అని పిలుస్తారు. బేగంజీకి ఫోన్ చేసి ‘నా కొడుకు కోసం కబాబ్ ఎలా చేయాలో నేర్పిస్తావా?’ అని అడిగింది ఆశా. ‘ఓ అదెంత సేపు... ఇంటికి రా’ అని పిలిచింది బేగంజీ.అలా మజ్రూ ఇంటికి నాలుగైదుసార్లు వెళ్లిన ఆశా ‘కబాబ్’ చేయడం నేర్చుకుంది. అయితే ఆమెకు మెల్లగా ఒక విషయం అర్థమైంది. ముంబైలో ఆ తర్వాత ఎన్నోచోట్ల ఆశా కబాబ్ ట్రై చేసినా మజ్రూ శ్రీమతి చూపించిన కబాబ్ రుచి వేరు బయట బజారులో దొరుకుతున్న కబాబ్ రుచి వేరు. ఏంటా అని ఆలోచించి మళ్లీ మజ్రూ ఇంటికి వెళ్లింది ఆశా. అప్పుడు బేగంజీ నవ్వేసి ‘ఆశా... నీకు నేర్పింది షాబీ కబాబ్. అది కేవలం లక్నోలో ఉండే కొందరు నవాబుల ఇళ్లల్లోని స్త్రీలకు మాత్రమే తెలిసిన రెసిపీ. ఆ రెసిపీ రహస్యాన్ని నీకు చెప్పాను’ అంది. షాహీ అంటే బాదుషాహీ... రాజస అని అర్థం. అలనాడు ఒక లక్నో నవాబు గారికి నోట్లో పళ్లు లేకపోతే నోట వేయగానే మెత్తగా కరిగిపోయే షాహీ కబాబ్‌ను వంటవాళ్లు కనిపెట్టారట. అలా పుట్టిందా కబాబ్. దాని రెసిపీ బేగంజీ దయ వల్ల ఆశా వశమైంది.బేగంజీ ఆశాకు నేర్పిన పాఠం ఏమిటి? ‘ఆశా... కబాబ్ చేయడానికి కావాల్సింది మసాలా కాదు... సబర్. అంటే ఓర్పు. రాత్రంతా మాంసాన్ని మసాలాలో నానబెట్టాలి. మెత్తగా రుబ్బిన జీడిపప్పు, గసగసాలు, దహీ, పచ్చి బొప్పాయి... ఇవన్నీ కలిపి 12 గంటలు ఊరనివ్వాలి. తొందరపడితే రుచి రాదు. పాటలాగే వంట కూడా సాధన చేస్తేనే వస్తుంది’ అని చెప్పిందామె. తర్వాతి రోజుల్లో ఆశా చేసిన షాహీ కబాబ్‌లు తిన్న భర్త, సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ ‘ఆశా... నువ్వు పాడటం మానేసినా పర్లేదు. కబాబ్‌లు చేస్తూ బతికేయొచ్చు’ అనేవాడు. ఆశా ఇంట్లో పార్టీ జరిగితే మెనూలో షాహీ కబాబ్ తప్పనిసరి. అక్కాచెల్లెళ్ల మధ్య ఎన్ని స్పర్ధలు ఉన్నా ఆశా చేసిన కబాబ్‌ని లతా ఇష్టపడేది. ఒకసారి లతాకి నలతగా ఉంటే ఆశా స్వయంగా షాహీ కబాబ్ చేసి పంపిందట. తిన్నాక లతా ఫోన్‌చేసి ‘చాలా బాగుంది’ అని ఒక్క మాట అందట. మాటల్లేని తమ మధ్య షాహీ కబాబ్ అలా మాట కలిపింది. అన్నట్టు కబాబ్ వెనక కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆశా చెప్పింది – ‘నేను బాధలో ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్తాను. కబాబ్ కోసం మసాలా దంచుతూ, ఉల్లిపాయ కోస్తూ ఏడుస్తాను. కన్నీళ్లు ఉల్లిపాయవే అని అందరూ అనుకుంటారు’ అని. ఏమైనా మజ్రూహ్ సుల్తాన్ పురి తన కలంతో అక్షరాలకు రుచి అద్దితే, ఆయన భార్య బేగంజీ కబాబ్‌కి రుచి అద్దింది. ఆ రుచిని ఆశా ప్రపంచమంతా పంచుతోంది. – కె -
ఆశా భోంస్లేకి నివాళి.. పాకిస్తాన్ ఛానల్‌కు నోటీసులు!
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణించారంటూ తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, ఆ సందర్భంగా భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినందుకు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఛానల్‌కు నోటీసులు జారీ చేసింది.తప్పుడు వార్తలు ప్రసారంలెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం ఆమె అంతక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌కు చెందిన 'జియో న్యూస్' కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది.పాటలతో పాటు వీడియో క్లిప్పింగులుఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్లో ప్రసారం చేశారు. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పెమ్రా సీరియస్ అవుతూ.. సదరు న్యూస్ ఛానల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్‌పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పేముంది?పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని పునఃపరిశీలించి, కీర్తించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. నిజానికి, ఆశా భోస్లే వంటి గొప్ప కళాకారిణికి సంబంధించి, ఆమె కాలాతీతమైన, చిరస్మరణీయమైన పాటలను మనం పంచుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పంచుకోవాల్సింది. అయినప్పటికీ పెమ్రా (PEMRA), దీనిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది’ అని అబ్బాస్ ట్వీట్ చేశారు. భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026 -
సింగర్ ఆశా భోస్లే అంతిమయాత్ర
-
ఆశా భోంస్లే భౌతికకాయాన్ని చూసి సచిన్ కన్నీరు మున్నీరు..
-
ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు
భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆశా భోంస్లే భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలోని లోయర్ పారెల్‌లోని ఆమె నివాసంలో ఉంచారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిండే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటులు ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, వివేక్ ఒబెరాయ్, విక్కీ కౌశల్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ‘శివ సేన’ పార్టీ ఆధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వంటి వారితో పాటు పలువురు సినిమా, పొలిటికల్, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆశా భోంస్లే నివాసం నుంచి దాదర్‌లోని శివాజీ ΄పార్క్ శ్మశాన వాటిక వరకు భారీ జనసందోహం నడుమ ఆమె అంతిమయాత్ర కొనసాగింది. ఆశా భోంస్లేని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘ఆశా భోంస్లే అమర్ రహే’ అనే నినాదాలతో, అశ్రునయనాల నడుమ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లి ఆశా భోంస్లేకు కుమారుడు ఆనంద్ భోంస్లే అంత్యక్రియలు నిర్వహించారు. -
అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్షాట్లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్‌పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా.. ఆదివారం ఏప్రిల్ 12న లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Athiya Shetty gone mad She uploaded a picture of Lata Mangeshkar instead of Asha Bhosle. 😭 pic.twitter.com/bKCZPBAjjG— Mohit (@Warlockmohit) April 12, 2026 Athiya Shetty Is Beauty Without Brains She posted a story with photo of Late Lata Mangeshkar instead of Late Asha Bhosle.Nepo kids just want to be relevant somehow, without hardwork or struggle and that's why their movies flop and they make such blunders. https://t.co/hy3KvJwUUo pic.twitter.com/4TXjZ0SJJ3— Vidhi (@vidhisharmx) April 12, 2026 -
సింగర్ ఆశా భోస్లే అంతిమ యాత్ర
-
రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle) అనారోగ్య కారణాలతో 92 ఏళ్ల వయసులో (ఏప్రిల్ 12, 2026న) కన్నుమూశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు, సంగీతాభిమానులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని దర్శించి , తుది నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆమె నివాసం 'కాసా గ్రాండే'కు తరలి వచ్చారు. వీరితోపాటు, ప్రధాని మోదీ సహా, పలువురు రాజకీయ, సినీ రంగాలప్రతినిధులు, ఇతర సెలబ్రిటీలు ఆశామరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె వారసురాలు, గాయని జానై భోంస్లే (Zanai Bhosle) వార్తల్లోనిలిచారు. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే. తన నాన్నమ్మలా ఈమె గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన కథక్ నర్తకి , రచయిత్రి, నటి కూడా. ఈమె ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కుమార్తె. ఆమె లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మేనకోడలు కూడా. ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. సంగీతం , కళల పట్ల ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదంనాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జానై శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాయనిగా రాణించారు. వివిధ స్టేజ్ షోలలో తన నాయనమ్మ ఆశా భోంస్లేతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ మ్యూజిక్ బ్యాండ్ "6-ప్యాక్ బ్యాండ్" (6-Pack Band) లో పాటలు పాడారు. 2022 సెప్టెంబర్ 8న, ఆశా 89వ పుట్టినరోజు సందర్భంగా జానై భోస్లే, మంచి కవితను పోస్ట్ చేశారు.సినిమా రంగ ప్రవేశంజానై భోంస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. రిషబ్ శెట్టి సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) అనే భారీ పీరియడ్ డ్రామాతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంస్లే పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.వ్యాపారవేత్తగాసోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జునై గాయనిగా, నటి మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. ముంబైలో ఆమెకు సొంతంగా యాపిల్ ఐఫోన్ (Apple iPhone) రిటైల్ స్టోర్ ఉంది, ఆశా భోంస్లే స్వయంగా తన మనవరాలి గురించి చాలా సార్లు ప్రస్తావించేవారు. జునై చాలా ప్రతిభావంతురాలని, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని పలు సందర్భాల్లో ప్రశంసించారు.సిరాజ్‌తో షికార్లు అంటూ పుకార్లు2025 ప్రారంభంలో జానై భోస్లే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ల మధ్య ఉన్న సంబంధం గురించిన పుకార్లు షికార్లు చేశాయి. అయితే, రక్షాబంధన్ రోజున సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ ఈ పుకార్లకు ఇద్దరూ చెక్ పెట్టారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)దివంగత ఆశాకు కడసారి నివాళి అర్పించేందుకు క్రికెటర్ సిరాజ్ ముంబైలోని ఆమె నివాసానికి వచ్చారు. సిరాజ్‌ను చూడగానే జానై భోస్లే భోరున విలపించింది. సిరాజ్ ఆమెను ఓదారుస్తూ అక్కున చేర్చుకోవడం విశేషం. -
ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ సచిన్ కన్నీళ్లు
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. లెజెండరీ గాయని ఆశా భోంస్లే మరణ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆశా భోంస్లే అంత్యక్రియలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం ముంబైలోని స్వగృహంలో ఆశా భోంస్లే భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో ఆమె పార్ధివ దేహానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి నివాళులు అర్పించారు.VIDEO | Mumbai: Sachin Tendulkar gets emotional as he arrives to pay tribute to legendary singer Asha Bhosle at her residence in Grande, Lower Parel.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/lLA2qis5Nq— Press Trust of India (@PTI_News) April 13, 2026ఈ సందర్భంగా సచిన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆశా భోంస్లేతో సచిన్ కుటుంబానికి దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఆమెను తన కుటుంబ సభ్యురాలిగానే సచిన్ భావించేవారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow)చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
అక్కాచెల్లెళ్లు తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!
దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్‌కాస్ట్‌లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..గతేడాది ఆర్జే అన్మోల్, అతని భార్య నటి అమృతరావు హోస్ట్ చేసిన 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్‌కాస్ట్‌తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. View this post on Instagram A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar) "నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం. ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్గ్రీన్ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె. View this post on Instagram A post shared by RJ Anmol 🇮🇳 (@rjanmol27) (చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!) -
ఎన్నడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ..!
బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశాభోంస్లే ఎనిమిది దశాబ్దాలుగా సాగిన నేపథ్య గాన వృత్తికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎందరో అభిమానుల మనసు దోచుకున్న ఆ మధుర స్వరం 92 ఏళ్ల వయసులో ఏప్రిల్ 12, 2026న నిశబ్దంగా మారిపోయింది. బహుళ అవయవాల వైఫల్యం కారణంగా గాయని ఆశా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆ గాయని మిగిల్చిన కొన్ని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుందామా..79 ఏళ్ల వయసులో ఆశా మనీష్ మల్హోత్రా కోసం ర్యాంప్‌పై నడచి తనదైన శైలి, హుందాతనంతో అందర్నీ ఆశ్చర్యపరించారామె. దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసని అంటున్నారు మనీష్ మల్హోత్రా నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ. తన షోలలో ఒకదానిలో ఆమె నడిచిన తీరును గుర్తుచేసుకుంటూ, ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. నా ఫ్యాషన్ వీక్ షోలో మీరు ఉన్నప్పటి చిత్రాలు ఇవి అంటూ నాటి ఫోటోలను షేర్ చేస్తూ..ర్యాంప్‌పై ఒక్కసారైన నడవాలన్నదే నా కోరిక అని నాతో చెప్పారు.ఆ నిమిత్తమై మేము మిమ్మల్ని సాధరంగా అడిగినప్పుడూ.. మీరు వెంటనే అంగీకరించిఎంతో హుందాగా, స్టైలిష్‌గా సంతోషంగా నడిచారు. మీరు అలా ర్యాంప్‌పై నడవగానే..ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అది నేనెప్పుడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ. మీరు ఎప్పటికీ మా హృదయలో పదిలంగా ఉంటారు అంటూ మల్హోత్రా తన పోస్ట్‌ని ముగించారు. కాగా, ఆశా భోంస్లే పార్థివ దేహాన్ని ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆమె ఇంటికి తీసుకెవెళ్లారు. పార్థివ దేహాన్ని సోమవారం(ఏప్రిల్ 13, 2026) మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!) -
ఆమె మరణం తీరని లోటు
‘‘ఓ మధురమైన స్వరాన్ని కోల్పోయాం. ఆమె మరణం తీరని లోటు’’ అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆశా భోంస్లేకి నివాళి అర్పించారు.తరతరాలుగా విభిన్నమైన భావోద్వేగాలను పలికిస్తూ, ఆశా భోంస్లేగారి గాత్రం భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి పాటకూ గ్రేస్, విలక్షణతను తీసుకువచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని స్వరాన్ని కోల్పోయింది.– నటుడు చిరంజీవిశాశ్వతమైన గాయనీ...! అంటూ తాను నటించిన ‘చాచీ 420’ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట ‘జాగో ఘోరీ..’ను, ఆమెతో తాను ఉన్న క్లిప్పింగ్స్‌ను షేర్ చేశారు.– నటుడు కమల్‌హాసన్.ఆశా భోంస్లేగారి మరణంతో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె స్వరం కేవలం సంగీతం మాత్రమే కాదు... మన జీవితాల్లోని ప్రతి దశను స్పృశిస్తూ మనతో జీవించిన ఒక భావోద్వేగం. తరతరాలుగా ఆమెలా ప్రజల హృదయాలను తాకిన కళాకారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు. ఆమె స్వరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – నటుడు మోహన్ బాబుదశాబ్దాల పాటు ఆశా భోంస్లేగారి మ్యాజికల్ వాయిస్ భారతీయ సినిమాకు ్రపాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలుగా నిలిచిపోయే జ్ఞాపకాలను ఆమె వదిలి వెళ్లారు. ప్రేమ, గౌరవాలతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. – నటుడు ఎన్టీఆర్భారతీయ సంగీతానికి తీరని లోటు. ఆశా భోంస్లేగారి గాత్రం స్వచ్ఛమైన మ్యాజిక్ అండ్ ఎమోషన్ . ఆమె లెగసీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆశాగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నటుడు రామ్చరణ్ఆశా భోంస్లేగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. తరతరాలను నిర్వచించిన ఆమె స్వరం ఎప్పటికీ నిలిచిపోతుంది. – అల్లు అర్జున్భారతీయ సంగీతానికి తీరని లోటు. మీ స్వరానికి సాటి లేదు... మీ పాటలు తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. – నటుడు సల్మాన్ ఖాన్ఆశా తాయ్ (మరాఠీలో పెద్దక్క అని అర్థం) మరణవార్త బాధ కలిగించింది. భారతీయ సినిమాకు ఆమె గాత్రం ఒక మూలస్తంభంలాంటిది. భవిష్యత్‌లో శతాబ్దాల పాటు ఆశాగారి గాత్రపు మాధుర్యం కొనసాగుతూనే ఉంటుంది. – నటుడు షారుక్ ఖాన్ఆశాగారి మరణం దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆమెకు నేను పెద్ద అభిమానిని. గొప్ప గాయకులు రఫీ, కిషోర్, లతగార్లు లేరు. ఇప్పుడు ఆశాగారూ మనకు దూరమయ్యారు. ఓ శకం ముగిసిందని నాకు అనిపిస్తోంది. ఆశాగారి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు... దేశం, ప్రపంచానికే నష్టం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – నటుడు ఆమిర్ ఖాన్మన దేశానికి స్వాతంత్య్రం లభించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ అనే పాటను ఆమెతో కలిసి రికార్డు చేసే అవకాశం నాకు లభించింది. మా అమ్మని కాకుండా నేను అమ్మా అని పిలిచే మరొక వ్యక్తి ఆశాగారు మాత్రమే. ‘శ్రీవల్లీ..’ సాంగ్ (పుష్ప: ది రైజ్’లోని పాట..) ఆమెకు నచ్చింది. ఆశా అమ్మ... మిమ్మల్ని చాలాసార్లు కలిసే చాన్స్ నాకు దక్కింది. అది నాకు పెద్ద ఆశీర్వాదం. సంగీతం పట్ల మీ అంకితభావం, ప్యాషన్ ను నేను ప్రత్యక్షంగా చూశాను. – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ఆమె గాత్రం ఒక మ్యాజిక్. ఆమెతో ఓ సాంగ్‌ను షేర్ చేసుకునే గౌరవం నాకు లభించింది. ఆశాగారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. భారతీయ సంగీతానికి ఆమె మరణం తీరని లోటు. – నటుడు సంజయ్ దత్ఒక శకం ముగిసింది. నేను ముంబైలో ఎక్కడున్నా ప్రభుకుంజ్ (ముంబైలో ఆశా ఎక్కువ కాలం నివసించిన భవనం) దాటి వెళ్తున్నప్పుడు తొలుత లతాగారికి ఫోన్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆశాజీగారిని కలిసేదాన్ని. ఆమె స్థానాన్ని మరొక సింగర్ భర్తీ చేయలేరు.– గాయని ఉషా ఉతుప్మనందరికీ, భారతీయ సంగీతానికి ఎంతో బాధాకరమైన రోజు ఇది. మన ప్రియమైన ఆశా సోదరి ఇక లేరన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె స్వరం ఎప్పటికీ జీవించే ఉంటుంది.– గాయకుడు–సంగీతదర్శకుడు శంకర్ మహదేవన్తన పాటలకు జీవకళను అద్ది, ఎంతో ప్రత్యేకతను చాటుకున్న ఆశాగారు ఇక లేరనే విషయం నమ్మశక్యంగా లేదు. ఆశాగారితో నాకు ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడిన అనుబంధం ఉంది. అందుకే ఆమె ఇక లేరన్న విషయం నాకు కష్టంగా అనిపిస్తోంది. నేను నటించిన సినిమాల్లోని పాటలను ప్రత్యేకమైన తన గాత్రం, శైలితో పాపులర్ చేశారామె. చిత్ర పరిశ్రమలో నా ఎదుగుదలలో భాగస్వామ్యమైన లతా, ఆశాగార్లతో నాకు మంచి అనుబంధం ఉంది. – నటి హేమ మాలినిభారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక గాయనిని కోల్పోయిన రోజు ఇది. ఆమె నాతో ఎంత ప్రేమాభిమానాలతో ఉండేవారో, గాయనిగా అంతే గౌరవమర్యాదలతో నడుచుకునేవారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేని ఓ స్థానంలో ఉంటారామె. వేరే ఏ స్వరంతోనూ పోల్చలేని ఓ ప్రత్యేకమైన స్వరం ఆమెది. ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా నన్ను కలిసేవారు. నా ఆత్మీయ సోదరి. – సంగీతదర్శకుడు ఇళయరాజాఆశాగారు తన గాత్రంతో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఆమె గొప్ప కళాకారిణి. – సంగీతదర్శకుడు, ఏఆర్ రెహమాన్ఆమె గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా? ఆమె సాధించలేనిదంటూ ఏమైనా ఉందా? పనులు ఎలా చేయాలో మా అందరికీ చూపించిన వ్యక్తి. నిజమైన మార్గదర్శకురాలు. – గాయని చిన్మయిఆశాజీ మరణవార్త విని నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆశాజీని కోల్పోవడం అంటే మా అమ్మగారిని రెండోసారి కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంగీత ప్రపంచంలో నా వేలు పట్టుకుని, నా చేత తొలి అడుగులు వేయించి, నాకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, నా మొట్టమొదటి స్వరకల్పనకు గాత్రం అందించారు ఆమె. బహుముఖ ప్రజ్ఞాశాలి. అద్భుతమైన గాయని. ఆమెలా మరొకరు ఎప్పటికీ రారు. ఒక శకం ముగిసింది. – గాయకుడు అనూ మాలిక్ఆశా తాయ్ ఒక సింగర్‌గా, మంచి మానవతావాదిగా, లెజెండ్లా ఎప్పటికీ నిలిచిపోయే ఉంటారు. ఆమె స్వరానికి తగ్గట్లుగా మేం నటించేందుకు ముందే ప్రిపేర్ అయి, వస్తుంటాం. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆశాగారి సాంగ్ రికార్డింగ్ చూశాను. ఓ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆ మెలోడి సాంగ్‌కు ఆమె చూపిన ప్రతభలో నటిగా నేను పది శాతం ప్రతిభ చూపినా నేనో గొప్ప యాక్టర్ అవుతానని ఆమెకు చెప్పాను. – నటి కాజోల్నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సింగర్ ఆశాగారి మరణం నన్ను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లో రెహమాన్ లాంటి కొత్త సంగీత దర్శకుడితో ప్రయోగాలు చేయాలనే ఉత్సుకతతో వచ్చి, విప్పారిన కళ్లతో చూసిన ఓ పాపలా ఆమె కనిపించారు. చిన్న అడ్జెస్ట్‌మెంట్‌తో సింగిల్ టేక్‌లోనే ఈ పాట పూర్తయింది. ఆశ్చర్యకరంగా నా ‘కంపెనీ’ సినిమాలో ఆమె ‘ఖల్లాస్’ పాటను పాడారు. ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తవుతున్నాయి. శాస్త్రీయ సంగీత మూలాలను, ఆధునిక లయల్లో విభిన్నమైన భావోద్వేగాలతో పలు భాషలకు అనుసంధానిస్తూ ఆమె స్వరం తరతరాలుగా నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. మానవ భావోద్వేగాలను ఆమె ఆవిష్కరించినట్లు మరెవరూ ఆవిష్కరించలేరు. ఆశాజీ... మీరు మరొక చోటుకు వెళ్లి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ సంగీతం శాశ్వతంగా నిలిచే ఉంటుంది.– దర్శకుడు రామ్‌గోపాల్ వర్మఆశా భోంస్లేగారు మధురమైన గానంతో ఎన్నో తరాలను అలరించారు. ఆమె ప్రతిభ, ఆమె స్వరం ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయి ఉంటాయి. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవి. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. మహాగాయని మనతో లేకపోవడాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. బాలీవుడ్లో తన అద్భుతమైన స్వరంతో నాకిచ్చినటువంటి అమోఘమైన పాటలు మరపురానివి. ‘శరాబీ’ చిత్రంలో ‘దే దే ప్యార్ దే..’, ‘తోఫా తోఫా’ పాటలు కానీ... తెలుగులో ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం...’ అనే పాటను కానీ అద్భుతంగా ఆలపించారు. లతా మంగేష్కర్‌గారు కానీ, ఆశా భోంస్లే దీదీ కానీ నా జీవితంలో నాకిచ్చినటువంటి ఈ అనుభూతిని మర్చిపోలేను. ఆశా భోంస్లే లేని లోటు నాకే కాదు... వ్యక్తిగతంగా ప్రజలకు, సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు. అలాంటి గాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇక మనకు దొరకరేమో! – నటి జయప్రద -
వేయి యుద్ధాల విజేత
ఆమె పాడటానికి పోరాడింది. జీవించడానికి పోరాడింది. ‘సింగిల్ మదర్’గా పిల్లల్ని పెంచడానికి పోరాడింది. తన కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని రెండో వివాహం చేసుకొని లోకంతో పోరాడింది. పాటకు చిరునామాగా ఎదిగిన సొంత అక్కను ఎదిరించి తన ఉనికి చాటుకోవడానికి పోరాడింది. ఆశా భోంస్లే తన అంతిమ శ్వాస వరకూ పోరాడుతూనే ఉంది. ప్రతి యుద్ధాన్ని గెలుస్తూనే ఉంది. ఆమె జీవితం అసామాన్యం. ఆమెకే సాధ్యం.తన సొంత అక్క లతా మంగేష్కర్ లానే ఆశా భోంస్లేకు కూడా చదువు లేదు. షోలాపూర్‌లో వీరి కుటుంబం ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఫీజ్ కట్టలేక అక్కచెల్లెళ్లు ఇద్దరూ బడికి వెళ్లడం మానేశారు. నలుగురు అక్కచెల్లెళ్లు లత, ఆశ, ఉష, మీన... ఒక తమ్ముడు హృదయనాథ్... మొత్తం అయిదుగురు సంతానం. తమ్ముడు శారీరకంగా బలహీనుడు. తండ్రి దీనానాథ్ మరణానంతరం కుటుంబాన్ని మోయాల్సిన భారం లత తీసుకుంది. బొంబైలో చాలీ చాలని జీవితం మొదలైంది. ఆ సమయంలోనే ఆశాకు ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఆశా భోంస్లేది తన అక్కలాగా ఒద్దిక స్వభావం కాదు. స్వేచ్ఛ, సాహసం, తెగింపు ఆమె సొంతం. ఆకాశానికి తొందరగా ఎగిరి ఏమేమి వింతలున్నాయో చూద్దామని కోరిక. ఆ కోరిక ఆమెను తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన గణ్పత్రావు భోంస్లేతో ప్రేమ వివాహం చేసుకునేలా ప్రేరేపించింది. గణ్పత్రావు అప్పుడప్పుడే సంగీతంలో ఎదుగుతున్న లతా మంగేష్కర్‌కు మేనేజర్. ఈ పెళ్లి లతాను శరాఘాతంగా తాకింది. మంగేష్కర్ కుటుంబ పరువు గంగలో కలిసిందని లతాకు అనిపించింది. ఈ పెద్ద సంసారంలో నుంచి బయటపడే వాకిలి దొరికిందని ఆశా భావించింది. కాని ఈ నిర్ణయం ఆశాను జీవితాంతం వెంటాడింది. అత్తగారింటిలో నానా బాధలు పడింది. చిన్న వయసులో ఇద్దరు పిల్లల్ని కని, ఆ తర్వాత మూడోసారి గర్భంతో ఉండగా ఇక ఆత్మహత్య చేసు కోలేక ఇంటి నుంచి పారిపోయింది. అయితే లత ఆమెను అడుగు పెట్టనివ్వలేదు. సినిమా రంగం ఇంకా ఆమెను గుర్తించనే లేదు. 18 ఏళ్లు కూడా నిండని గాయని, ముగ్గురు పిల్లల తల్లి, సినిమా రంగంలో నిలదొక్కుకోవాలి. ఆశా తన పోరాటం మొదలెట్టింది.క్లబ్ సాంగ్స్ కనికరంఆ రోజుల్లో ‘వ్యక్తిత్వం’ చాలా ప్రధానం. హీరోయిన్ వ్యక్తిత్వం, ఆమెకు పాడే గాయని వ్యక్తిత్వం పాత్రను బట్టి, పాటను బట్టి వెల్లడి అవుతాయి. హీరోయిన్ కు లతా మంగేష్కర్ పాడేది. అవి ‘వ్యక్తిత్వం’ ఉన్న పాటలు. కాని వేంప్లు ఉంటారు. వాళ్లకు ఎవరు పాడాలి? ఆశా భోంస్లేకు పిలుపు వచ్చింది. అలాంటి పాటలు పాడితే లోకం ఏమనుకుంటుంది? బతకడానికి దోవ చూపని లోకం ఏమనుకుంటే ఏమిటి... అని ఆశా రంగంలోకి దిగింది. ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ (‘శ్రీ 420’)లో నాదిరా పాట గుర్తు ఉందా? అది ఆశా పాడింది. అప్పుడే అదృష్టవశాత్తు హెలెన్ రంగ ప్రవేశం చేసింది. ఆమె డాన్సింగ్ గర్ల్. ఆమెకు సరిపడా డాన్సింగ్ వాయిస్ కావాలి. ఆశా భోంస్లే ఈ అవకాశాన్ని అందుకుంది. ఆశా ఫీల్డ్‌లో నిలవడానికి హెలెన్ డాన్స్, హెలెన్ డాన్స్‌లో రాణించడానికి ఆశా గొంతు ఒకరికి ఒకరు సాయం చేసుకున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో లెక్కలేనన్ని హిట్ పాటలు వచ్చాయి. ‘పియా తూ అబ్ తో ఆజా’... ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ‘డాన్ ’లో ‘అయ్ మేరా దిల్ ΄్యార్ కా దీవానా’.... మెరుపుతీగ.నయ్యర్ సహకారంఎంత చెప్పినా ఎన్ని చేసినా సినిమా రంగం మగవారి సామ్రాజ్యం. ఇక్కడ ఎవరో ఒకరు అండగా ఉంటే తప్ప ఎదగడం కష్టం. అయితే ప్రతిభ లేకపోతే ఎవరూ అండగా నిలవరు. ఆశాకు ప్రతిభ ఉన్నా లతాకు భయపడి అవకాశాలు ఇవ్వడానికి జంకేవారు. ఆ రోజుల్లో ఆశా కోసం నిలబడిన వాడు సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్. లతాతో అస్సలు పాడించడానికి ఇష్టపడని ఈ మొండివాడు ఆశాకు పాటల దారులు పరిచాడు. ఆమె గొంతు చేరగల ఎత్తులకు చేర్చాడు. వీరిద్దరూ కలిసి లెక్కలేనన్ని హిట్స్ ఇచ్చారు. ‘జాయియే ఆప్ కహా జాయేంగే’ (మేరే సనమ్), ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ (నయా దౌర్), ‘ఆయియే మెహర్బాన్ ’ (హౌరా బ్రిడ్జ్), ‘ఆవో హుజూర్ తుమ్కో’ (కిస్మత్)... ఎన్నని. ‘కాశ్మీర్ కీ కలీ’లో రఫీ, ఆశాలు చేసిన మేజిక్ ఓ.పి. నయ్యర్ వల్ల సాధ్యమైందే. అయితే నయ్యర్ ఆశా ఘనతను చాటాడే తప్ప గాయనిగా ఆశా స్టేటస్ పెంచలేకపోయాడు. దానికి ఖయ్యాం కావాల్సి వచ్చింది.ఉమ్రావ్ జాన్ కీ అదాఒక ఛాలెంజింగ్ వ్యక్తిత్వం మరో ఛాలెంజింగ్ గాయనికి జీవితం ఇవ్వడం ఇండియన్ స్క్రీన్ మీదే జరిగింది. ఉమ్రావ్ జాన్ అనే ‘తవాయిఫ్’ (దర్బారు గాయక నర్తకి) జీవితాన్ని సినిమాగా తీసినప్పుడు ఆమెకు మేచ్ అయ్యే గొంతు ఆశాదే అని భావించాడు సంగీత దర్శకుడు ఖయ్యాం. అప్పటివరకూ గజల్స్‌ను లతా మాత్రమే పాడాలనుకునేవారు. కాని ఖయ్యాం ఆశాతో పాడించాడు. ‘దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరే జాన్ లీజియే’... ఉమ్రావ్ జాన్‌లో ఈ పాట ఆశాను జాతీయ గాయనిగా మార్చింది. జాతీయ పురస్కారం తెచ్చి పెట్టింది. తన సుదీర్ఘ పోరాటంతో తాను కేవలం క్లబ్ సాంగ్స్ గాయని కాదనీ ఉత్కృష్ట గాయని అని ఆశా నిరూపించింది.ఆర్.డి. బర్మన్ శకంఆ తర్వాత ఆర్.డి. బర్మన్ వచ్చి ఆశా గొంతు ఎంత వర్సటైలో లోకానికి చూపించాడు. ‘తీస్రీ మంజిల్’లో ‘ఆజా ఆజా మై హూ ΄్యార్ తేరా’ సంచలనం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక పాట ముళ్లు లేని గులాబి పువ్వులా శోభిస్తూనే ఉంది. అది – ‘చురాలియా హై తుమ్ మేరే దిల్‌కో’. తర్వాతి రోజుల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ జోడీకి గుల్జార్ తోడయ్యాక ఇంకా గొప్ప పాటలు చోటు చేసుకున్నాయి. ‘మేరా కుచ్ సామాన్ ’ (ఇజాజత్)... ‘రోజ్ రోజ్ ఆంఖో తలే’ (జీవా)... అభిరుచి ఉన్న రసజ్ఞులను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగులో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జీవితం సప్త సాగర గీతం’ ఒక మనోహర గీతం.పాట... వంటస్త్రీకి ఆర్థిక స్వాతంత్రం, ఆత్మనిర్భరత ఉండాలని భావించిన ఆశా భోంస్లే గాయనిగా కొనసాగుతూనే వ్యాపార రంగంలో కూడా తన ప్రతిభ చూపింది. ఆమె స్వయంగా గొప్ప వంటగత్తె. అందుకని దేశంలోనే కాదు దుబాయ్‌లో కూడా అనేక రెస్టరెంట్లను ప్రారంభించింది. ఆమె అన్ని రెస్టరెంట్లు గొప్ప జనాదరణ ΄÷ందుతున్నాయి. జీవితంలో బంధాల రుచి కూడా ఉండాలని భావించిన ఆమె ఆ తర్వాతి రోజుల్లో అక్క లతాతో సయోధ్య చేసుకోగలిగింది.ఉత్సాహ స్వరంజీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఆశా తన స్వరంలో ఉత్సాహాన్ని తప్పిపోనివ్వ లేదు. లైవ్‌షోస్ చేస్తూ ప్రపంచాన్ని చుట్టిందామె. నాటి తరంతో నేటి తరం వరకూ పని చేసింది. ఏ.ఆర్. రెహమాన్ ‘రంగీలా’ పాటలు సూపర్ హిట్ కావడానికి ఆశా భోంస్లే గళం ఒక కారణం. దక్షణాదిలో ఇళయరాజా సంగీతంలో చాలా పాటలు పాడిందామె. ‘నా అభిమాన గాయని ఆశా’ అని ఇళయరాజా చెప్పుకున్నారు. ఆయన సంగీతంలో ఆశా పాడిన ‘ఓ ప్రేమా’ (అశ్వమే థం) పాట చాలా బాగుంటుంది. కృష్ణవంశీ తీసిన ‘చందమామ’లో ఆశా పాట ‘నాలో ఊహలకు నాలో ఊసులకు’ చాలా బాగుంటుంది. ఆశా భోంస్లే జీవితం ఓటమికి వెరువకు అని చెప్తుంది. జీవన గీతాన్ని కొనసాగిస్తూ ఉండమని ఉపదేశం ఇస్తుంటుంది. ఆశా నోట తెలుగు పాటఆశా భోంస్లే హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళం వంటి 20కి పైగా భాషల్లో సుమారు 11,000లకు పై చిలుకు పాటలు పాడారు. అంతేకాదు అన్ని పాటలు పాడినందుకుగానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నారామె. అయితే తెలుగులో ఆమె తక్కువ పాటలు పాడినప్పటికీ అన్నీ ఆల్ టైమ్ హిట్స్‌గా నిలవడంతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకున్నారు ఆశా భోంస్లే. తెలుగులో ఎంతో మధురంగా ఆమె పాడిన పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టులో ఉంటాయనడం అతిశయోక్తి కాదు. మంచు మోహన్ బాబు, జయప్రద జోడీగా దాసరి నారా యణరావు దర్శకత్వం వహించిన ‘పాలు–నీళ్లు’ (1981) తెలుగులో ఆమెకు తొలి చిత్రం. ఈ మూవీలో ‘ఇది మౌనగీతం ఒక మూగరాగం పాడింది...’ అనే పాటని ఆలపించారు. ‘చిన్ని కృష్ణుడు’ (1988) చిత్రంలో ‘జీవితం సప్త సాగరం..’, ‘అశ్వమేథం’ (1992) మూవీలో ‘సీతాకాలం ప్రేమకు, ఓ ప్రేమ’ వంటి పాటలు ఆలపించారు. అలాగే ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’ (1995) సినిమాలో ‘జలంధి మధి..’, ‘పవిత్ర బంధం’ (1996) చిత్రంలో ‘ఐస్సలకిడి..’ పాట ఆలపించారు. అదే విధంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన ‘ఇద్దరు’ (1997) మూవీలో ‘వెన్నెల..’ పాట పాడారామె. కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చందమామ’ సినిమాలో ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు...’ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెలోడీ సాంగ్‌ని ఇప్పటికీ యువత తెగ ఇష్టపడుతుంటారు.అవార్డులుఅద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆశా భోంస్లే తన ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ‘ఉమ్రావ్ జాన్ ’ సినిమా కోసం పాడిన ‘దిల్ చీజ్ క్యా హై...’ పాటకి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా 1981లో, ‘ఇజ్జత్’ చిత్రంలో పాడిన ‘మేరా కుచ్ సమాన్ ...’ సాంగ్‌కి బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా 1986లో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు ఆశా భోంస్లే. అదే విధంగా చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ని (2000) అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి 2008లో ‘పద్మ విభూషణ్’ అవార్డు సొంతం చేసుకున్నారు. అదే విధంగా 2001లో ఫిల్మ్ ఫేర్ నుంచి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 18 మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.ఐదొందలు పందెం...తన కెరీర్లో ఎన్నో వేలకు పైగా పాటలు పాడిన ఆశా భోంస్లేకి ఓ పాట సవాల్ విసిరిందంటే విశేషమనే చె΄్పాలి. షమ్మీ కపూర్, ఆశా పరేఖ్, హెలెన్, ప్రేమనాథ్, ఇఫ్తేకర్, ప్రేమ్ చోప్రా ప్రధాన పాత్రల్లో విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీస్రీ మంజిల్’. నాసిర్ హుస్సేన్ నిర్మించిన ఈ సినిమా 1966 అక్టోబరు 21న విడుదలైంది. ఆర్డీ బర్మన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని హిట్ సాంగ్ ‘అహహ ఆజా...’ పాటను మహ్మద్ రఫీతో కలిసి పాడారు ఆశా భోంస్లే. ఈ పాట పల్లవి ఆఖరున వచ్చే ‘అహహ ఆజా అఅ ఆజా..’ను విభిన్నంగా పాడాల్సి వచ్చిందట. అయితే అనుకున్నట్లు రాకపోవడంతో వేరే శైలిలో చేద్దామని ఆర్డీ బర్మన్ ఆమెను అడిగారట.. ‘వేరేలా అవసరం లేదు... నేను పాడగలను’ అన్నారట ఆశా. ‘అహహ ఆజా..’ను మహ్మద్ రఫీ బాగా పాడగలడని నాసిర్ హుస్సేన్, ఆయన కన్నా ఆశా భోంస్లే బాగా పాడగలదంటూ ఆర్డీ బర్మన్ సరదాగా రికార్డింగ్ స్టూడియోలోనే రూ. 500 పందెం వేసుకున్నారట. ఈ పాట సమయంలో బర్మన్ –ఆశా æ మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి దారి తీసింది. 1980లో వీరి పెళ్లి జరిగింది. 1994లో ఆర్డీ బర్మన్ మృతి చెందారు.– ఖదీర్ -
సుర లోకానికి అమర స్వరం
‘ఈనా మీనా డీకా’.. ఆమెది రాక్ ఎన్ రోల్ స్వరం. ‘పియా తూ అబ్ తో ఆజా’.. ఆమెది నర్తించే గళం. ‘ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా’.. ఆమెది యుగళ గీతం. ‘దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరే జాన్ లీజియే’... ఆమెది బరువైన వేదనా జాలం. ఆశా భోంస్లే. డాన్సింగ్ వాయిస్ ఆఫ్ ఇండియా. నర్తించే గళం. 12000 పాటలు పాడి దశాబ్దాల పాటు భారతీయ శ్రోతల జీవితాల్లో హుషారును నింపి నేడు స్వరసుర లోకానికి బయలుదేరింది. దివ్య పుష్పమై దేవలోక ‘లత’కు చేరింది. బాలీవుడ్ గోల్డెన్ ఎరా ముగింపుకొచ్చింది. ఆశా భోంస్లే మరణ వార్త విని అభిమానులు చేస్తున్న వేడుకోలు– ‘అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ’....ముంబై: దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన అద్భుత గాత్రం మూగబోయింది. కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించిన అసమాన స్వర ఝరి శాశ్వతంగా ఆగిపోయింది. ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల ఆశా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తోపాటు శ్వాస సంబంధిత సమస్యతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లే ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆశా అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోయర్ పరేల్‌లోని కాసా గ్రాండ్లో అభిమానులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించవచ్చని కుమారుడు ఆనంద్ తెలిపారు. ఆశా మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. లెజెండరీ సింగర్ దూరం కావడం చిత్ర పరిశ్రమలకు, అభిమానులకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాడిన రికార్డు ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో సంప్రదాయ మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆమె సోదరీమణుల్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రోత్సాహంతో ఆశ సంగీతం నేర్చుకున్నారు. 1943లో పదేళ్ల వయసులో మరాఠీ చిత్రం ‘మజా బల్’లో తొలి గీతం ఆలపించారు. 2010 దశకం వరకూ పాడుతూనే ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటలు పాడిన సింగర్‌గా రికార్డుకెక్కారు. గాయనిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాలే్క, 2008లో పద్మభూషణ్, 2018లో బంగ భూషణ్, 2021లో మహారాష్ట్ర భూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. జాతీయ అవార్డులు, గౌరవాలకు లెక్కేలేదు. ఆశా భోంస్లే 1949లో 16 ఏళ్ల వయసులోనే గణపతిరావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు పుట్టాక వారు విడిపోయారు. అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ను పెళ్లాడారు. 80 ఏళ్లలో 14 భాషల్లో 12,000కు పైగా పాటలతో అభిమానులను రంజింపజేశారు. యాదోం కీ బారాత్, హమ్ దోనో, హరే రామ హరే కృష్ణ, డాన్, నమక్ హలాల్, ఉమ్రావ్ జాన్, కిస్మత్, మేరా సాయా, తీస్రీ మంజిల్, మేరా జీవన్ సాథీ తదితర చిత్రాల్లో ఆశ పాడిన పాటలు దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఆశ వంట కూడా అద్భుతంగా చేస్తారన్న పేరుంది. ‘ఆశాస్’పేరిట ఇంటర్నేషనల్ రెస్టారెంట్ చైన్‌ను ఏర్పాటు చేశారు. చాలా దేశాల్లో రెస్టారెంట్లు నెలకొల్పారు. భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారు: ముర్ము ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచంలో ఒక తీరని లోటును సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. దిగ్గజ గాయనిగా ఆశ సాగించిన అద్భుత ప్రస్థానం భారత సంగీత చరిత్రలో ఒక యుగాన్ని సృష్టించిందని కొనియాడారు. ఆమెతో వ్యక్తిగతంగా సంభాషించిన తీపి జ్ఞాపకాలు తనకున్నాయని వెల్లడించారు. మధురమైన, చిరస్థాయిగా నిలిచిపోయే స్వరంతో దశాబ్దాల పాటు భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు. ఆమె సంగీతం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆశా భోంస్లే వైవిధ్యమైన స్వరం అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అన్ని రకాల పాటలు, హృద్యమైన గజల్స్, సంప్రదాయ భజనలతో ఆకట్టుకున్నారని తెలిపారు. భావి తరాలకు స్ఫూర్తి: మోదీ దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆమె పాటలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని ‘ఎక్స్’లో స్పష్టంచేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను స్పృశించిందని ఉద్ఘాటించారు. దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రఖ్యాత గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోంస్లే మరణం తనకు తీవ్ర విచారం కలిగించిందన్నారు. ఆమెతో తన సంభాషణలు మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని వెల్లడించారు. ఆశా భోంస్లే కుటుంబానికి, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. భవిష్యత్ తరాలకు ఆమె ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటారని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఆశా భోంస్లే మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు. భారతీయ సంగీత రంగంలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆమె తన విలక్షణ గాత్రం ద్వారా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారని వివరించారు. -
సింగర్ ఆశా భోస్లే.. ఆమె పాడిన తెలుగు పాటలేవో తెలుసా?
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇవాళ కన్నుమూశారు. శనివారం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. వేల పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోస్లే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం పట్ల యావత్ సినీ లోకం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా ఆశా పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమె తన గాత్రం అందించారు. లతా మంగేష్కర్ సిస్టర్ అయిన ఆశా తెలుగులో పాడిన పాటలు పాడి ఆడియన్స్‌ను అలరించారు. ఆమె మరణం వేళ... తెలుగులో పాడిన పాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా)ఇసాలకిడీ (పవిత్ర బంధం)వెన్నెల (ఇద్దరు)నాలో ఊహలకు (చందమామ)ఆశా భోస్తే పాడిన తెలుగు పాటలివే..ఇది మౌనగీతం (పాలు నీళ్లు)జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు)శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం)ఓ ప్రేమ (అశ్వమేథం) -
'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!
92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్ లేదా పాస్టల్ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్ సిల్క్ చీరలనే ఇష్టపడేవారట. ముక్కుపుడక..ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు, బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్‌గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా ఆభరణాలను ఎంచుకునేవారట. అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్'(తాయ్ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్‌తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్‌కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) (చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..) -
ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..
ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్ సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.ప్రభావం ఎలా ఉంటుందంటే..ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుందిబలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయితక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందిశరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుందిఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.నివారణ..ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..) -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్‌గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్‌ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు. భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నివాళి..లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు. అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. Growing up meant waking up to melodies that felt like home, and so many of them carried the voice of Asha Bhosle ji.From old radios in the morning to late-night songs playing softly in the background, she was always there, without us even realizing how deeply she shaped our… pic.twitter.com/OV8Ythx6ms— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) April 12, 2026 Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026 Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD— Jr NTR (@tarak9999) April 12, 2026 -
సంగీత ప్రపంచానికి తీరని లోటు..
-
ఆమె స్వరంలో ప్రకాశం .. జ్ఞాపకాలను గుర్తుంచుకుంటా: మోదీ
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఆమెకు నివాళులర్పించారు. "భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ స్వరాలలో ఒకటైన ఆశా భోంస్లే గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకింది." అని రాసుకొచ్చారు.ఆశా భోంస్లే రాగాలైనా, స్వరకల్పనలైనా, ఆమె స్వరంలో కాలాతీతమైన ప్రకాశం ఉండేది. ఆమెతో తనకు కలిగిన అనుభవాలను నేను ఎప్పటికీ మదిలో పదిలపరుచుకుంటాను అని మోదీ అన్నారు. ఆమె సేవలు తరతరాలకు స్పూర్తినిస్తునే ఉంటారని ఆశా భోంస్లే పాటలు ఎప్పటికీ ప్రజల మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆమె కుటుంబంతో పాటు అభిమానులకు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగా క్వీన్ ఆఫ్ వెర్సటాలిటీ ఆశా భోంస్లే ఏప్రిల్ 11 నిన్న శనివారం ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం చికిత్సపొందుతూ మృతిచెందారు. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోంస్లే తన ఎనిమిది దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో దాదాపుగా 20 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. -
చెల్లెలు ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
లెజెండరి సింగర్ ఆశా భోంస్లే ఆదివారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె అభిమానులు తన జీవిత ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన అక్క లతా మంగేష్కర్తో ఉన్న విభేదాన్ని షేర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో రెండు గానకోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరిపడిపోయిన ప్రేక్షకులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆందోళన చెందారు.అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు నిజమేనా..?లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అయితే వారి మధ్య గొడవలు అన్నది కొంతవరకు నిజం, కొంతవరకు అపోహలతో కూడిన విషయమని చెబుతారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్ దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. ఆపై ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీ ఉండేది.లతా మంగేస్కర్ ఎక్కువగా ప్రధాన హీరోయిన్లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్య వచ్చేది. అయితే, కొంతకాలం దూరం ఉన్న తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేశారు.1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో ఆశా భోంస్లే ఒక పాటను పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా అన్నారు ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. లతా మంగేష్కర్ 2022లో కోవిడ్-19, న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు. -
ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)
-
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆశా భోంస్లే.. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1950వ దశకంలో బాలీవుడ్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆశా భోంస్లే 1952లో సంగ్దిల్ చిత్రంతో గుర్తింపుపొందారు.1970 దశకంలో పియా తు అబ్ తో ఆజా , దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. ఆపై ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోంస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో అప్పట్లోనే సంచలనం సృష్టించిన ఆశా భోస్లే కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆశా భోంస్లే.. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందారు. -
ఆశా భోస్లే అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మనవరాలు
లెజండరి సింగర్ ఆశా భోస్లే (92) ఏప్రిల్ 11, శనివారం నాడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో స్పందించారు. ఆశా భోస్లే అనారోగ్యంతో ఉన్నారనే విషయాన్ని ఆమె ధృవీకరిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కల్పించాలని కోరారు. ఈ క్రమంలో ఆమె ఇలా రాశారు. "మా అమ్మమ్మ, ఆశా భోస్లే(Asha Bhosle) తీవ్రమైన అలసటతో ఉన్నారు. ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతకు విలువ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తాము. ఎలాంటి ప్రచారం చేయకండి" అని ఆమె కోరారు.తన కాలంలోని అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరైన ఆశా భోస్లే, 1943లో వచ్చిన 'మాఝా బాల్' అనే మరాఠీ నాటకంతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత 1948లో వచ్చిన 'చునరియా' చిత్రంలోని 'సావన్ ఆయా' పాటతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు.ఆమె సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'ఇన్ ఆంఖోం కి మస్తీ కే', 'రంగీలా రే', 'రాధా కైసే నా జలే', 'షరారా షరారా' వంటి చిరస్మరణీయ గీతాలకు ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్‌గా నిరూపించుకున్నారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. -
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
అద్నాన్ సమీ (Adnan Sami).. పాకిస్తాన్ ఈ సింగర్ స్వదేశాన్ని కాదనుకుని భారత్‌పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప స్థానం సంపాదించుకున్న ఇతడిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇవన్నీ పాకిస్తాన్‌కు గిట్టలేదు. అవకాశం దొరికినప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెట్టిందట.తల్లి చనిపోయిందని తెలిసినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అద్నాన్ సమీ మాట్లాడుతూ.. మా అమ్మ బేగం నౌరీన్ పాక్‌లో మరణించింది. తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రెండు దేశాలను కోరాను. భారత్ అందుకు అంగీకరించినా.. పాక్ మాత్రం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మా అమ్మ చనిపోయిందని చెప్పినా కూడా వీసా ఇవ్వలేదు. వాట్సాప్ వీడియోలో తన అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది.భారత్ సొంతిల్లుగా ఎలా మారిందంటే?1998లో నేను కొన్ని పాటలు రిలీజ్ చేశాను. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక నా పని అయిపోయిందని అంతా అన్నారు. నా పాటలకు మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు నా పాటలు ఎప్పుడొచ్చాయో, పోయాయో కూడా ఎవరికీ తెలీదు. నన్ను తొక్కేయాలనే అదంతా చేస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను.ఆమె సలహా వల్లే..సింగర్ ఆశా భోంస్లేతో మాట్లాడాను. ఇక్కడున్నవాళ్లు నాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇకపై లండన్‌లోనే మీతో కలిసి పని చేస్తాను అని చెప్పాను. అందుకామె లండన్‌లో రికార్డ్ చేయడం దేనికి? నీకు నిజంగా ఏదైనా కొత్తగా చేయాలనుంటే ముంబైకి వచ్చేయ్. ఇక్కడ హిట్టయిన పాటలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని చెప్పింది.కోట్లు విలువైన ఆస్తుల్ని వదులుకుని..అలా నేను ముంబై వచ్చాను. ఆమె దివంగత భర్త, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఇంట్లోనే బస చేశాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాకిస్తాన్లో వర్కవుట్ కాని పాటలన్నీ ఇక్కడ ఎంతో ఆదరణ పొందాయి. ప్రజల ప్రేమకు ఎంతగానో సంతోషించాను. డబ్బు సంపాదించడం కోసం ఇక్కడకు రాలేదు. అంతేకాదు, పాకిస్తాన్లో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వదిలేసుకుని ఇక్కడే స్థిరపడిపోయాను అని చెప్పుకొచ్చాడు.కెరీర్..అద్నాన్ సమీ.. తెలుగులో యే జిల్లా.. (శంకర్ దాదా ఎంబీబీఎస్), నచ్చావే నైజాం పోరీ.. (వర్షం), నేనంటే నాకు చాలానే ఇష్టం.. (ఊసరవెల్లి), నిన్ను చూడకుండా నేను ఉండలేనే.. (దేనికైనా రెడీ), ఓ ప్రియా ప్రియా.. (ఇష్క్) ఇలా అనేక పాటలు పాడాడు. హిందీ, ఉర్దు, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళంలో అనేక సాంగ్స్ ఆలపించాడు.చదవండి: రీరిలీజ్‌లో ఆల్‌టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ! -
ప్రముఖ సింగర్‌తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్..!
భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్‌తో మన టీమిండియా స్టార్, హైదరాబాదీ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసుకుందాం.ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయి భోంస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నారు.కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సింగర్ జనాయి భోంస్లేకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోంస్లే, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్, ముంజ్య స్టార్ అభయ్ వర్మ కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
యుగళధారతో మ్యూజిక్ థె‘రఫీ’
రఫీ సోలోలు వేన వేలు... వాటికి అభిమానులు ఉన్నారు. రఫీ డ్యూయెట్లు వేలకు వేలు... వాటికీ అభిమానులు ఉన్నారు. ఈ స్వీటు కావాలా ఆ జున్ను కావాలా అంటే చాయిస్ ఏమైనా ఉంటుందా ఎవరికైనా? రెండూ కావాలి. కాని రఫీతో డ్యూయెట్లు పాడి సరిజోడుగా నిలిచి సంగీతాభిమానులను మెప్పించిన అద్భుత గాయనీమణులను రఫీతో పాటు స్మరించుకోవాలి. డిసెంబర్ 24 రఫీ శతజయంతి. మరి ఆయనతో కలిసి పాడుదామా యుగళగీతం.లాహోర్ నుంచి ఒక అన్నను తోడు చేసుకుని బాంబేకు బయలుదేరిన రఫీ (Mohammed Rafi) తాను గాయకుడిగా బతకాలంటే ముందు సంగీత దర్శకుణ్ణి మెప్పించాలని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో నౌషాద్ చాలా పెద్ద డిమాండ్‌లో ఉన్నాడు. కాని ఆయనను నేరుగా కలిసే శక్తి రఫీకి లేదు. అందుకని అన్నాదమ్ములు ఆలోచించి నేరుగా లక్నో వెళ్లారు. అక్కడ నౌషాద్ తండ్రి ఉంటారు. ఆయన దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకుని బాంబే తిరిగి వచ్చి అప్పుడు నౌషాద్‌ను కలిశారు. ‘లాహోర్ నుంచి వచ్చావా? పాడతావా? ఏం పాడతావ్... నిన్ను వద్దనడానికి లేనంత పెద్ద రికమండేషన్ తెస్తివి’ అని నౌషాద్ రఫీని పరికించి చూసి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అప్పటికి తలత్ ఊపు మీదున్నాడు. అయినా సరే ‘దులారీ’ (1949)లో రఫీ పాడిన సోలో ‘సుహానీ రాత్ ఢల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవొగే’ పాట పెద్ద హిట్ అయ్యి రఫీ దేశానికి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ రావలసినంత పేరు రాలేదు. అప్పుడు నౌషాదే ‘బైజూ బావరా’ (1952)లో మళ్లీ పాడించాడు. ఆ సినిమాలో రఫీ పాడిన సోలో పాటలు ‘ఓ దునియాకే రఖ్వాలే’, ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’ పాటలు ఇక రఫీని తిరుగులేని గాయకుని స్థానంలో కూచోబెట్టాయి. రఫీ రేంజ్‌ను తెలిపిన పాటలు అవి. అయితే అప్పటికే నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్లిపోగా ప్రతిభను, ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టుకుంటూ లతా మంగేశ్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ పాటతో స్థిరపడింది. రఫీ, లతా తొలి పాట కామెడీ సాంగ్ అయినా ఆ తర్వాత వారి డ్యూయెట్లు సరైన రొమాంటిక్ టచ్‌ను అందుకున్నాయి. అందుకు ‘బైజూ బావరా’లోని ఈ పాటే సాక్ష్యం.తూ గంగాకి మౌజ్ మై యమునా కా ధారహో రహేగా మిలన్ యే హమారా హోహమారా తుమ్హారా రహేగా మిలన్...మేల్ సింగర్ కొందరికి సరిపోతాడు.. కొందరికి సరిపోడు అనే ధోరణి ఉంది. రఫీ.. రాజ్‌కపూర్‌కు(Raj Kapoor) మేచ్ కాడు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లకు బాగా సరిపోయేవాడు. కాని లతాకు ఆ అడ్డంకి లేదు. ఏ హీరోయిన్ గొంతైనా లతా గొంతే. మీనా కుమారి, నర్గిస్, వైజయంతీ మాల, మాలా సిన్హా.. అందరికీ లతా గొంతు. అందువల్ల రఫీ, లతాల పాటలు రాజ్ కపూర్ సినిమాల్లో తప్ప తక్కిన అన్నింటిలో కొనసాగాయి. అందరు సంగీత దర్శకులు సరైన తీపితో తయారైన రవ్వలడ్ల వంటి పాటలను వారి చేత పాడించారు.∙దో సితారోంకా జమీ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్ (కోహినూర్)∙ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే (పరాస్మణి)∙దిల్ పుకారే ఆరె ఆరె ఆరె (జువెల్ థీఫ్)∙జిల్ మిల్ సితారోంక ఆంగన్ హోగా (జీవన్ మృత్యు)∙వాదా కర్లే సాజ్నా (హాత్ కీ సఫాయి)..వీటికి అంతే లేదు. రఫీ తన కెరీర్లో షమ్మీ కపూర్‌కు పాడటానికి ఎక్కువ సరదా చూపాడు. వాళ్లిద్దరిదీ హిట్ పెయిర్. షమ్మీ కపూర్ సినిమాలో రఫీ డ్యూయెట్లు ఎక్కువగా ఆశా భోంస్లేకు (Asha Bhosle) వెళ్లినా లతా కూడా పాడింది. రఫీ–లతాల జోడి వెన్నెల–వెలుతురు లాంటిది. ఆ చల్లదనం వేరు.→ ఆశా భోంస్లేవ్యాంప్లకు పాడుతూ మెల్లమెల్లగా కుదురుకున్న గాయని ఆశా రఫీతో కలిసి గొప్ప పాటలు పాడింది. అన్నింటిలోకి కలకాలం నిలిచే పాట ‘అభీ నా జావో ఛోడ్ కర్ కె దిల్ అభీ భరా నహీ’ (హమ్ దోనో). ఈ పాటలో రఫీ బాగా పాడుతున్నాడా ఆశానా అనేది చెప్పలేం. ఓపి నయ్యర్ ఆశా చేత ఎక్కువ పాడించడం వల్ల ‘కశ్మీర్ కి కలీ’లో రఫీతో ‘దీవానా హువా బాదల్’, ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’లో ‘బహుత్ షుక్రియా బడీ మెహర్బానీ’ వంటి సూపర్హిట్లు సాధించింది. ఆర్.డి.బర్మన్ తన సంగీతంలో రఫీ, ఆశాలను అద్భుతమైన పాటల్లో కూచోబెట్టాడు. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ (తీస్రీ మంజిల్), ‘చురాలియా హై తుమ్నే జో దిల్‌కో’ (యాదోంకి బారాత్)... ఒంట్లో నిస్సత్తువను వదలగొట్టే పాటలు.→ గీతా దత్ఎంతో గొప్ప గాయని అయి ఉండి తక్కువ కాలం పాడిన గీతా దత్ (గీతా రాయ్) గురుదత్ సినిమాల్లో రఫీతో మురిపమైన పాటలు పాడింది. ‘సున్ సున్ సున్ జాలిమా’ (ఆర్ పార్), ‘హమ్ ఆప్కే ఆంఖోమే ఇస్ దిల్ కో బసాదేతో’(ప్యాసా) ఇవి రెండు గురుదత్ మీద తీసినవి. ‘సిఐడి’లో దేవ్ ఆనంద్, షకీలా మీద తీసిన ‘ఆంఖోహి ఆంఖోమే ఇషారా హోగయా’..పెద్ద హిట్. గురుదత్ సినిమాల్లో కమెడియన్ జానీ వాకర్‌కు పాటలు ఉంటాయి. జానీ వాకర్‌కు కూడా రఫీనే పాడతాడు. తోడు గీతా దత్. ‘అయ్ దిల్ ముష్కిల్ హై జీనా యహా’ (సిఐడి), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’(మిస్టర్ అండ్ మిసెస్ 55)... ఇవన్నీ దశాబ్దాలైనా నిలిచి ఉన్న పాటలు. రఫీతో పాటు గాయనీమణులు నిలబెట్టిన పాటలు.→ సుమన్ కల్యాణ్పూర్రాయల్టీ విషయంలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) రఫీకు విభేదాలు వచ్చాయి. రాయల్టీ కావాలని లతా, అక్కర్లేదని రఫీ మూడేళ్లు విభేదించి పాడలేదు. 1961 నుంచి 63 వరకు సాగిన ఈ కాలంలో రఫీతో డ్యూయెట్లు పాడిన గాయని సుమన్ కల్యాణ్‌పూర్. ‘పూర్‌మేన్స్ లతా’గా పేరుబడ్డ సుమన్‌కు గొప్ప ప్రతిభ ఉన్నా తక్కువ అవకాశాలు దొరికాయి. అయినా సరే రఫీ, సుమన్ కలిసి మంచి హిట్స్ ఇచ్చారు. వీటిలో ‘బ్రహ్మచారి’ కోసం పాడిన ‘ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్బైఠే’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ‘రాజ్ కుమార్’లోని ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ కూడా పెద్ద హిట్టే. అయితే లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్ వెనక్కు వెళ్లిపోయింది.వీళ్లే కాదు ఎందరో గాయనులతో రఫీ డ్యూయెట్స్ పాడాడు. షంషాద్ బేగంతో ‘లేకె పెహలా పెహలా ప్యార్’, ముబారక్ బేగంతో ‘ముజ్కో అప్నే గలే లగాలో’, హేమలతాతో ‘తూ ఇస్ తర్హా మేరి జిందగీమే’... లాంటి ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. సుశీలతో ‘ఇద్దరి మనసులు ఒకటాయె’, జానకితో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... ఈ పాటలు అపురూపం. రఫీ ఘనతలో రఫీ ఫ్రతిభకు మరో సగమై నిలిచిన గాయనీమణులందరికీ రఫీ శతజయంతి సందర్భంగా జేజేలు పలకాలి. రఫీకి జిందాబాద్‌లు కొట్టాలి. -
ఆశా భోంస్లే కాళ్లు కడిగిన సింగర్ సోను నిగమ్ (ఫోటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
వాళ్లు నన్ను పట్టించుకోలేదు.. అలా ఎవరకీ జరగకూడదు: వాణీ జయరామ్
ఏ వృత్తిలో అయినా పోటీ సహజం. అలా వాణీ జయరామ్ బాలీవుడ్‌కి తన వాణి వినిపించడానికి వెళ్లినప్పుడు అప్పటికే అక్కడ ‘స్టార్ సింగర్స్’గా వెలుగుతున్న అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)లో పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాట ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై ‘మధురమైన కంఠం’ అని శ్రోతల నుంచి కితాబులు అందుకున్నారు వాణీ జయరామ్. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. లత, ఆశాలు వాణీకి అవకాశాలు రాకుండా చేశారనే ఓ టాక్ ఇప్పటికీ ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంటుంది. (చదవండి: మూగబోయిన వాణి) ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరామ్ మాట్లాడుతూ – ‘‘కెరీర్ పరంగా నేను ఎవరి పేర్లూ ఉద్దేశించి మాట్లాడను. లతాజీ, ఆశాజీ గొప్ప గాయనీమణులు. వాళ్లు నాకేమైనా చేశారా? చేయలేదా? అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకరు ఏం చేశారనే విషయంపై నేను ఓ నిర్ణయానికి రాకూడదు. అయితే హిందీలో నేను విజయాలు సాధించినప్పటికీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది దురదృష్టం. అలా ఎవరికీ జరగకూడదు’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె గాయనీమణులు శంషాద్ బేగం, సుమన్ కల్యాణ్‌పూర్‌ల పేర్లను ప్రస్తావించారు. ‘‘శంషాద్, సుమన్‌లు మంచి సింగర్స్ అయినప్పటికీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయారు. ఇలా ఎందరికో జరిగి ఉండి ఉంటుంది. వారిలో నేను ఒకదాన్ని... అంతే. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’ అని కూడా వాణి అన్నారు. -
మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
ఆదివారం జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు లభించింది. ఆయన అవార్డును అందుకున్న తర్వాత కొంతసేపు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...లతా దీదీ నాకు అక్కలాంటిది. ఆమె నుంచి నేను ఎనలేని ప్రేమను పొందాను. లతా దీదీ లాంటి అక్క పేరు మీద అవార్డు వచ్చినప్పుడు, అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే అంగీకరించక పోవడం నాకు సాధ్యం కాదు అని అన్నారు. ఈ అవార్డును ప్రధాని మోదీ తన దేశ ప్రజలందరికీ అంకితం చేశారు. అంతేకాదు లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, తన సోదరి లతా మంగేష్కర్‌కు నివాళులర్పించడమే కాకుండా 'ఆయేగా ఆనేవాలా' పాట ట్యూన్‌ను హమ్ చేసింది. లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. దేశ నిర్మాణానికి ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తికి ప్రతి ఏడాది ఈ అవార్డు ఇవ్వబడుతుందని లతా మంగేష్కర్ కుటుంబం, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ పేర్కొంది. సినిమా రంగంలో చేసిన సేవలకుగానూ ప్రముఖ నటులు ఆశా పరేఖ్, జాకీ ష్రాఫ్‌లు మాస్టర్ దీనానాథ్ పురస్కారం (ప్రత్యేక గౌరవం) అందుకున్నారు. భారతీయ సంగీతానికి గానూ రాహుల్ దేశ్‌పాండేకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం లభించగా, ఉత్తమ నాటక అవార్డు సంజయ్ ఛాయాకు లభించింది. (చదవండి: ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్లో మోదీ పర్యటన.. కామెంట్స్ ఇవే..) -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఆశా భోస్లే కీలక ప్రకటన
Asha Bhosle rushes to meet sister Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. లతా మంగేష్కర్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేమందరం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం.ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు. "We hope #Latadidi recovers soon. We are praying for her recovery. Doctors have informed us that she's stable.": #AshaBhosle on #LataMangeshkar's health! Read more here: https://t.co/x9KnspxXxB pic.twitter.com/7ggXJ46ygI — Pune Mirror (@ThePuneMirror) February 5, 2022 -
యాపిల్ ఈవెంట్లో 'దమ్ మారో దమ్'
యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్ ఇండియన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐఫోన్ 13 లాంచ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ వినిపించి యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ట్విస్ట్ ఇచ్చారు. లాంచ్ చేసే ప్రోడక్ట్స్‌తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్ అవతరించింది. కానీ భారత్‌లో యాపిల్ మార్కెట్ కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఆ మార్కెట్ షేర్‌ను పెంచేందుకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ నటించిన ఇండియన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మిం 'హరేరామ హరేకృష్ణా' సినిమాలోని ప్రముఖ ఆర్డీ బర్మన్-ఆశా భోస్లే'లు పాడిన 'దమ్ మారో దమ్' మ్యాజిక్‌ను వాడారు. దీంతో యాపిల్ బాలీవుడ్ మ్యూజిక్ వాడటంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్యూపర్టినోలో జరిగిన ఈవెంట్లో ఫోన్‌ను లాంచ్ చేయడానికి సీఈవో టిమ్ కుక్ వస్తున్న సమయంలోనూ ఈ మ్యూజిక్ వినిపించింది. దీంతో ఔత్సాహికులు ఐఫోన్ 13 సిరీస్‌లోని ఐఫోన్ 13 తో పాటు ఎంట్రీ లెవల్ పాడ్, ఐపాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్ల కంటే ఎక్కువగా ఈ మ్యూజిక్ గురించే చర్చిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సైతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 13 ఫోన్ ఎలాంటి ప్రమాదాల్లోనైనా చెక్కు చెదరకుండా ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేసింది యాపిల్. ఆ వీడియోలో ఓ యువకుడు తన బైక్‌పై కస్టమర్లకు పార్శిళ్లను అందిస్తుండగా 'దమ్ మారో దమ్' సాంగ్ ఆడియా ట్రాక్ ప్లే అవ్వడం నెట్టింట్లో సందడి చేస్తోంది. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
‘ఓ బామ్మలు.. మీ డ్యాన్స్ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’
ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే.కొంతమందికి వయస్సు మీద పడుతున్న వాళ్లు అనుకున్న లక్ష్యాల్ని, కోల్పోయిన సంతోషాల్ని వయస్సుతో సంబంధం లేకుండా తిరిగి పొందాలని కోరుకుంటుంటారు. సంతోషం కోసం ఏమైనా చేయాలనుకొని ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్లు ఏం చేయాలని అనుకుంటారో అదే చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? తాజాగా ఇద్దరు బామ్మలు వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ ఆశా భోస్లే సూపర్ హిట్ సాంగ్ 'పియా తు అబ్ తో ఆజా' పాటకు ఓ ఇద్దరు బామ్మలు వేసిన స్టెప్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఓ ప్రాంతంలో అటుగా వెళ్తున్న ఆ బామ్మలకు పియా తు అబ్ తో అజా పాట వినపడింది. అంతే వయస్సుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని మరిచిపోయి ఆ పాటను అనుకరిస్తూ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో షికార్లు చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ఓ బామ్మలు.. మీ డ్యాన్స్ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే అని కామెంట్లు చేస్తుంటే మరికొందరు.. వీళ్లిద్దరిని చూస్తుంటే డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు’ అని కామెంట్ చేస్తున్నారు. -
ఆమె ప్రేమ పెళ్లిని ఎవరూ మెచ్చలేదు!
ఒక్క జీవితంలో ఆమె వంద పోరాటాలు చేసింది. ఆమె ప్రేమ పెళ్లిని ఎవరూ మెచ్చలేదు. ఆమె పాటను ఎవరూ మెచ్చలేదు. ఆమె అక్క ఆమెను ఆదరించలేదు. ఆమెను ఏ హీరోయినూ కోరుకోలేదు. కాని ఆమె నిలబడింది. కొంత ముందు వెనుకలుగానైనా చెల్లెలు కూడా అక్కంత కాగలదు అని నిరూపించింది. ఎన్నో పాటల గంపలు మనకు పంచి నేడు 88వ ఏడులోకి అడుగుపెట్టనుంది. కొన్ని నదులు ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిశాక, ఆ కలిసే చోట, నదే సముద్రమా అన్న భ్రాంతిని కలిగిస్తాయి. ఆశాభోంస్లే అలాంటి నది. సముద్రమంతటి నది. 87 సంవత్సరాల జీవితంలో, ఈ విశ్రాంత సంగమంలో ఒక్కసారి వెనక్కు చూసుకుంటే ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్ని? తిరిగిన మలుపులెన్ని? ఢీకొట్టుకున్న బండరాళ్లు ఎన్ని? విరిగి పడిన అలలు ఎన్ని? కొన్ని మాత్రమే బయటకు తెలుస్తాయి. అన్నీ ఆమెకే తెలుస్తాయి. ఒక కుండీలో రెండు రోజాపూలు పూచినప్పుడు ఒక ఇంట్లో రెండు కోకిలలు గొంతెత్తకూడదా? కాని మొదటి కోకిలకే అంగీకారం దొరికింది. రెండో కోకిల దానిని సాధించుకోవాల్సి వచ్చింది. ‘మాంగ్కే సాత్ తుమ్హారా’ అని ‘నయాదౌర్’ (1957)లో ఆశాభోంస్లే హిట్ కొట్టే వరకూ ఆమె అంతకు ముందు పాడిన పాటలకు అంతగా గుర్తింపు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినా కొనసాగింపు దొరకలేదు. గీతాదత్, షంషాద్ బేగం, లతా మంగేష్కర్ వంటి ఉద్దండులు ఆ సమయంలో చాలా ప్రతిభావంతంగా పాడుతున్నారు. లతా మంగేష్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా’ పాడి స్టార్ అయి కూచుంది. అందరూ ఆమెకే పాటలు ఇస్తున్నారు. ఆశాకు ఇచ్చేవాళ్లు లేరు. పైగా ఆమె గొంతు సన్నజాజి తీవ కాదు. పూలరెక్కా కాదు. తుమ్మెద ఝుంకారంలా ఉంటుంది. సున్నితంగా హొయలు పోయే హీరోయిన్లకు అది సూట్ కాదు. మరేమిటి చేయడం? 15-16 ఏళ్ల వయసులో పెళ్లి అప్పటికే పర్సనల్ లైఫ్‌లో ఆశా చాలా సమస్యలు ఎదుర్కొని ఉంది. తండ్రి మరణించగా ఐదు మంది సంతానం ఉన్న ఇంట్లో పేదరికం తాండవిస్తుంటే దానిని భరించలేకో, నిజంగా ప్రేమించో 15–16 ఏళ్ల వయసులో గణ్పత్రావు భోంస్లే అనే సంగీత దర్శకుడితో ప్రేమ వివాహానికి వెళ్లిపోయింది. అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టాక, మూడో గర్భంలో ఉండగా పుట్టింటికి పారిపోయి వచ్చింది. అక్కడ ఆదరణ లేకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకుంది. కాని కడుపులో ఉన్న బిడ్డ మీద మమకారంతో ఆగిపోయింది. తండ్రి వల్ల అనువంశికంగా తన వద్ద పాట ఉంది. దానినే జీవనం చేసుకుందామని నిశ్చయించుకుంది. గొప్ప గొప్ప హీరోయిన్లు మొదట కామెడీ వేషాలు వేసినట్టు ఆశా కొత్తల్లో కేవలం క్లబ్ సాంగ్స్‌కే పరిమితమైంది. హెలెన్ ఆమెకూ ఆమె హెలెన్కూ పరస్పరం మేలు చేసుకున్నారు. హెలెన్‌కు ఆశా పాడిన ‘దోనియా మే లోగోంకో’ (అప్నా దేశ్), ‘పియా తూ అబ్తో ఆజా’ (కారవాన్), ‘యే మేరా దిల్’ (డాన్) ఇవన్నీ పెద్ద హిట్స్. కాని ఎస్.డి.బర్మన్, ఓ.పి.నయ్యర్లు ఆశాకు మంచి పాటలు ఇచ్చి ఆమె గొప్ప గాయని అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్.డి.బర్మన్కు ఆశా పాడిన ‘ఆంఖో మే క్యాజీ’ (నౌ దో గ్యారా), నయ్యర్‌కు పాడిన ‘ఆయియే మెహర్బాన్’ (హౌరా బ్రిడ్జ్) చాలా మంచి హిట్స్. ఓ.పి.నయ్యర్ లతాతో ఒక్క పాట పాడించకుండా దాదాపుగా అన్ని పాటలు ఆశా చేతనే పాడించాడు. ‘మేరే సనమ్’లో నయ్యర్ కోసం ఆశా పాడిన ‘జాయియే ఆప్ కహా జాయేంగే’ క్లాసిక్. పెళ్లి కానుకగా.. ఆ తర్వాతి కాలంలో దుమారంగా వచ్చిన ఆర్.డి.బర్మన్ మంచి పాటలు ఆశాకు ఇచ్చాడు. వారివురూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆశాకు తన తరఫు కానుక అన్నట్టుగా ఆర్. డిబర్మన్ ‘చురాలియా హై’ (యాదోంకి బారాత్), ‘దమ్ మారో దమ్’ (హరే రామా హరే కృష్ణ), ‘ఓ మేరే సోనరే సోనరే’ (తీస్రి మంజిల్), ‘రోజ్ రోజ్ ఆంఖో తలే’ (జీవా), ‘మేరా కుచ్ సామాన్’ (ఇజాజత్) వంటి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కాని ఆశా భోంస్లేను సమున్నతంగా నిలబెట్టిన సినిమా ‘ఉమ్రావ్ జాన్’. గజల్ అంటే లతానే చెప్పుకునే ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఖయ్యాం ఆశాభోంస్లే చేత ఆ సినిమా పాటలన్నీ పాడించడం వాటిని పాడిన ఆశా జాతీయ పురస్కారం అందుకోవడం... అదంతా ఎప్పటి నుంచో ఉన్న ప్రతిభకు ఆలస్యంగా దక్కిన గుర్తింపు. ఉమ్రావ్ జాన్‌లో ‘దిల్ చీజ్ క్యా హై’, ‘ఇన్ ఆంఖొకి మస్తీ’ పండితుల ప్రశంసలు కూడా పొందాయి. తెలుగులో ఆశా భోంస్లే ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం’ను మొదటి పాటగా పాడారు. ‘చిన్ని కృష్ణుడు’ (జీవితం సప్తసాగర గీతం), ‘చందమామ’ (నాలో ఊసులకు), ‘ఆశ్వమేథం’ (ఓ ప్రేమా) ఆమె పాడిన మరికొన్ని పాటలు. ఆశాభోంస్లే హిందీ సినిమా పాటను ఒకే రహదారి మీద ప్రయాణించకుండా కాపాడింది. అడ్డుకుంది. రసాస్వాదన అనే గమ్యానికి చేరుకోవడానికి ఆమె పాటల దారి గుండా నడిచే అభిమానులు కోట్లాదిగా ఉన్నారు. వారందరి తరఫున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కరోనా : ఒక్క పాట.. 214 మంది గాయకులు
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కష్టసమయంలో ఒక కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతీ భారతీయుడికి సినీ గాయకులు ఉత్తేజపరిచే విధంగా సెల్యూట్ చేస్తూ పాట పాడారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 214 మంది సినీ గాయకులు 'జయతు జయతు భారతం.. వాసుదేవ్ కుతుంబక్కం' అంటూ ఆలపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో దిగ్గజ గాయని ఆశా భోంస్లే, సోనూ నిగమ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ మహదేవన్, ప్రసూన్ జోషిలు కలిసి రచించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మాట్లాడుతూ.. ' 'జయతు జయతు భారతం' ఈ కష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి నమస్కారంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడింది. ఇప్పుడు అన్ని సవాళ్లకు మించి కొత్త 'జగా హువా భారత్'లో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది .మానవాళికి అతిపెద్ద సంక్షోభాలలో ఒకటి గెలిచింది ' అని పేర్కొన్నారు. ('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') -
‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామంటూ సోషల్‌మీడియా వేదికగా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను కలిచి వేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ - ఆశా భోంస్లే ‘20 ఏళ్ల క్రితం అరుణ్ జైట్లీని కలిశాను. నాటి నుంచి నేటి వరకు ఆయనను ఇష్టపడుతూనే ఉన్నాను. ఆయన మరణం మన దేశానికి తీవ్ర నష్టం. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం జైట్లీ జీ. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.’ - అనిల్ కపూర్ ‘అరుణ్ జైట్లీ చాలా గొప్ప వ్యక్తి. లోధి గార్డెన్స్‌లో మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు ఆయనను కలిసి పలకరించే అవకాశం లభించేది. మీరు లేని లోటు తీర్చలేనిది.’ - శేఖర్ కపూర్ ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. డైనమిక్ లీడర్, ప్రతి విషయం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. అప్పుడప్పుడు ఆయన నన్ను కలవడానికి వచ్చే వారు. మేము చాలా సేపు ముచ్చటించుకునేవాళ్లం. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాంపం తెలియజేస్తున్నాను.’ - లతా మంగేష్కర్ ‘అరుణ్ జైట్లీ మరణించారని విని ఎంతో బాధపడ్డాను. ఆయన గొప్ప దార్శనీకుడు. ఆయనతో మాట్లాడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ - అజయ్ దేవగన్ ‘అరుణ్‌జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ - రితేశ్ దేశ్‌ముఖ్ -
‘అందుకే స్మృతి గెలిచింది’
‘ ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నేను రద్దీలో చిక్కుకుపోయాను. స్మృతి ఇరానీ తప్ప నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ జనంలో నా ఇబ్బందిని గమనించింది. నేను ఇంటికి క్షేమంగా చేరానని తెలుసుకునే దాకా ఆమె మనసు కుదుటపడలేదు. తను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే గెలిచింది’ అంటూ ప్రముఖ గాయని ఆశా భోస్లే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రశంసలు కురిపించారు. తన క్షేమం గురించి ఆరా తీసిన ఆమెపై ట్విటర్ వేదికగా అభిమానం చాటుకున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, సింగర్ ఆశా భోస్తే, కరణ్ జోహార్, అనుపమ్ ఖేర్, షాహిద్ కపూర్, బోనీ కపూర్, జితేంద్ర తదితర సెలబ్రిటీలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక మాజీ నటి, ఎంపీ అయిన స్మృతి ఇరానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమేథీ ఎంపీగా గెలుపొందిన ఆమె.. గురువారం రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 58 మంది కేబినెట్లో పిన్న వయస్కురాలైన మంత్రిగా చరిత్రకెక్కారు. I was stranded in the crazy rush post PM oath ceremony. No one offered to help me except @smritiirani who saw my plight & made sure I reached home safely. She cares & that’s why she won. pic.twitter.com/vDV84PrIVp — ashabhosle (@ashabhosle) May 30, 2019 -
వైరలవుతోన్న ఆశాభోస్లే ట్వీట్
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించలేము. మనుషుల మధ్య దూరాలను తగ్గించడానికి అలగ్జాండర్ గ్రాహంబెల్ కనిపెట్టిన టెలిఫోన్ మనిషిని మరింత ఒంటరిని చేసింది. సమూహంలో ఉన్నా ఎవరికి వారు ఫోన్లో మునిగిపోయి ఒంటరిగా ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం మనుషులను ఎంతలా ప్రభావితం చేసిందో ఉదాహరిస్తూ లెజండరీ గాయకురాలు ఆశాభోస్లే ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. సోమవారం ఆశాభోస్లేను కలవడానికి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కోల్‌కతా వచ్చారు. Bagdogra to Kolkata... Such good company but still, no one to talk to. Thank you Alexander Graham Bell pic.twitter.com/PCH92kO1Fs — ashabhosle (@ashabhosle) January 13, 2019 అయితే ఆశాను కలవడానికి వచ్చిన వీరు ఆమె ముందు కూర్చొని ఎవరికి వారు ఫోన్లలో బిజీ అయ్యారు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆశా ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘నన్ను చూడటానికి బగ్డోగ్రా నుంచి కోల్‌కతా వచ్చారు కానీ ఏం లాభం.. మాట్లాడేవారు ఒక్కరూ లేరు. టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండెర్ గ్రహంబెల్‌కు ధన్యవాదాలు చెప్పాలి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ఆశా. ఇలా ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాదాపు 22 వేల మంది దీన్ని లైక్ చేశారు. ‘ఆశా చేసిన ట్వీట్ నేటితరానికి కనువిప్పులాంటిదం’టూ కొందరు.. ‘అంత గొప్ప గాయని ముందు ఫోన్ పట్టుకుని కూర్చోవాలన్న ఆలోచన వారికెలా వచ్చింది?’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు. -
ఆశా భోంస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్
ప్రముఖ దర్శక–నిర్మాత యశ్ చోప్రా అంటే కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి ఎనలేని అభిమానం. చోప్రాతో టీయస్సార్‌కి మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన భౌతికంగా దూరమయ్యాక టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్’ అవార్డ్‌ను ప్రారంభించారు. 2013లో మొదలుపెట్టి ఇప్పటివరకూ లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్లకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈసారి టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ముంబైలో ఈ అవార్డు వేడుక జరగనుంది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. -
ఆశాభోస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తరువాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుంచి నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు ఇవ్వనున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి, ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ వయసులోనే నేపథ్య గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలను ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో మైలు రాయిగా నిలువబోతోంది. -
బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ
గౌహతి: ప్రముఖ గాయిని ఆశాభోంస్లే(82) రాఖీ పౌర్ణమి పండుగను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) సైనికులతో అసోంలోని గౌహతిలో జరుపుకున్నారు. ఈ రక్షాబంధన్ వేడుకను ఆర్మీ సోదరులకు అంకితం చేస్తున్నానని ఆమె ట్వీటర్లో కామెంట్ చేశారు. ఈసందర్భంగా ఫోటోలను పోస్ట్ చేశారు. ఆశా భోంస్లేను అసోం సాంప్రదాయ పద్దతిలో సైనికులు స్వాగతం పలికారు. -
ఆశాభోంస్లే కొడుకు మృతి
బాలీవుడ్ సంగీత దర్శకుడు, ప్రముఖ గాయని ఆశాభోంస్లే తనయుడు అయిన హేమంత్ భోంస్లే క్యాన్సర్ తో మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న హేమంత్.. స్కాట్లాండ్ లో మరణించారు. హేమంత్ 'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు. లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్న సమయంలో ఇలా జరగటంతో ఆ వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. 2012లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే డిప్రెషన్ కారణంగా ఆత్యహత్య చేసుకుంది. -
సెప్టెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు ఆశా భోంస్లే (గాయని), మాధవపెద్ది సురేష్ (సంగీత దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. దీని ప్రభావం వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల ప్రాపంచిక జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితం పైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. వేదపండితులు, స్వామీజీలు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఈ సంవత్సరం ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వీలయినంత వరకు ప్రశాంతంగా ఉంటూ, యోగ, ధ్యానాలలో గడపడం మంచిది. యూనిఫారం ధరించే ఉద్యోగులకు, జ్యోతిష్యులకు, వేదపండితులకు, పురోహితులకు మంచి గుర్తింపు, గౌరవ సన్మానాలు జరుగుతాయి. 8వ తేదీన పుట్టిన వారు తమను ఎవరూ గుర్తించడం లేదన్న ఆందోళన, నైరాశ్యంలో ఉంటారు. అది తప్పు అని రుజువు చేస్తూ ఈ సంవత్సరం వారికి మంచి ఆత్మస్థైర్యం, సానుకూల భావనలు అలవడతాయి. వివాహం, సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించేవారి ఆశలు ఫలిస్తాయి. గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు, ఛాతీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే నివారణ మార్గాలను అన్వేషించడం మంచిది. లక్కీ నంబర్స్: 2,5,6,8; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్. సూచనలు: నవగ్రహారాధన, కాకులకు తీపిపదార్థాలు పెట్టడం, ఆవులకు, కోతులకు ఆహారం తినిపించడం, వృద్ధాశ్రమాలలో శ్రమదానం లేదా సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
మళ్ళీ దగ్గర చేసిన పాట
విభేదాలతో దూరం జరిగిన అక్కాచెల్లెళ్ళు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇప్పుడు అనుకోకుండా దగ్గరవుతున్నారు. లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’ ఇప్పుడు ఆశా భోంస్లే పాడుతున్న ఒక పాటను జనానికి అందించనుంది. ‘ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు గానం చేశారు. ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్న లత ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. 1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. -
మీరు నావెంటే ఉండాలి!
ఏ గొంతులో మాట కూడా పాటవుతుందో... ఏ గొంతులో ప్రతి పాటా కోకిలమ్మ స్వరమవుతుందో... అలాంటి ఎవర్గ్రీన్ గాయని ఆశా భోంస్లే తాజాగా తన 82 ఏట అడుగుపెట్టారు. వివిధ భాషల్లో దాదాపు 12 వేలకు పైగా పాటలు పాడిన ఈ ‘పద్మవిభూషణ్’ పురస్కార గ్రహీత ఇన్నేళ్ళ తన స్వర ప్రయాణానికి సహకరించిన సినీ వర్గీయులకూ, అభిమానులకూ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారందరి అభిమానం, అండదండల వల్లే దేశంలోని బహుముఖ ప్రజ్ఞావంతులైన గాయనీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘నా జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మీ అండదండలు లేనిదే నేను నా లక్ష్యాలను చేరుకోగలిగేదాన్ని కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరు నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆశా భోంస్లే పేర్కొన్నారు. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు చెల్లెలైన ఆశా భోంస్లే అలనాటి మధుబాల, హెలెన్, ఆశా పారేఖ్‌ల దగ్గర నుంచి ఇటీవలి ఊర్మిళా మాతోండ్కర్, కరీనా కపూర్ దాకా అందరికీ తన గళంతో ఎన్నో సూపర్‌హిట్ గీతాలిచ్చారు. ఇప్పటికీ ఆమె వేదికపై పాటలు పాడుతుంటే, హాలు నిండిపోవాల్సిందే. ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్యారిస్‌లో జరిగిన ఆశా భోంస్లే సినీ సంగీత విభావరిలో ఆ దృశ్యమే కనపడింది. -
తోట దాటిన పరిమళం
సత్వం: తన మాజీ ప్రేమికుడికి రాసిన ఉత్తరంలో ప్రేమిక అడుగుతుంది: ‘నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి... వాటిని తిరిగి పంపించు’. (‘ఇజాజత్’- మేరా కుచ్ సామాన్) ఈ పాటకు ఆర్డీ బర్మన్ ట్యూన్ చేస్తూ, ‘ఈయన, తర్వాత కిరాణా కొట్టు జాబితాతో కూడా పాట రాస్తా’డని ప్రేమగా విసుక్కున్నాడట. కానీ అదేపాట ఆ యేడు(1987) జాతీయ ఉత్తమగీతం అయింది, ఆశాభోంస్లేను జాతీయ ఉత్తమగాయనిని చేసింది. గుల్జార్ నిక్షిప్తం చేసే సూక్ష్మ వివరాలు అట్లాంటివి! ‘పంచమ్’కు మాత్రం తెలీదా! ఒకే గొడుగుకింద ఇరువురు పంచుకున్న జ్ఞాపకాల తడిని- అతడు ఏంచేసీ తిరిగివ్వలేడనీ! భౌతికమైన వస్తువుల మీదుగానే వాటిని మించిపోయే భావాన్ని ‘గుల్జార్ సాబ్’ కల్పించగలడనీ! ‘తోట’ అని అర్థాన్నిచ్చే కలంపేరును స్వీకరించిన అదే గుల్జార్- ‘ఆంధీ’లో అంటాడు: ‘ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు)’. కాంతిబిందువులు చిలకరించే పన్నీరు; వర్షపు రాతిరి శుభ్రపడే హృదయం; చూపులు పలికే కంటిపాపల గీతం; ఆకాశం కింద, ఒక మూలకు ఒదిగి పడుకునే పేదవాడి దైన్యం; తిరిగి మళ్లీ ఎదురుచూడవలసిన ఒంటరి సాయంకాలం; పగటిని రాత్రిగా మారిపొమ్మనే విరహపు మారాం; రాకముందే వెళ్లిపోవాల్సిన చేదునిజం; అతి సున్నితమైనదేదో, హృదయం ద్రవించేదేదో బొమ్మ కడుతుంది ఆయన పాటల్లో. అలాగని, మార్దవమో, గంభీరతో మాత్రమే గుల్జార్ చిరునామా కాదు. ‘కజ్రా రే’, ‘ఛయ్య ఛయ్య’, ‘జై హో’(రహమాన్‌తో కలిసి ఆస్కార్ అందుకున్న పాట) పుట్టించే హుషారును ఎలా కాదనగలం! ‘ఒక పాట పాపులర్ అయినంతమాత్రాన, అది అల్పమైనది కానక్కర్లేదు,’ అంటాడాయన. పొద్దుట పూజగదిలోంచి వినవచ్చే శ్లోకం, పాలబ్బాయి మోగించే సైకిల్ గంట, భిక్షాటన చేస్తూ పాడుకునే పకీరు, ఇల్లాలి లల్లాయి పదాలు... వీటన్నిటా సంగీతాన్ని ఆస్వాదిస్తాడు. కవిత్వాన్ని వదిలేసి, కేవలం ఆయన దర్శకత్వాన్ని పరిగణించినా గుల్జార్ ఇచ్చింది చాలా చాలా ఎక్కువ! కోషిష్, పరిచయ్, అచానక్(1973-పాటల్లేని సినిమా), మౌసమ్, ఖుష్బూ, ఆంధీ(1975-అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నిషేధించిన సినిమా), కితాబ్, కినారా, మీరా, నమ్కీన్, ఇజాజత్, లిబాస్, లేకిన్, మాచిస్(1996-పంజాబ్ అలజడుల నేపథ్యంలోని ప్రేమకథ), హు తు తు(1999-రాజకీయనాయకుల కపటానికి వాళ్ల పిల్లలే ఎదురునిలిచే సందర్భం)... తీక్షణమైన, అర్థవంతమైన, ఉద్వేగమిళితమైన సినిమాలాయనవి! సార్వత్రికమైనదేదో పట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మనుషుల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి మాట్లాడుతాడు. మనుషులుగా పరస్పరం పొదువుకోవాల్సిన అవసరాన్నీ, బంధాలకు పొదుగుకోవాల్సిన అందాన్నీ, వాటిల్లోంచి పొందగలిగే రసాన్నీ ఆయన ఆవిష్కరిస్తాడు. కవీ, కథకుడూ, అనువాదకుడు కూడా అయిన గుల్జార్- ‘బోస్క్‌యానా’గా నామకరణం చేసుకున్న తన ఇంటిని (కూతురు మేఘనను బోస్కీ అని పిలుస్తాడు) పుస్తకాలు, పెయింటింగ్స్‌త అలంకరించాడు; మదినేమో మీర్జా గాలిబ్, గౌతమబుద్ధులతో! దేశవిభజనకు ముందు రావల్పిండి దగ్గరి దీనాలో సంపూర్ణసింగ్ కల్రాగా 1936 ఆగస్టు 18న జన్మించాడు. చిన్నప్పుడు వాళ్లనాన్నకు ఆయన ‘పున్ని’. చిక్కటి స్మృతుల్ని హృదయంలో నింపే బాల్యాన్ని అక్కడ గడిపాడు. నలుగురూ వచ్చీపోయే ఇంటి వసారా, ఒంటికాలితో కుంటుతూ పరుగెత్తిన గల్లీలు, చిట్టచివర కూర్చుని చదువుకున్న బడి... వెనక్కి జార్చుకుని సరిహద్దు దాటాడు. అందుకే, ఆయనకు చిన్నతనం అంటే ఆనందం, విషాదం కూడా. గాలిబ్ వేడుకొన్నట్టుగా ఆయనా ప్రార్థిస్తాడు: బాధాకరమైన గతపు స్మృతుల్ని మరిచిపోయేలా, ఓ దేవుడా, నాకు మరపునైనా ఎందుకు ప్రసాదించవూ! భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ‘కళ్లకు వీసాలు అక్కర్లేదు; కలలకు హద్దులు లేవు; కళ్లు మూసుకుని నేను సరిహద్దు దాటతాను,’ అని పాడుకున్నాడు. ఆయన పుట్టినరోజును ఇప్పటికీ లాహోర్‌లో జరుపుకునే స్నేహితులున్నారు. తను చదివిన స్కూల్లో ‘గుల్జార్ కల్రా బ్లాక్’ పెట్టారు. 70 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు గుండెబరువెక్కి ఆయన కళ్లు తడిసిపోయాయట! ‘ప్రేమలో కూడా బాధుంటుంది; జీవితంలో బాధ కూడా భాగమే’! ఆ బాధతో కూడా సౌకర్యంగా ఉండగలగాలి! చాయ్, కింగ్స్, సింగిల్ మాల్ట్, టెన్నిస్, మనవడు సమయ్, విడిగావుంటూ విడాకులు తీసుకోని ‘రాఖీ’ బంధం, ఆమె ఏ ఆదివారమో వండుకొచ్చే పసందైన చేపలకూర... సాహిత్య అకాడెమీ, పద్మభూషణ్, ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్ ఫాల్కే... ఇట్లాంటి కొన్ని పదాల్ని వాడి, ఆయన్నొక పాట రాసిమ్మనాలి. కాకపోతే, మరీ ‘ఆత్మగీతం’ అవుతుందని ఆయన ఒప్పుకుంటాడో లేదో! ‘బంధాలంటే ఒక దగ్గర జీవించడం, ప్రతిరోజూ కలవడం తప్పనిసరి కాదు; ఆ అవసరంలేని బంధాలు కూడా కొన్ని అలా ఏర్పడిపోతాయి’. గుల్జార్ అలాంటి ఒక బంధువేతర బంధువు! ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు). - గుల్జార్ - ఆర్.ఆర్. -
ఆప్ ఆయే... బహార్ ఆయీ...
హైదరాబాదీ..హేమలత: ఆమె రాకతో సినీ సంగీత ప్రపంచంలోకి కొత్త వసంతం వచ్చింది. అప్పటికే గానకోకిల లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోంస్లే బాలీవుడ్‌ను ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో పసితనం వీడక ముందే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే ‘తూ ఇస్ తరహ్ మేరే జిందగీ మే..’ అంటూ శ్రోతలను ఓలలాడించిన ఆ గొంతు పేరు హేమలత. అసలు పేరు లతా భట్. హైదరాబాద్‌లోని సంప్రదాయ రాజస్థానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. కొద్దికాలానికే ఆమె కుటుంబం కోల్‌కతా చేరుకుంది. బాల్యం అక్కడే గడిచింది. చిన్ననాటి నుంచే హేమలత సంగీతమంటే చెవి కోసుకునేది. ఆమె తండ్రి జయ్‌చంద్ భట్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడే అయినా, ఛాందసుడైన ఆయనకు కూతురు పాడటం ఇష్టం ఉండేది కాదు. అయినా, ఆమె రహస్యంగా పూజా పెండాల్స్ వద్ద పాడేది. హేమలత తండ్రి జయ్‌చంద్ భట్ శిష్యుడు గోపాల్ మల్లిక్ ఆమె ప్రతిభ గుర్తించాడు. జయ్‌చంద్‌ను ఒప్పించి, కోల్ కతాలోని రవీంద్ర స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఆమె చేత పాడించాడు. అప్పుడామె వయసు ఏడేళ్లు మాత్రమే. అక్కడి నుంచి ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కలకత్తా నుంచి ఆమె కుటుంబం 1966లో బాంబేకు తరలి వచ్చింది. అక్కడే ఆమె ఉస్తాద్ అల్లారఖా ఖాన్, ఉస్తాద్ రియాజ్ ఖాన్ వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ఏసుదాస్‌తో అత్యధిక హిందీ గీతాలు పాడిన ఘనత గానగంధర్వుడు కె.జె.ఏసుదాస్‌తో కలసి అత్యధిక సంఖ్యలో హిందీ గీతాలు పాడిన ఘనత హేమలతకే దక్కుతుంది. హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, రాజస్థానీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళ, మలయాళ, డోగ్రీ, కొంకణి, ప్రాకృత, సంస్కృత వంటి స్వదేశీ భాషలు, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు కలిపి మొత్తం 38 భాషల్లో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఎస్.డి.బర్మన్, మదన్మోహన్, సలిల్ చౌదరి, ఖయ్యాం, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్‌జీ-ఆనంద్జీ, రాజ్‌కమల్, ఉషా ఖన్నా, రవీంద్ర జైన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో చిరస్మరణీయమైన గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ముకేశ్, మన్నా డే, మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, ఏసుదాస్, శైలేంద్ర సింగ్, సురేశ్ వాడ్కర్ వంటి గాయకులతో కలసి యుగళగీతాలతో ఉర్రూతలూగించింది. సినీగీతాలే కాదు, భక్తిగీతాల ప్రైవేట్ ఆల్బంలు, వివిధ దేశాల్లో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కచేరీలూ ఆమెను లక్షలాది మంది అభిమానులకు చేరువ చేశాయి. ‘చిత్‌చోర్’లో పాడిన ‘తూ జో మేరే సుర్ మే...’ పాట 1977లో ఆమెకు ‘ఫిలింఫేర్’ ఉత్తమ గాయని అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఫకీరా’, ‘సునయనా’, ‘ఆప్ ఆయే బహార్ ఆయీ’, ‘ఆప్‌తో ఐసా న థే’ వంటి సినిమాల్లో హేమలత పాడిన పలు హిట్ పాటలు సంగీతాభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అమెరికాలో మ్యూజిక్ అకాడమీ అమెరికాలో మ్యూజిక్ అకాడమీ స్థాపించిన ఏకైక సినీ గాయని హేమలత మాత్రమే. ప్రపంచ సిక్కుల సంఘం, పంజాబ్ ప్రభుత్వాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్ అకల్ తక్త్‌లో 1999లో జరిగిన ఖల్సా పంత్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా ‘గుర్మత్ సంగీత్’ గీతాలను వాటి అసలు రాగాలలో ఆలపించే అవకాశం లభించింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌ల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని అందుకుంది. - పన్యాల జగన్నాథదాసు -
మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోండి
న్యూఢిల్లీ: మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోవాలని ప్రముఖ గాయని ఆశాభోస్లే హితవు పలికారు. మహిళల భద్రతకు ఇది దోహదం చేస్తుందన్నారు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనివార్యమైందన్నారు. వ్యకి ్తగత జీవితానికీ, వృత్తికీ మధ్య సమతుల్యం పాటించాలన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లడం ఎంతమాత్రం సురక్షితం కాదు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనేది ఓ అవసరంగా మారిపోయింది’ అని అన్నారు. ఫిక్కి మహిళా విభాగం నగరంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. స్వీయరక్షణ కోసం తన మనవరాలు జినాయ్ని యుద్ధవిద్యలు నేర్చుకుందంటూ ఈ సందర్భంగా ఓ ఉదాహ రణ చెప్పారు. చిన్నారులు కూడా నేర్చుకుంటే మంచిదన్నారు. ఇప్పుడు ఎక్కువశాతం మంది మహిళలు తమ భవిష్యత్తుపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. ‘ఎక్కువ శాతం సమయం రికార్డింగ్ స్టూడియోల్లో కాలం గడిపే నేను అలసిపోయి ఇంటికెళ్లిన తర్వాత విశ్రాంతి తీసుకోను. నేరుగా వంటగదిలోకే వెళతా. నా కుమారుడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక వంటకం చేస్తా’ అని తన మనసులో మాట చెప్పారు. కాగా మూస పాటలను పాడడానికి ఇష్టపడని ఆశాభోంస్లే రకరకాల పాటలను ఆలపించారు. ‘నయాదౌర్’ సినిమాలో ‘మాంగ్కేసాత్ తుమ్హారా’ అనే మెలోడీ పాటతోపాటు దమ్ మారో దమ్, మెహబూబా.. మెహబూబా, పియా తూ అబ్తో ఆజా వంటి డిస్కో గీతాలను ఆలపించి గానంలో తన నైపుణ్యంతో అందరినీ అబ్బురపరిచారు. -
కళాత్మకం : జిందగీ మే హార్మోనికా సీఖ్ లే!
మొన్న లామకాన్‌లో ‘జిందగీ మే ప్యార్ కర్నా సీఖ్లే...’ ఫూల్ ఔర్ పత్థర్ సినిమా పాటను హార్మోనికాలో సబ్నవీస్ రామకృష్ణ వినిపించారు. ఆ సాయంత్రం అనేక పాటలను హార్మోనికాలో ‘భాగ్య’నగరి కళాప్రియులు ఆలకించారు. హార్మోనికా విశేషాల గురించి, తమ అనుబంధం గురించి హార్మోనిస్ట్ రామకృష్ణ ఇంటర్వ్యూ సారాంశం.. హార్మోనికా బైట్! మాది హైద్రాబాద్‌లో స్థిరపడ్డ సంప్రదాయ కుటుంబం. తొమ్మిదేళ్ల వయసులో ‘మంజిల్’ సినిమాకు అమ్మానాన్నలతో వెళ్లాను. దిల్‌తో హై దివానా నా మానేనా మానేనా రుక్ జా నా...’ తొలిసారిగా విన్న హార్మోనిక్ ఇంటర్లూడ్ అది! హార్మోనికా బిట్తోనే పాట మొదలవుతుంది. దేవానంద్-నూతన్ ల కోసం రఫీసాబ్, ఆశాభోంస్లే ఆ పాట పాడారు. సచిన్‌దేవ్ బర్మా సంగీత దర్శకుడు. ఈ వివరాలేమీ నాకు తెలీదు. ఫస్ట్‌టైమ్ విన్న హార్మోనికా బిట్ నన్ను బైట్ చేసేసింది. హార్మోనికా-ఎకార్డియన్ల సంవాదం! సాధారణంగా పాటల్లో ఒకరు ప్రశ్నించడం మరొకరు సమాధానాలు చెప్పడం మనకు తెలుసు. అలాగే ఎకార్డియన్-హార్మోనికాలు ప్రశ్నోత్తరాల మాదిరిగా సంగీతాన్ని ప్రసరించిన పాట ‘ఫూల్ ఔర్ పత్థర్’లో ఉంది. ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆశాభోంస్లే పాడారు. హార్మోనికా ప్రశ్నిస్తోంటే ఎకార్డియన్ సమాధానం చెబుతున్నట్లుంటుంది. ఆ పాటకు, ఎకార్డియన్ ఎవరు వాయించి ఉంటారు? హిందీ చిత్ర సీమలో ఎకార్డియన్ మాస్టర్స్ నలుగురున్నారు. సుమీత్మిత్రా, రవ్వాచంద్ర, బి.బల్సారాసాబ్, ఎన్.ఎఫ్.డేనియల్ సాబ్. డేనియల్ సాబ్ ఒక్కరే సజీవులు. పుణెలో ఉన్నారు. ఆయనను ఈ మధ్యే అడిగాను ఫోన్లో... సుమీత్ మిత్రా కావచ్చు అన్నారు. ఆ పాట వినడం, ఎలక్ట్రానిక్ పరికరంపై ఎకార్డియన్కు హార్మోనికాతో జతగా విన్పించడం నాకు మహదానందం కలిగిస్తుంది. హార్మోనికా, ఎకార్డియన్లు ఒకే కుటుంబానికి చెందినవి. హార్మోనికాలోని చెక్క గదులకు నోటిద్వారా గాలిని పంపిస్తే, ఎకార్డియన్లో అదే తరహాలోని నిర్మాణంలోకి గాలితిత్తి ద్వారా పంపిస్తారు. తాతమ్మకలలో ‘బ్రహ్మం తాత చెప్పింది...’ పాటను ఎకార్డియన్ వీనులవిందుగా విన్పించడం మరచిపోగలమా! జునూన్ అంటే పిచ్చి! వృత్తిరీత్యా నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. హార్మోనికా హాబీనా? కాదు! ఎ సార్ట్ ఆఫ్ వర్షిప్. ఇట్సె జునూన్. పిచ్చి అనుకోవచ్చు. ఇది బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. తొలి తెలుగు సినీగాయని రావుబాలసరస్వతిగారు చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న కార్యక్రమంలో, భారతీయవిద్యాభవన్ కార్యక్రమాల్లో హార్మోనికా వినిపించాను. ఒకసారి ప్రముఖ గాయని గాయత్రీదేవి బెంగళూరు నుంచి వచ్చారు. ‘అప్నా దిల్ పర్వానా’ పాడాలన్నారు. ఆ పాటలో ముఖ్యమైన హార్మోనికా వాయించేవారు బెంగళూరు నుంచి రాలేదు. ఆనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు ముఖ్యంగా గాయత్రీదేవి ఎంతో ఆనందించారు. నన్నెవరైనా అభినందిస్తే హార్మోనికా మహానుభావులు రాహుల్ దేవ్ బర్మన్, మిలన్ గుప్తాలు గుర్తొస్తారు. ఆ అభినందనలు వారికే చెందుతాయి. ఆర్.డి.బర్మన్ టంగ్స్లాపింగ్ అవీ ఇవీ చేసి ఎక్స్పరిమెంట్ చేశాడు. హైద్రాబాద్‌లో ఓల్డెస్ట్ హార్మోనికా ప్లేయర్ గవ్వల రాజ్‌కుమార్‌గారు. మిలన్‌గుప్తా శిష్యుడు వినాయక్‌గారు. ఇందిరా పార్క్‌లో ‘మిలన్’ మిలన్ గుప్తా ఇండియన్ హార్మోనికా లెజెండ్. ఆయన హార్మోనికాలో క్లియర్‌గా, అక్షరం అక్షరం పలికిస్తారు. మిలన్‌గుప్తా వంటి మహానుభావుడు ప్రస్తుతం మదన్‌కుమార్ శర్మ. ఆయన పుణెలో ఉన్నారు. ఆయన కూతురు ఇక్కడున్నారు. 2014లో వస్తారు. ఆయనొస్తే ఆయన గౌరవార్థం ఒక ప్రోగ్రాం చేస్తాం. హైదరాబాద్ ఓల్డెస్ట్ హార్మోనికా ప్లేయర్ గవ్వల రాజ్‌కుమార్‌గారు. మిలన్‌గుప్తా శిష్యుడు వినాయక్‌గారికి సరిరాగలవారు లేరు. మిలన్ గుప్తా స్ఫూర్తితో ఏర్పడ్డ ‘హార్మోనికా లవర్స్ ఆఫ్ హైద్రాబాద్’ (ఏ్చఔౌఏ) లో 30 మంది సభ్యులం ఉన్నాం. మేమంతా ప్రతి ఆదివారం హైదరాబాద్ లోయర్ టాంక్బండ్ వద్ద గల ఇందిరాపార్క్‌లో ఉదయం 9-11 గంటల మధ్య కలుస్తుంటాం. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పేందుకు హార్మోనికా లవర్స్ సాదరంగా స్వాగతిస్తారు! - పున్నా కృష్ణమూర్తి ఇట్సె జునూన్. ఇట్సె మాడ్నెస్. పిచ్చి అనుకోవచ్చు. తాత్వికంగా చెప్పాలంటే ‘ఇదియే సాధనము, ఇహ-పరములకు’! ఇది బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. బ్రెత్ కంట్రోల్ వస్తుంది. ఇట్సె సార్ట్ ఆఫ్ యోగా టైప్. యోగ ద్వారా లభించే ప్రయోజనం, ఆరోగ్యం హార్మోనికా ఇస్తుంది. - రామకృష్ణ -
80వసంతాలు దాటిన ఆశాబోంస్లే
-
ఆశాభోంస్లే @ 80
ముంబై: ఆమె పాటలు హాయిగా ఉంటాయి, హుషారెక్కిస్తాయి, హృదయాన్ని హత్తుకుంటాయి. అందుకే ఆశాభోంస్లే స్వరమంటే అందరికీ అంతిష్టం. 80 వసంతాలు పూర్తిచేసుకున్న ఆశాజీ, ఇప్పటికీ పెప్పీ నెంబర్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. 1943లో గాయకురాలిగా ప్రారంభమైన ఆమె కెరీర్ ఆరు దశాబ్ధాలకు పైగా సాగింది. హిందీతో పాటు 20 భారతీయ భాషల్లో ఆశా పాటలు పాడారు. 2011లో మోస్ట్ రికార్డెడ్ ఆర్టిస్టుగా గిన్నిస్కెక్కారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్‌తో పాటు లెక్కలేనన్ని అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్‌లో ఆశాజీ బిజీగా ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


