మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

Modi Conferred With The First Lata Deenanath Mangeshkar Award  - Sakshi

ఆదివారం జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చారు.  ఈ అవార్డు ప్రదానోత్సవంలో మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు లభించింది. ఆయన అవార్డును అందుకున్న తర్వాత కొంతసేపు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...లతా దీదీ నాకు అక్కలాంటిది. ఆమె నుంచి నేను ఎనలేని ప్రేమను పొందాను. 

లతా దీదీ లాంటి అక్క పేరు మీద అవార్డు వచ్చినప్పుడు, అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే అంగీకరించక పోవడం నాకు సాధ్యం కాదు అని అన్నారు. ఈ అవార్డును ప్రధాని మోదీ తన దేశ ప్రజలందరికీ అంకితం చేశారు. అంతేకాదు లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, తన సోదరి లతా మంగేష్కర్‌కు నివాళులర్పించడమే కాకుండా 'ఆయేగా ఆనేవాలా' పాట ట్యూన్‌ను హమ్ చేసింది.

లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. దేశ నిర్మాణానికి ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తికి ప్రతి ఏడాది ఈ అవార్డు ఇవ్వబడుతుందని లతా మంగేష్కర్‌ కుటుంబం, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ పేర్కొంది. సినిమా రంగంలో చేసిన సేవలకుగానూ ప్రముఖ నటులు ఆశా పరేఖ్, జాకీ ష్రాఫ్‌లు మాస్టర్ దీనానాథ్ పురస్కారం (ప్రత్యేక గౌరవం) అందుకున్నారు. భారతీయ సంగీతానికి గానూ రాహుల్ దేశ్‌పాండేకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం లభించగా, ఉత్తమ నాటక అవార్డు సంజయ్ ఛాయాకు లభించింది.

(చదవండి:  ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్​లో మోదీ పర్యటన.. కామెంట్స్‌ ఇవే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top