ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి: ప్రధాని మోదీ | Pm Modi Speech At India Ai Impact Summit 2026 | Sakshi
Sakshi News home page

ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి: ప్రధాని మోదీ

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:54 AM

Pm Modi Speech At India Ai Impact Summit 2026

ఢిల్లీ: ఏఐ విజన్‌తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌, యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగిందన్నారు.

‘‘ప్రపంచం ఆరో వంతుకు భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏఐ కేంద్రంగా భారత్‌ మారుతోంది. ఏఐ కంట్రోల్‌ మనిషిదే అయి ఉండాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరుగుతోంది. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణకు ఈ వేదిక దోహదం చేస్తుంది. ఏఐ విజన్‌తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం. ఏఐ సమ్మిట్‌ నిర్వహణ భారత్‌కే కాదు.. దక్షిణాసియాకే గర్వ కారణం. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకంగా ఉపయోగిస్తోంది. ఏఐ కూడా కత్తికి రెండు వైపుల పదునున్న అస్త్రం. భారత్‌కు యువత.. కొత్త శక్తి, ఆస్తిగా మారారు. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement