'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి | Megastar Chiranjeevi and Jr NTR condolences to Asha Bhosle demise | Sakshi
Sakshi News home page

'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి

Apr 12 2026 3:14 PM | Updated on Apr 12 2026 3:23 PM

Megastar Chiranjeevi and Jr NTR condolences to Asha Bhosle demise

ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు.  భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళి..

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు.  అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.

లెజండరి సింగర్‌, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు.  ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు.  ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement