అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..! | Athiya Shetty trolled for sharing Lata Mangeshkar pic while Asha Bhosle | Sakshi
Sakshi News home page

Athiya Shetty: అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..!

Apr 13 2026 4:27 PM | Updated on Apr 13 2026 4:36 PM

Athiya Shetty trolled for sharing Lata Mangeshkar pic while Asha Bhosle

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు.  ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్‌ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.

నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్‌లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. ‍అయితే తనపై వచ్చిన ట్రోల్స్‌పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్‌ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.

a

కాగా.. ఆదివారం  ఏప్రిల్ 12న లెజెండరి సింగర్‌  ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు.  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.  ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement