గాయని ఆశా భోస్లేకు గుండెపోటు.. | Legendary Singer Asha Bhosle Admitted Hospital After Cardiac Arrest | Sakshi
Sakshi News home page

గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..

Apr 11 2026 9:07 PM | Updated on Apr 11 2026 10:20 PM

Legendary Singer Asha Bhosle Admitted Hospital After Cardiac Arrest

ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92)  ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు.  లోక్‌మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.

సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ,  శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్‌గా నిరూపించుకున్నారు. 

పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement