ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ సచిన్‌ కన్నీళ్లు | Sachin Tendulkar In Tears After Paying Last Respects To Asha Bhosle | Sakshi
Sakshi News home page

ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ సచిన్‌ కన్నీళ్లు

Apr 13 2026 1:51 PM | Updated on Apr 13 2026 2:15 PM

Sachin Tendulkar In Tears After Paying Last Respects To Asha Bhosle

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక‌ శ‌కం ముగిసింది. లెజెండరీ గాయని ఆశా భోంస్లే మ‌ర‌ణ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంగీత ప్రియుల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. 

ఆశా భోంస్లే అంత్యక్రియలు సోమవారం ముంబైలోని  శివాజీ పార్క్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం ముంబైలోని స్వగృహంలో ఆశా భోంస్లే భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో ఆమె పార్ధివ దేహానికి భార‌త క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త‌న భార్య అంజలితో క‌లిసి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా స‌చిన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆశా భోంస్లేతో సచిన్ కుటుంబానికి దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఆమెను తన కుటుంబ సభ్యురాలిగానే సచిన్ భావించేవారు.

చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement