వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? | IPL 2026 star Vaibhav Suryavanshi net worth, salary | Sakshi
Sakshi News home page

Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Apr 13 2026 1:04 PM | Updated on Apr 13 2026 2:42 PM

IPL 2026 star Vaibhav Suryavanshi net worth, salary

వైభ‌వ్ సూర్య‌వంశీ.. కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌స్సులోనే క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌తేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభ‌వ్ త‌న ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్‌గా మ‌లిచి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లో శ‌తక్కొట్టిన వైభ‌వ్‌.. ఐపీఎల్‌లో యంగెస్ట్ సెంచరియన్‌గా చ‌రిత్రను తిరగరాశాడు.

గత సీజ‌న్‌లో ఎక్క‌డైతే త‌న విధ్వంసాన్ని ఆపాడో ఇప్పుడు అక్క‌డే తిరిగి మొద‌లు పెట్టాడు. ఐపీఎల్‌-2026లో వైభ‌వ్ దుమ్ములేపుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచే త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తున్నాడు. బౌల‌ర్ ఎవ‌రైనా త‌న‌కు తెలిసింది మాత్రం బంతిని బాద‌డం అన్న‌ట్లగా దూసుకుపోతున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం ఈ బిహార్ చిన్నోడు వ‌దల్లేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జబితాలో వైభ‌వ్(200) అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతున్నాడు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ సూర్య‌వంశీ నెట్‌వ‌ర్త్‌, తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం. వైభవ్ తన ఆటలోనే సంపాదనలో కూడా దూసుకుపోతున్నాడు.

వైభవ్ సంపాదన ఎంతంటే?
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బిహార్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి తన కొడుకును క్రికెటర్‌ను చేసేందుకు తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశాడు. ఇప్పుడు వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. వైభవ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

15 ఏళ్ల వయస్సులోనే కోటీశ్వరుడయ్యాడు. ఐపీఎల్‌-2025 వేలంలో రాజస్తాన్ రాయల్స్ సూర్యవంశీని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌కు ముందు కూడా అతడిని రిటైన్ చేసుకుంది. అంటే రెండు సీజన్లకు గాను రూ. 2.20 కోట్లు జీతంగా అతడు అందుకున్నాడు.

అదేవిధంగా ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. లీగ్ కాంట్రాక్ట్ వాటా, మ్యాచ్ ఫీజులు కలిపితే.. వైభవ్ ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.15.35 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ఇతర అవార్డుల రూపంలో వచ్చే నగదు బహుమతులు ఇందుకు అదనం.

డొమెస్టిక్ మ్యాచ్‌లు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ), అండర్-19 మ్యాచ్‌ల ద్వారా కూడా బీసీసీఐ నుండి ఫీజులు పొందుతున్నాడు. అండర్‌-19 సిరీస్‌లో వైభవ్‌కు ఫీజు రూపంలో రోజుకు రూ.20 వేలు లభిస్తోంది. బీహార్ రంజీ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌కు రూ.1.6 లక్షల మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. 

ఐపీఎల్‌-2025లో సెంచరీ చేసినందుకు అతడికి  రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది. అదే సీజన్‌లో స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ అవార్డ్ కింద రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్‌తో పాటు రూ. 20 లక్షల టాటా కర్వ్ ఎస్‌యూవీ కార్ బహుమతిగా లభించింది. అత‌డి వ‌ద్ద టాటా క‌ర్వ్‌తో పాటు ఖ‌రీదైన‌ మెర్సిడెస్-బెంజ్ కారు కూడా ఉంది. మొత్తంగా అత‌డి నెట్ వర్త్ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శ‌ర్మ అవుట్‌?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement