ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే? | Asha Bhosle Net Worth India's One Of The Richest Female Singers | Sakshi
Sakshi News home page

Asha Bhosle: ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Apr 12 2026 4:18 PM | Updated on Apr 12 2026 4:28 PM

Asha Bhosle Net Worth India's One Of The Richest Female Singers

లెజెండరి సింగర్‌  ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె మరణం వేళ ఆశా సింగర్‌గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు.

 అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్‌ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement