రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా? | Asha Bhosle granddaughter Zanai Bhosle set for big Bollywood debut with Rishab Shetty | Sakshi
Sakshi News home page

రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?

Apr 13 2026 4:00 PM | Updated on Apr 13 2026 4:27 PM

Asha Bhosle granddaughter Zanai Bhosle set for big Bollywood debut with Rishab Shetty

ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle)  అనారోగ్య కారణాలతో  92 ఏళ్ల వయసులో  (ఏప్రిల్ 12, 2026న) కన్నుమూశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు, సంగీతాభిమానులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని దర్శించి , తుది నివాళులర్పించేందుకు వేలాదిగా  అభిమానులు  ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆమె నివాసం 'కాసా గ్రాండే'కు తరలి వచ్చారు.  వీరితోపాటు, ప్రధాని మోదీ సహా, పలువురు రాజకీయ,  సినీ రంగాలప్రతినిధులు, ఇతర సెలబ్రిటీలు ఆశామరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు.  ఈ సందర్బంగా ఆమె వారసురాలు, గాయని జానై భోంస్లే  (Zanai Bhosle) వార్తల్లోనిలిచారు. 

భారతీయ సినీ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే. తన  నాన్నమ్మలా  ఈమె గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన కథక్ నర్తకి , రచయిత్రి, నటి కూడా. ఈమె ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కుమార్తె. ఆమె లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మేనకోడలు కూడా. ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. సంగీతం , కళల పట్ల ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. 

ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్‌ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం

నాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జానై శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాయనిగా రాణించారు. వివిధ స్టేజ్ షోలలో తన నాయనమ్మ ఆశా భోంస్లేతో కలిసి  ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ మ్యూజిక్ బ్యాండ్ "6-ప్యాక్ బ్యాండ్" (6-Pack Band) లో పాటలు పాడారు.  2022 సెప్టెంబర్ 8న, ఆశా  89వ పుట్టినరోజు సందర్భంగా  జానై భోస్లే, మంచి  కవితను పోస్ట్‌ చేశారు.

సినిమా రంగ ప్రవేశం

జానై భోంస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. రిషబ్ శెట్టి సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది.  "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) అనే భారీ పీరియడ్ డ్రామాతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంస్లే పాత్రను పోషిస్తున్నారు.  ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

వ్యాపారవేత్తగా
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జునై గాయనిగా, నటి మాత్రమే కాదు.  వ్యాపారవేత్త కూడా. ముంబైలో ఆమెకు సొంతంగా యాపిల్ ఐఫోన్ (Apple iPhone) రిటైల్ స్టోర్ ఉంది, ఆశా భోంస్లే స్వయంగా తన మనవరాలి గురించి  చాలా సార్లు ప్రస్తావించేవారు. జునై చాలా ప్రతిభావంతురాలని, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని పలు సందర్భాల్లో ప్రశంసించారు.

సిరాజ్‌తో షికార్లు అంటూ పుకార్లు
2025 ప్రారంభంలో జానై భోస్లే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ల మధ్య ఉన్న సంబంధం గురించిన పుకార్లు షికార్లు చేశాయి.  అయితే, రక్షాబంధన్ రోజున సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ ఈ పుకార్లకు ఇద్దరూ  చెక్‌ పెట్టారు.

దివంగత ఆశాకు కడసారి నివాళి అర్పించేందుకు  క్రికెటర్ సిరాజ్‌ ముంబైలోని ఆమె నివాసానికి వచ్చారు. సిరాజ్‌ను చూడగానే జానై భోస్లే భోరున విలపించింది. సిరాజ్ ఆమెను ఓదారుస్తూ అక్కున చేర్చుకోవడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement