మళ్ళీ దగ్గర చేసిన పాట | Lata Mangeshkar, Asha Bhosle collaborate on new album | Sakshi
Sakshi News home page

మళ్ళీ దగ్గర చేసిన పాట

Dec 11 2014 4:00 PM | Updated on Sep 18 2019 2:52 PM

మళ్ళీ దగ్గర చేసిన పాట - Sakshi

మళ్ళీ దగ్గర చేసిన పాట

విభేదాలతో దూరం జరిగిన అక్కాచెల్లెళ్ళు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే ఇప్పుడు అనుకోకుండా దగ్గరవుతున్నారు.

విభేదాలతో దూరం జరిగిన అక్కాచెల్లెళ్ళు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇప్పుడు అనుకోకుండా దగ్గరవుతున్నారు. లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’ ఇప్పుడు ఆశా భోంస్లే పాడుతున్న ఒక పాటను జనానికి అందించనుంది.

‘ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్‌లు గానం చేశారు. ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్న లత  ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. 1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్‌కా రీ బెహ్‌కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు.

Advertisement
 
Advertisement
Advertisement