కరోనా : ఒక్క పాట.. 214 మంది గాయకులు

200 Singers Including Asha Bhosle Join Hands For One Song Became Viral - Sakshi

ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కష్టసమయంలో ఒక కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతీ భారతీయుడికి సినీ గాయకులు ఉత్తేజపరిచే విధంగా సెల్యూట్‌ చేస్తూ పాట పాడారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 214 మంది సినీ గాయకులు  'జయతు జయతు భారతం.. వాసుదేవ్ కుతుంబక్కం' అంటూ ఆలపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో దిగ్గజ గాయని ఆశా భోంస్లే, సోనూ నిగమ్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శంకర్‌ మహదేవన్‌, ప్రసూన్‌ జోషిలు కలిసి రచించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌  లిస్ట్‌లో ఉంది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మాట్లాడుతూ.. ' 'జయతు జయతు భారతం' ఈ కష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి నమస్కారంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడింది. ఇప్పుడు అన్ని సవాళ్లకు మించి కొత్త 'జగా హువా భారత్'లో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది .మానవాళికి అతిపెద్ద సంక్షోభాలలో ఒకటి గెలిచింది ' అని పేర్కొన్నారు.
('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా')

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top