అనుష్కతో హగ్స్‌.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్‌ | Naveen Polishetty Comments On Anushka Hugs In Miss Shetty Mr Polishetty Shooting Sets - Sakshi
Sakshi News home page

Naveen Polishetty-Anushka Shetty: అనుష్క కౌగిలింతల గురించి నవీన్‌ ఏమన్నాడంటే

Aug 23 2023 8:07 AM | Updated on Aug 23 2023 8:46 AM

Naveen Polishetty Learn Hug From Anushka Shetty - Sakshi

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

తాజాగ నవీన్ పొలిశెట్టి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. షూటింగ్ ప్రారంభంలో అనుష్క లాంటి స్టార్‌ హీరోయిన్‌ పక్కన నటించడం అంత సులభం కాదని నవీన్‌ తెలిపాడు. దీంతో షూటింగ్‌ ప్రారంభంలో మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నుంచి అనుష్క అందించిన ఎంకరేజ్‌మెంట్‌తో ఎలాంటి బెరుకు లేకుండా ఆమెతో కలిసిపోయానని చెప్పాడు. అలా షూటింగ్ మొత్తం సరదాగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా వల్ల తామిద్దరం మంచి ఫ్రెడ్స్‌ అయ్యాం. సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నవీన్ పేర్కొన్నాడు.

అనుష్క లాంటి స్టార్‌ నటితో కలిసి నటించారు కదా ఆమె నుంచి ఏం నేర్చుకున్నారని యాంకర్‌ నుంచి ప్రశ్న ఎదురైంది.  దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని ఇలా చెప్పేశాడు. 'సెట్స్ లో అడుగుపెట్టగానే టెక్నీషియన్స్‌కు అనుష్క ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది. కానీ  అది ఎంతో అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత.  ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అది మనలో ఎంతో పాజిటివ్‌ను ఇస్తుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్‌లో ఇదొకటి.' అని ఆయన చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: అనిరుద్‌ గురించి విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ వైరల్‌)

తాజాగ విడుదలైన ట్రైలర్‌లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుందని నవీన్‌ తెలిపాడు. అంతేకాకుండా ఆమె ఏ నటుడితోనైనా ఫర్‌ఫెక్ట్‌గా సింక్ అవుతుందని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement