Heroine Anushka Shetty Condoles Death of Rebel Star Krishnam Raju - Sakshi
Sakshi News home page

Anushka Shetty: 'ఆయన మనసు చాలా గొప్పది.. ఎప్పటికీ గుర్తుండిపోతారు'

Sep 11 2022 10:09 AM | Updated on Sep 11 2022 11:08 AM

Heroine Anushka Shetty Condoles Death Of Krishnam Raju - Sakshi

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న ప్రముఖ హీరోయిన్‌ అనుష్క శెట్టిహుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంది.

అక్కడ కృష్ణంరాజు భౌతికదేహాన్ని సందర్శించింది. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క కృష్ణంరాజు మనసు  చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును  సొంతం చేసుకున్న కృష్ణంరాజు మరణం టాలీవుడ్‌కు తీరని లోటని పలు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మరణవార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం లెజెండ్‌, పెదనాన్నను కోల్పోయిందని మంచు విష్ణు సైతం ట్వీట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement