
ఇన్ ఇనిస్టిట్యూట్ లఖోటియా కాలేజ్ బంజారాహిల్స్ క్యాంపస్ లో 'ట్రాషిక్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్' పేరిట నిర్వహించిన ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంది.

'ట్రాషిక్' అనేది 'ట్రాష్' 'చిక్'ల మేళవింపు అని, వ్యర్థాలను అద్భుతమైన ఫ్యాషన్ గా మార్చే శైలి అని సంస్థ ఎండీ మహ్మద్ అఫాన్ ముజా హిద్ తెలిపారు.

వ్యర్థం అనేది ఏదీ ఉండదు అనేదే ఈ షో సందేశంగా పేర్కొన్నారు. ఈ ట్రాషిక్ ఫ్యాబ్రిక్ అవశేషాలు, ప్లాస్టిక్ సీసాలు, వార్తాపత్రికలు ఇతర నిరుపయోగ వస్తువులు,రీసైకిల్ చేసిన ఉత్పత్తులతో దుస్తులు ఉపకరణాలను డిజైన్ చేసి ఆకట్టుకునే ఫ్యాషన్ ను విద్యా ర్థులు ప్రదర్శించారు.












