‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ట్విటర్‌ రివ్యూ | 'Miss shetty Mr Polishetty' Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Miss shetty Mr Polishetty Twitter Review: ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ టాక్‌ ఎలా ఉందంటే..

Sep 7 2023 7:12 AM | Updated on Sep 7 2023 1:32 PM

Miss shetty Mr Polishetty Movie Twitter Review In Telugu - Sakshi

నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ‘జాతిరత్నాలు’లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నవీన్‌.. చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక ఆ అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా వెరైటీగా చేయడంతో ఈ మూవీపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.

ట్విటర్‌లో ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్‌ వస్తోంది. సినిమా బాగుందని, నవీన్‌ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. అనుష్కకు కమ్‌బ్యాక్‌ మూవీ ఇది అని కామెంట్‌ చేస్తున్నారు. 

ఇప్పుడే లండన్‌లో మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమా చూశాను. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెరీ నైస్‌ సినిమా ఇది. చాలా బాగుంది. నవీన్‌ పోలిశెట్టి కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌ అద్భుతంగా ఉంది. అనుష్కకు ఇది మంచి కమ్‌బ్యాక్‌ సినిమా’అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి ఎమోషనల్‌తో కూడిన  క్లీన్‌ కామెడీ చిత్రం. అనుష్క ఎప్పటికీ రాణిలాగే ఉంటుంది. నవీన్‌ కామెడీ చాలా బాగుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement