
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యే రామ'. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్‌లో హరీశ్ నల్లా నిర్మించారు. దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీని జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. అదే రోజు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఘాటి విడుదలవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు.