Anushka Shetty: చెఫ్‌గా మారిపోయిన హీరోయిన్ అనుష్క.. ఫోటో వైరల్

హీరోయిన్ అనుష్క శెట్టి గరిట పట్టారు. తన వంటలను కస్ట్‌మర్స్‌కి రుచి చూపించేందుకు చెఫ్‌గా మారారు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కోసమే. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తున్నారు.
కాగా సోమవారం (నవంబర్ 7) అనుష్క బర్త్‌డేని పురస్కరించు కుని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
On my Birthday I am happy to Introduce myself as Masterchef 'Anvitha Ravali Shetty' from my upcoming project with @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations 😊 Can’t wait to meet u all on Big Screen 🤞🏻❤️ pic.twitter.com/jsVFlTDwMM
— Anushka Shetty (@MsAnushkaShetty) November 7, 2022