
నటి అనుష్క( Anushka Shetty). ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది అరుంధతి, బాహుబలి చిత్రాలే. నిజానికి ఈ మంగళూరు బ్యూటీ అంతకుముందు చాలా హిట్ చిత్రాల్లో నటించారు. వాటిలో ఎక్కువగానే గ్లామరస్ పాత్రలు పోషించి అభిమానులను కనువిందు చేశారు. ముఖ్యంగా 'రెండు' అనే తమిళ మూవీతో పాటు 'బిల్లా'లో స్విమ్మింగ్‌పూల్ సీన్ కోసం ఆమె అందాల ఆరబోతకు యూత్ ఫిదా అయ్యారు. అయితే ఆమెలోని నట విశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించిన తొలి చిత్రం మాత్రం అరుంధతినే. ఆ తరువాత అనుష్క పయనమే మారిపోయింది. ఏ చిత్రంలోనైనా ఒక హీరోయిన్ పాత్రను చూస్తే ఆ పాత్రలో అనుష్క అయితే ఇంకా బాగా నటించేవారు అని అనుకునే ఉన్నత శిఖరాలకు చేరుకున్న నటి ఆమె.

ఒక పాత్ర కోసమే బరువు పెంచుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది అనుష్కనే అవుతారు. అలాంటి అద్భుత నటి వయసు ఇప్పుడు 43 ఏళ్లు. అయినా అవివాహితగానే ఉన్నారు. ఈమె ప్రేమ గురించి చాలా వదంతులు దొర్లుతూనే ఉన్నాయి. కాగా చాలా మందికి బాల్యంలో లవ్ స్టోరీస్ ఉంటాయి. అనుష్క బాల్యంలోనే ఒక లవ్ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. ‘నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు అదే తరగతి చదువుతున్న సహ విద్యార్థి నా వద్దకు వచ్చి ఐ లవ్ యూ’ అని చెప్పాడు.
ఆ వయసులో ఐ లవ్ యూ అంటే ఏమిటో కూడా తెలియదు. అయినా అతనికి ఓకే అని చెప్పాను. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ మధురమైన అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు. కాగా చిన్న గ్యాప్ తరువాత అనుష్క కథానాయికగా నటించిన ఘాటీ త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా అనుష్క తొలిసారిగా మలయాళంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది.