
అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఘాటి ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 6న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు ఘాటి మూవీ పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతమందిస్తున్నారు.
#GhaatiTrailer and release date announcement on August 6th 💥 Thank u all for all the love always 🙏🏻🧿🤗😍#GHAATI
Looking forward🙃@iamVikramPrabhu
🎥 Directed by the phenomenal @DirKrish
🏢 Proudly produced by @UV_Creations & @FirstFrame_Ent
🎶 Music by @NagavelliV
🎼… pic.twitter.com/95PLxPTKch— Anushka Shetty (@MsAnushkaShetty) August 4, 2025