
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.
ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు.