విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్ | Vijay Devarakonda Latest Movie Kingdom Movie Trailer Release date | Sakshi
Sakshi News home page

Kingdom Movie Trailer: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్

Jul 22 2025 4:43 PM | Updated on Jul 22 2025 5:41 PM

Vijay Devarakonda Latest Movie Kingdom Movie Trailer Release date

విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న తాజా చిత్రం కింగ్‌డమ్. ఈ సినిమాకు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. చివరికీ ఈ నెల 31 థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

(ఇది చదవండి: గమనిక: వైరల్‌ అవుతున్న 'విజయ్‌ దేవరకొండ' స్టంట్‌?)

మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కింగ్‌డమ్‌ మూవీ ట్రైలర్‌ తేదీని ప్రకటించారు. ఈ నెల 26న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెల్లడించింది. తిరుపతిలో ట్రైలర్ గ్రాండ్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ ఫీవర్ సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కింగ్‌డమ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొనున్నారు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement