
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా కోసం గట్టిగానే శ్రమించారు. అందుకు తగ్గట్లుగానే ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వరుస ప్లాపులతో ఉన్న ఆయన ఈసారి కింగ్‌డమ్ సినిమాతో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ మెప్పించేలా ఉంది. ‘ఏమైనా చేస్తా సర్... అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్...’ అంటూ విజయ్ దేవరకొండ పేల్చిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు.
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే, 'కింగ్‌డమ్' కోసం తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి, పాత్రకు తగిన శారీరక, మానసిక శిక్షణ కూడా పొందాడు. యుద్ధ నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామా కావడంతో, ఆయన పాత్రకు తగినంత ఇంటెన్సిటీ, ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం అయ్యింది. అందుకు తగ్గట్టుగానే విజయ్ కష్టపడ్డాడు. తాజాగా విజయ్ చేసిన స్టంట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. చేతుల సాయం లేకుండా రెండు గోడలను కాళ్ళతో సపోర్ట్ చేసుకుంటూ సుమారు 12 అడుగులపైకి విజయ్ వెళ్తాడు. చాలా కష్టంతో కూడుకున్న ఈ స్టంట్ను సులువుగా విజయ్ చేసేశాడు. తమ కోసం విజయ్ చాలా కష్టపడుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అక్కడ ఉంది విజయ్ కాదంటూ విమర్శలు కూడా ఎక్కుబెట్టారు.
కింగ్‌డమ్ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం విజయ్ దేవరకొండ శారీరక శిక్షణ పొందాడు. టీజర్‌లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు, విజయ్ కొత్త లుక్ చూస్తే, ఆయన బహుశా ఫిట్‌నెస్, స్టంట్ ట్రైనింగ్తో పాటు బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌పై కృషి చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లేందుకు విజయ్ నూటికి నూరు శాతం కృషి చేశాడని నిర్మాతలు పేర్కొన్నారు. జులై 31న ఈ చిత్రం విడుదల కానుంది.
#Kingdom lo vijay stunts elane vuntayi anta ni dedication ki hat's off anna @TheDeverakonda #KingdomOnJuly31st #VijayDevarakonda pic.twitter.com/q7zRIAAvJV
— Dragon 🐉 (@Bharath111NTR) July 17, 2025