టాలీవుడ్‌ సినిమాలో నేపాల్ రాజవంశ కుమారి! | Nepal Actress In Tollywood Movie under Chitralayam Studios Banner | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ సినిమాలో నేపాల్ రాజవంశ కుమారి!

Aug 5 2025 8:01 PM | Updated on Aug 5 2025 8:19 PM

Nepal Actress In Tollywood Movie under Chitralayam Studios Banner

ఓ తెలుగు సినిమాలో నేపాల్ దేశ రాజవంశానికి చెందిన యువతి సమృద్ది కీలక పాత్ర పోషిస్తోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించగా, వేణు దోనేపూడి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సలార్‌ ఫేం టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది.

ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి. మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా.. ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement