పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ! | Sakshi
Sakshi News home page

Anushka Shetty: పెళ్లిపై హీరోయిన్ అనుష్క కామెంట్స్.. త్వరలో!

Published Tue, Sep 5 2023 6:00 PM

Anushka Shetty Comments Her Marriage Latest Interview - Sakshi

స్వీట్ అనుష్క శెట్టి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే దాదాపు 18 ఏళ్లుగా ఇక్కడే సినిమాలు చేస్తోందిగా. అలానే 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అయితే 40 ఏళ్ల వయసు దాటిపోయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చాయి తప్ప అవి నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం స్వయంగా అనుష్కనే తన మ్యారేజ్ గురించి మాట్లాడింది. త్వరలో గుడ్‌న్యూస్ వినే ఛాన్స్ ఉందనేలా కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!)

'బాహుబలి' తర్వాత హీరోయిన్‌గా పాన్ ఇండియా హోదా సంపాదించిన అనుష్క.. 'సైజ్ జీరో' సినిమాతో లావుగా మారి ప్రయోగం చేసింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గలేకపోయింది. దీంతో ఒకటి అరా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో ఆమె చేసిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి బయటపెట్టింది.

'పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. అయ. అయితే వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం అయితే కాదు. టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను' అని అనుష్క చెప్పింది. దీంతో అందరి కళ్లు ప్రభాస్‌పై పడ్డాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. దీంతో ప్రభాస్-అనుష్క మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందన్నారు. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెబుతూ వచ్చారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటికీ సింగిల్‌గా ఉన్నారు. దీంతో ప్రభాస్-అనుష్క ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement