'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి! | Bigg Boss 7 Telugu Day 2 Promo Latest | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Promo: టేస్టీ తేజతో ఆటాడుకున్న బిగ్‌బాస్

Sep 5 2023 4:36 PM | Updated on Sep 5 2023 4:56 PM

Bigg Boss 7 Telugu Day 2 Promo Latest - Sakshi

బిగ్‌బాస్ 7వ సీజన్ లో అప్పుడే గొడవలు మొదలైపోయాయి. ఆదివారం అందరినీ హౌసులోకి పంపి హోస్ట్ నాగార్జున తాళం వేశారు. ఇక సోమవారం నామినేషన్స్ స్టార్ట్ అవగా, కంటెస్టెంట్స్ మధ్య రచ్చ షురూ అయిపోయింది. ఫస్ట్ డే శివాజీ, ప్రియాంక జైన్.. తమ తమ నామినేషన్స్ గురించి చెప్పారు. దీంతో నామినేట్ అయిన వాళ్లకు శివాజీ, ప్రియాంక జైన్ కి మధ్య హాట్ హాట్‌ డిస్కషన్ సాగింది. రెండో రోజు మరిన్ని గొడవలు జరిగినట్లు అనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఫస్ట్ డే హైలైట్స్.. గొడవలు,నామినేషన్లలో ఉన్నది వీళ్లే!)

గొడవ షురూ చేసిన శోభా
సోమవారం ఏడుస్తూ కాస్త డల్ అయిన శోభాశెట్టి.. నామినేషన్స్ లో మాత్రం రెచ్చిపోయింది. భాషకు సంబంధించిన కిరణ్ రాథోడ్ తో తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆమెని, గౌతమ్ కృష్ణని కూడా నామినేట్ చేసింది. ఇక సింగర్ దామిని.. శోభాశెట్టిని నామినేట్ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. హౌసులో తనని చివరి స్థానంలో ఉంచడం అనే కారణం తనకు నచ్చలేదని ఆమెతో గొడవ పెట్టుకుంది. అలానే దామిని.. తాను చేసింది తప్పే అయ్యుండొచ్చని అంటుండగానే.. అవును తప్పే అని గట్టిగా అరుస్తూ శోభాశెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

తేజతో ఆడుకున్న బిగ్‌బాస్ 
మరోవైపు ప్రిన్స్, షకీలా.. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక టేస్టీ తేజ.. రూంలోకి వెళ్లిన తర్వాత కిరణ్, రతిక పేర్లు చెప్పాడు. అయితే వాళ్లని నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు సరిగా లేవని, నామినేట్ చేయడానికి భాష అనేది కారణం కాదని చెబుతూ.. కాసేపు తేజతో బిగ్‌బాస్ ఆటాడుకున్నాడు. అలానే అక్కడే నామినేషన్స్ రూంలో పడుకోమని చెప్పగా... 'బాయ్ బిగ్‌బాస్' తాను వెళ్లొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఫన్నీ మేనర్‌లో జరిగింది.

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement