మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా? | Naga Babu Family Foreign Tour Varun Tej Wedding Reason | Sakshi
Sakshi News home page

Naga Babu Family: ఈ టూర్ అందుకోసమే ప్లాన్ చేశారా?

Sep 4 2023 6:46 PM | Updated on Sep 4 2023 7:48 PM

Naga Babu Family Foreign Tour Varun Tej Wedding Reason - Sakshi

మెగా బ్రదర్ నాగబాబు.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వీళ్లంతా ఆఫ్రికాలో ఉన్నారు. అయితే ఇది నార్మల్ టూర్ లా అనిపిస్తున్నప్పటికీ.. వరుణ్ తేజ్, నిహారిక కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి విషయం?

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. ఈ ఏడాది జూన్‌లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ఛం చేసుకున్నాడు. దీంతో వీళ్ల పెళ్లి గురించి అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఆగస్టులో ఉండొచ్చని అన్నారు. కానీ అలా జరగలేదు. మొన్నీ మధ్య మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నవంబరులో డెస్టినేషన్ మ్యారేజ్ ఉంటుందని, తేదీ అమ్మ డిసైడ్ చేస్తుందని అన్నాడు. 

(ఇదీ చదవండి: నా లైఫ్‌లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్)

మరోవైపు 2020లో పెళ్లి చేసుకున్న నిహారిక.. చైతన్య నుంచి అధికారికంగా ఈ ఏడాది విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె లైఫ్ ఇప్పుడిప్పుడే మళ్లీ సర్దుకుంటోంది. మళ‍్ళీ నార్మల్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తోంది. నాగబాబు ఫ్యామిలీ ఫారెన్ వెళ్లడానికి ఇది ఓ కారణమని తెలుస్తోంది.

అలానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఈ వేడుక ఇటలీలో జరగనున్నట్లు చాలారోజుల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు ఇలా నాగబాబు ఫ్యామిలీ విదేశాలకు వెళ్లడానికి పెళ్లి పనులు కూడా ఓ కారణమని అనిపిస్తుంది. ఇవన్నీ నిజమైతే త్వరలో వరుణ్‌తేజ్ పెళ్లి వివరాలు.. స్వయంగా నాగబాబు వెల్లడించే అవకాశముంది.  

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement