అయ్యో.. అనుష్క సినిమా ఆగిపోయిందా?!

Anushka Shetty And Naveen Polishetty Movie Cancelled - Sakshi

ఒక పెద్ద విజయం తరువాత హీరోహీరోయిన్ల మార్కెట్‌ పెరిగిపోతుంది. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్‌  చేసుకోవడానికి వరుస ప్రాజెక్ట్స్‌, మరిన్ని అవకాశాలను చేజిక్కుంచుకుంటారు స్టార్‌లు. అంతేగాక పారితోషికం కూడా భారీగా పెంచేస్తారు. కానీ విటన్నింటికి స్వీటి అనుష్క భిన్నమనే చెప్పుకోవాలని. బాహుబలి వంటి పాన్‌ ఇండియా చిత్రాల తర్వాత అనుష్క క్రేజ్‌ మరింత పెరిగిపోయిందని అందరూ భావించారు.  ‘బాహుబలి 2’ తరువాత ఆమె తన సినిమాల సంఖ్యను బాగా తగ్గించింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. తను బరువు పెరగడం వల్లే గ్లామర్‌ పాత్రలను పక్కన పెట్టి పూర్తిగా మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోంటోంది.

ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చి ఎన్నో ప్రాజెక్ట్స్‌ను స్వీటి వదులుకుందని టాక్‌. ఈ నేపథ్యంలో ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి మహిళ నేపథ్యం ఉన్న పాత్రలను చేసింది. అయితే ‘భాగమతి’ మంచి విజయం సాధించగా.. ‘నిశ్శబ్దం’ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత అనుష్క ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఫలానా బ్యానర్‌లో.. ఫలానా హీరోతో అనుష్క చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ చివరకు అవన్నీ పుకార్లుగానే ఉండిపోతున్నాయి. ఇక తన సినిమాలను గురించిన ప్రకటనలు వచ్చినప్పటికి అధికారికంగా రావడం లేదు. ఇటీవల యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, అనుష్కా ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని జోరుగా ప్రచారం జరిగింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘రారా కృష్ణయ్యా’ ఫేం దర్శకుడు పి. మహేశ్‌ ఈ సినిమా రూపొందించనున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ అప్‌డేట్‌ వచ్చి నెలలు గడుస్తున్నా.. దీనికి సంబంధించిన తదుపరి అప్‌డేట్‌ మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ మూవీకి అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా? లేదా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్‌పై తదుపరి అప్‌డేట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top