2023: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల జాతర.. అన్ని భారీ, పాన్‌ ఇండియా ప్రాజెక్ట్సే | Sakshi
Sakshi News home page

OTT: వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌.. మహేశ్‌, చిరంజీవి, అనుష్క సినిమాలు కూడా ఇక్కడే!

Published Tue, Jan 17 2023 1:51 PM

TT: Netflix Digital Partner for 16 Telugu Upcoming Movies Including Mahesh Babu SSMB28 - Sakshi

ఓటీటీలో ఈ ఏడాది కొత్త సినిమాల జాతర నెలకొననుంది. థియేటర్లో సంక్రాంతి పండుగ సందడి ఉండగానే.. ఓటీటీలో కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ఈ సంక్రాంతికి డిజిటల్‌ ప్రియులను ఆకర్షించే పనిలో పడింది. ఎప్పుడు సినిమాలు రిలీజ్‌ అనంతరం ప్రకటన ఇచ్చే నెట్‌ఫ్లిక్స్‌ ఈసారి థియేట్రికల్‌ రిలీజ్‌కు ముందే కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తోంది.

చదవండి: Priyanka Jawalkar: పవన్‌ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే..

సంక్రాంతి సంందర్భంగా తెలుగులో రాబోయే స్టార్‌ హీరోల సినిమాలను అనౌన్స్‌ చేసింది. వాటిలో భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు పాన్‌ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రిలీజ్‌కు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్‌ దశలోనే ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి భోళా శంకర్‌, మహేశ్‌ బాబు ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28, వరుణ్‌ తేజ్‌ వీటీ 12, అనుష్క ప్రోడక్షన్‌ నెం. 14, సాయి ధరమ్‌ తేజ్‌ విరూపాక్ష, నాని దసరా, డీజే టిల్లు 2 ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన

ఇక విడుదలైన 18 పేజెస్‌, ధమాకా చిత్రాలు కూడా త్వరలో ఇక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఒక్క తెలుగు సినిమాలే కాదు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను కూడా వరుసగా ప్రకటిస్తోంది. అందులో అయినప్పుడు అతి తర్వలో మీ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే చిత్రాలు ఇవే అంటూనే థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరమే అని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ప్రియులకు సినిమాల జాతర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చిత్రాలేవో చూద్దాం! 

Advertisement
 
Advertisement
 
Advertisement