ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి! | Anushka Shetty Entry To Mollywood With Jai Surya Film, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Anushka Shetty Mollywood Entry: ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన స్వీటీ..!

Published Sat, Oct 28 2023 7:06 AM | Last Updated on Sat, Oct 28 2023 10:14 AM

Anushka Shetty Entry To Mollywood With Jai Surya Film - Sakshi

సినిమా ఇండస్ట్రీలో స్వీటీ అంటే వెంటనే గుర్తొచ్చే  పేరు అనుష్కనే. ఇటీవలే మిస్‌ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఈ బెంగళూరు భామ మొదట్లో యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సూపర్‌ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్‌గా నటించి తడితడి అందాలతో తమిళ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు. ఇంకేముంది ఈ రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 

అలాంటి గ్లామరస్‌ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి చిత్రాలతో తనలోని నట దాహాన్ని తీర్చుకున్న అనుష్క, బాహుబలి చిత్రంతో నటిగా మరో అంతస్తుకు చేరుకుంది. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సైజ్‌ జీరో అనే చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్‌ చేయని సాహసం చేశారు.

అందులోని పాత్ర కోసం బరువును విపరీతంగా పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఇప్పటి వరకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. దీంతో అవకాశాలు ఆమెకు దూరమయ్యాయనే అనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్‌ బ్యాక్‌గా నిలిచింది. 

దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్‌ చిత్రం ఫేమ్‌ రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిసింది. తన పాత్ర కొత్తగా ఉండకపోతే అనుష్క ఇందులో నటించడానికి సమ్మతించి ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement