మెగాస్టార్ ప్రశంసలే మాకు  బిగ్ సక్సెస్:  దర్శకుడు కామెంట్స్! | Ms Shetty Mr Polishetty Director Mahesh Babu ABout Megastar Review | Sakshi
Sakshi News home page

Ms Shetty Mr Polishetty: అది చూసే సినిమాకు టైటిల్ పెట్టాం: డైరెక్టర్ మహేశ్ బాబు

Sep 6 2023 5:20 PM | Updated on Sep 6 2023 6:01 PM

Ms Shetty Mr Polishetty Director Mahesh Babu ABout Megastar Review - Sakshi

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి'.   పి.మహేశ్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌  కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7న థియేటర్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నవీన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మిస్ శెట్టి- మిస్టర్‌ పొలిశెట్టి సినిమా చూసిన మెగాస్టార్ ప్రశంసలు కురిపించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

(ఇది చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!)

మహేశ్ బాబు మాట్లాడుతూ.. ' చిరంజీవి మాకు ఫోన్ చేశారు. మెగాస్టార్ ఫోన్ రావడంతో సంతోషంతో ఊగిపోయా. ఆయనను అభిమానించే వాళ్లం. మెగాస్టార్ ఫోన్ చేసి అభినందిస్తే ఎలా ఉంటుంది. మా సినిమా గురించి చిరంజీవి మాట్లాడటం సర్ ప్రైజ్ ఇచ్చింది. చిరంజీవి నాతో పాటు నవీన్‌ను ఇంటికి పిలిచి అభినందించారు.  మెగాస్టార్ ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూయర్. ఆయన అభినందనలతో మాకు బిగ్ సక్సెస్ కొట్టిన ఫీలింగ్ కలిగింది. ' అని అన్నారు. 

సినిమా గురించి మాట్లాడుతూ..' కొత్త తరహా కథలు చేసేందుకు అనుష్క, నవీన్ లాంటి స్టార్స్ సిద్ధంగా ఉన్నందువల్లే మాలాంటి డైరెక్టర్స్ కథలు రాయగలుగుతున్నామని అన్నారు.  ఈ సినిమా ఫన్ ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని తెలిపారు. సందేశాలు నేరుగా చెప్పడం లేదు.. కానీ కథలో ఆ మోరల్ కనిపిస్తుందన్నారు.  శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్‌లో చదివా.. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపారు. 

(ఇది చదవండి: షారుఖ్‌ రిస్కీ ఫైట్స్‌.. నయన్‌కు ఫస్ట్‌.. అట్లీ సెకండ్‌.. ‘జవాన్‌’విశేషాలివీ!)

Advertisement
 
Advertisement
Advertisement