విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది! | Vijay Devarakonda And Rashmika Same House Pics Viral | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Rashmika: ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారా? లేదంటే..!

Sep 6 2023 5:07 PM | Updated on Sep 6 2023 5:16 PM

Vijay Devarakonda And Rashmika Same House Pics Viral - Sakshi

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' హిట్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక కూడా షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్య తన అసిస్టెంట్ పెళ్లిలో కనిపించిన రష్మిక.. చీరలో సందడి చేసింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ కొత్త విషయం కనిపెట్టారు.

(ఇదీ చదవండి: 'రూ.కోటి' ప్రకటనతో రౌడీ హీరోకి కొత్త తలనొప్పులు)

'గీతగోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు. ఆ సినిమా హిట్ కావడం మాటేమో గానీ ఈ జంట పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత నుంచి ఎ‍ప్పటికప్పుడూ ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంది. ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే తమ మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు.

తామిద్దరం ఫ్రెండ్స్ అని.. విజయ్-రష్మిక చెప్పినా సరే ఎవరూ వినట్లేదు. అయితే ఈ మధ్య తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన రష్మిక.. ఆ ఫొటోలని షేర్ చేసింది. అయితే అందులో ఉన్నది విజయ్ దేవరకొండ ఇల్లు అని తెలుస్తోంది. అతడు పోస్ట్ చేసిన ఫొటోల్లో, రష్మిక ఫొటోల్లో గోడ ఒకేలా ఉందని నెటిజన్స్ కనిపెట్టారు. అయితే విజయ్ వాళ్ల ఇంటికి రష్మిక సరదాగా వెళ్లిందా? లేదా కలిసే ఉంటున్నారా? అనే కొత్త డౌట్స్ ఫ్యాన్స్‌కి వస్తున్నాయి. దీనిపై వాళ్లిద్దరూ క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం బయటపడదు.

(ఇదీ చదవండి: 'నూడిల్స్' మూవీ: అనుకోకుండా హీరో ఓ మనిషిని చంపేస్తే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement