breaking news
live - in relationship
-
సహజీవనంలో కూడా ఆ చట్టం వర్తిస్తుందా?
గత నాలుగు సంవత్సరాలుగా ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అంతా బాగానే ఉంది కదా పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. పోయిన ఏడాది అతన్ని వాళ్ళ ఇంట్లో చెప్పమని అన్నాను. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు అన్నారు. అప్పటినుంచి తన వ్యవహార శైలి మారిపోయింది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నాడు. తన బలవంతంపై ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను. ప్రతి వారం నాకు చెప్పకుండా ఎటో వెళ్తున్నాడు. తన వాటా అద్దెకానీ, ఇంటి సరుకులకు కానీ డబ్బు కూడా ఇవ్వడం లేదు. అడిగితే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటూ... ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటా అని మోసం చేశాడు అని కేసు పెట్టమని ఒకరు సలహా ఇచ్చారు. నాకు మాత్రం గృహహింస చట్టం కింద కేసు వేయాలి అని ఉంది. ఏం చేయమంటారు?– ఒక సోదరి, విశాఖపట్నంపెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి కూడా గృహహింస నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ప్రతి సహజీవనం కేసులో గృహహింస నిరోధక చట్టం వర్తింప చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం ‘వివాహ స్వరూపంలో ఉన్న సంబంధం’ ఏ పరిస్థితుల్లో ఉంటుందో నిర్ధారించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి సంపూర్ణమైనవి కాక΄ోయినా, అలాంటి సంబంధాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి అని కోర్టు చెప్పింది. అందులో ముఖ్యమైనవి...సంబంధం కొనసాగిన కాలవ్యవధిడీవీ చట్టంలోని సెక్షన్ 2(జ) మేరకు వారి సంబంధం ఒక సముచిత కాలం పాటు కొనసాగి ఉండాలి. ఆ కాలవ్యవధి ప్రతి కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.సహవాస గృహం (షేర్డ్ హౌస్ హోల్డ్) ఏదో ఒక సమయంలో కలిసి ఒకే ఇంట్లో నివసించారు అనే ఆధారం.ఆర్థిక వనరుల భాగస్వామ్యం ఒకరికి ఒకరు ఆర్థికంగా సహకరించడం, జాయింట్ బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, స్థిరాస్తులను ఇద్దరిపేర్లపై లేదా మహిళ పేరుపై కొనుగోలు చేయడం, వ్యాపారాల్లో లేదా షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు.గృహ వ్యవహారాల నిర్వహణ ముఖ్యంగా మహిళకు ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, ఉదాహరణకు వంట చేయడం, శుభ్రపరచడం, ఇంటిని నిర్వహించడం వంటి పనులు చేయడం.లైంగిక సంబంధం వివాహ స్వరూపంలోని సంబంధం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉండే లైంగిక సంబంధం కాదు. అది భావోద్వేగ, ఆత్మీయ బంధం, సంతానం పొందాలనే ఉద్దేశం, స్నేహభావం, పరస్పర ప్రేమాభిమానాలు, శ్రద్ధ వంటి లక్షణాలను కలిగి ఉండాలి.పిల్లలు/సంతానం పిల్లలు ఉండటం అనేది వివాహ స్వరూపంలోని సంబంధానికి బలమైన సూచన. ఎందుకంటే అది దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. పిల్లలను పెంచడం, వారి బాధ్యతలను పంచుకోవడం కూడా అలాంటి సంబంధానికి బలమైన సూచన.సామాజికంగా భార్యాభర్తలుగా ప్రవర్తించడంస్నేహితులు, బంధువులు, సమాజంలోని ఇతరుల ముందర భార్యాభర్తలుగా ప్రవర్తించడం, అలాగే తమను అదేవిధంగా పరిచయం చేసుకోవడం, ఆ సంబంధం వివాహ స్వరూపంలో ఉందని నిర్ధారించడానికి బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది.ఇరుపక్షాల ఉద్దేశం, ప్రవర్తనతమ సంబంధం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏమిటి, ఇద్దరి పాత్రలు, బాధ్యతలు ఏమిటి అనే విషయాలపై ఇరుపక్షాల ఉద్దేశం ఆ సంబంధ స్వభావాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచబడవచ్చు లేదా ప్రవర్తన ద్వారా పరోక్షంగా అర్థమవవచ్చు. వివాహానికి సాధారణంగా ఉండే లక్షణాల విషయంలో వారి ఉద్దేశమే ముఖ్యమైనది.పైన సూచించిన విధంగా మీ బంధం/సహజీవనం కొనసాగి ఉంటే మీకు గృహహింస చట్టం వర్తిస్తుంది. సహజీవనం చేస్తున్న వారు చాలామంది ఎటువంటి ఆధారాలను ఉంచుకోవడం లేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అందులో కేవలం ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉంటే మంచిది. వారి బంధాన్ని ఎవరికీ చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. పైన సూచించిన అంశాలను గుర్తుపెట్టుకుని సహజీవనం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది.అదలా ఉంటే మీకు మీ సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకుంటాను అని మోసపూరితంగా శారీరకంగా కలిశారు అంటూ బీ.ఎన్.ఎస్. లోని సెక్షన్ 69 ప్రకారం కూడా క్రిమినల్ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కానీ అది నిజమైతే మాత్రమే క్రిమినల్ కేసు పెట్టండి. సెక్షన్ 69 ప్రకారం పురుషునికి మొదటి నుండి మోసపూరిత ఉద్దేశం ఉంది అని రుజువు చేయాల్సి ఉంటుంది. మీ హక్కులు మీకు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవనం భంగపడకుండా చూసుకోండి. ప్రస్తుత బంధాన్ని ముగించవలసి వస్తే, ఆ పని చేసి కేసులను నడిపించవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది( మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్) -
మోసగాళ్లున్నారు..లివ్ఇన్పై జాగ్రత్త..లేదంటే : గవర్నర్ ఆనందీబెన్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.చదవండి : జస్ట్ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్షిప్ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్‌పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel "I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025 "విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' హిట్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక కూడా షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్య తన అసిస్టెంట్ పెళ్లిలో కనిపించిన రష్మిక.. చీరలో సందడి చేసింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ కొత్త విషయం కనిపెట్టారు. (ఇదీ చదవండి: 'రూ.కోటి' ప్రకటనతో రౌడీ హీరోకి కొత్త తలనొప్పులు) 'గీతగోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు. ఆ సినిమా హిట్ కావడం మాటేమో గానీ ఈ జంట పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడూ ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంది. ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే తమ మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం ఫ్రెండ్స్ అని.. విజయ్-రష్మిక చెప్పినా సరే ఎవరూ వినట్లేదు. అయితే ఈ మధ్య తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన రష్మిక.. ఆ ఫొటోలని షేర్ చేసింది. అయితే అందులో ఉన్నది విజయ్ దేవరకొండ ఇల్లు అని తెలుస్తోంది. అతడు పోస్ట్ చేసిన ఫొటోల్లో, రష్మిక ఫొటోల్లో గోడ ఒకేలా ఉందని నెటిజన్స్ కనిపెట్టారు. అయితే విజయ్ వాళ్ల ఇంటికి రష్మిక సరదాగా వెళ్లిందా? లేదా కలిసే ఉంటున్నారా? అనే కొత్త డౌట్స్ ఫ్యాన్స్‌కి వస్తున్నాయి. దీనిపై వాళ్లిద్దరూ క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం బయటపడదు. (ఇదీ చదవండి: 'నూడిల్స్' మూవీ: అనుకోకుండా హీరో ఓ మనిషిని చంపేస్తే?) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'సహజీవన భాగస్వామి అత్యాచారం చేశాడు'
పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువకుడిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. అనిల్ (22) అనే యువకుడు కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్నాడని, అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుండటంతో ఎస్జీఎం నగర్ ప్రాంతంలోని ఓ అద్దె ఫ్లాటులో కలిసి ఉండేవారు. అనిల్ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని, తర్వాత తనను దూషించి ఇల్లు ఖాళీ చేయాల్సిందగా చెప్పాడని తెలిపింది. తర్వాత తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరించాడంది. దాంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.


