
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.
వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
చదవండి : జస్ట్ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!
లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్‌పై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel
"I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025
"విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.
MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్‌వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.