
సొంతింటి కల అనేది చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. అంతేకాదు తమలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్దిదాయకమైన స్టోరీ ఒకటి ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.పదండి ఆ వివరాలు తెలసుకుందాం.
భారతదేశంలో ఇల్లు కొనడం దశాబ్దాల కష్టం దాగి ఉంటుంది. అదీ ఒక మామూలు శ్రామికమహిళకు ఇంకా కష్టం. సూరత్‌కు చెందిన ఒక ఇంటి పని మనిషి కొత్త చరితను లిఖించింది ఎన్నో అవమానాల్ని, అవహేళల్ని తోసి రాజని సొంతింటి కలను నెరవేర్చుకుంది.సూరత్‌లో కేవలం రూ. 10 లక్షల రుణంతో రూ. 60 లక్షల 3BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని ఆమె యజమాని నళిని ఉనగర్ ఈ స్టోరీని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని, చాలా సాధారణంగా తనతో మాట్లాడుతూ సూరత్‌లో తాను రూ.60 లక్షల అపార్ట్‌మెంట్ కొన్నానని చెప్పిందని తెలిపింది. అంతే కాదు, ఆమె ఇప్పటికే రూ.4 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు చేసిందట ఇందుకోసం ఆమె తీసుకున్న కేవలం రూ.10 లక్షల రుణంతో ఇవన్నీ చేసుకుంది.. దీనికి నిజంగా షాకయ్యాను అంటూ నళిని ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!
దీనికి ఒక యూజర్ స్పందిస్తూ'మీరు ఎందుకు షాక్ అవుతున్నారు? ఆమె విజయానికి సంతోషించండి!' అన్నదానికి రిప్లై ఇస్తూ 'సంతోషంగా ఉన్నాను. కానీ సమాజంలొ తరచుగా ఇంటి పనిలో ఉన్నవారు పేదోళ్లనే చులకన భావం ఉంటుందనీ, కానీ చాలామంది డబ్బును తెలివిగా మేనేజ్ చేసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాదు మరికొందరు కేఫ్‌లు, గాడ్జెట్‌లు , ట్రిప్‌లపై డబ్బు ఖర్చు చేస్తారని ఆమె కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మ్యేజికో,మంత్రమో కాదు, ఆమె ఆర్థిక నిర్వహణకు, తెలివిగా పొదుపు చేసిన వైనానికి నిదర్శనమంటూ ప్రశంసించారు.